అసలీ కుర్రాడు ఇంత deludedగా ఎలా తయారయ్యాడు? అసలు ఈ కుర్రాడు మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్ధం ఉందా? మొదటేమో యుధ్ధాన్ని ఊహించాడు, ఇప్పుడేమో ఇదంతా మనం వైరస్‌తో చేస్తున్న యుధ్ధమని బుకాయిస్తున్నాడు. యుధ్ధమొస్తుందని చెప్పాడుకాబట్టి, దానికి అనుగుణంగా రవాణ వ్యవస్థ స్తంభించి పోతుందని చెప్పాడు. ఇప్పుడేమో దాన్ని ఈ విపత్తుకు అన్వయిస్తున్నాడు. ఈ మూడురోజులూ ముఖ్యమన్నాడు. ఇది రాసేనాటికి జర్మనీలో కెవలం ఐదొందల కొత్త కేసులు నమోదయ్యాయి (ఇంతకుముందు ఈ లెఖ్ఖ ఐదువేలకు పైన ఉంది) ఇండియాలో ముప్పైఐదు (గత రెండురోజులుగా ఇది వరిసగా 100, 160 ఉంది). సరే అదంతా వదిలెయ్యండి ఇంకాసేపట్లో కేసులు పెరిగితే ఆ సంఖ్యా పెరుగుతుంది. చంద్రుడికీ droplets వ్యాపించడనికీ సంబంధమేమిటి అసలు? అంటే ఒక droplet మీద భూమి యొక్క ఆకర్షణ శక్తి కన్నా చంద్రుడి ఆకర్షణ శక్తి ఎక్కువగా పనిచేస్తుందా? ఇదేనా న్యూటన్ చెప్పిన m1*m2/R2 తెలియజేసేది? సైన్స్ గురించి ప్రాధమిక అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటమేమిటి? ఈ కుర్రాణ్ణి ఛైల్డ్‌హోంకు ఎందుకు తరలించకూడదు?
కాలసర్పయాగమట! మతున్న మాటలేనా ఇవి? వైరస్‌ని అంతమొందించడం తులసి, పసుపుతో అయ్యేదైతే ప్రపంచదేశాలన్నీ అదేపని చేసుండెవిగా? ప్రపంచదేశాలన్నీ అంత మతిలేనివా? కరోనా విపత్తులో hand sanitizerగా కూడా పనికిరాని పసుపు, తులసిల మీద మన ప్రాణాలు ఆధార పడాలా? అసలు వీళ్ళకి వైరస్‌ల గురించి ఏంతెలుసు? యాంటీబాక్టీరియల్‌కీ, యాంటీవైరల్‌కీ తేడా తెలియని వాళ్ళమాటలు మనం విని మనం ప్రాణాలమీదకు తెచ్చుకోవాలా? ఓపని చెయ్యండి సాములారూ... ముందుగా మీరు కరోనా తెచ్చుకోండి, తరువాత మీరు ఆవుచ్చో, ఇంకెవడుచ్చో, తులసినీళ్ళో ఇంకేదో తాగండి, మీకు నయమైతే మేమూ అదే చేస్తాం. ప్రతొక్కడు సలహాలిచ్చేవాడే. తనదికాకపోతే కాశీ దాకా డేక మన్నాడట వెనకటికొకడు.
ముందు వీళ్ళు ఈ శాడిజాన్ని వదిలించుకొని, false assurances ఇవ్వడం మానుకోవాలి. మనం కుంచెం బుర్రలో గుజ్జు పెంచుకోవాలి. ఇప్పుడు మనకి మహాభారత్ సీరియల్ కన్నా ముఖ్యమైనది సైన్స్ ప్రోగ్రాములు. మనం ఆపని మాత్రం చెయ్యొద్దేం! జనాల్ని జాగ్రత్తగా మతమౌఢ్యం అనే గంపకింద కప్పెట్టేద్దాం.
ఈవిషయంలో ప్రపంచదేశాల్ని చూసి ఇండియా సిగ్గుతెచ్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంది. ఆఖరికి సౌదీలో కూడా, దేవుడు పీకేదేమీలేదని తెలుసుకొని, అన్నీ మూసుకొని మందులు మింగుతున్నారు. ఇండియన్లకేం దొబ్బుడాయ్!!