Wednesday, September 25, 2019

నాయకులు

ఒకప్పుడు భారత రాజకీయ నాయకూ మాత్రమే ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారు. ఇప్పుడు వారికి ట్రుంపుడూ జతకలిశాడు.

మొన్నేమో ఆర్ధికమంత్రి గారు "ఆడలేక మద్దెల ఓడన్నట్లు" ఏవేవో మాట్లాడారు. ఈవిడ రాఫెల్ విషయంలోనూ ఇలాగే మాట్లాడినట్లు గుర్తు. ఇవిడేదేదో చెప్పేది. ఆ డసో వాడు రెండో రోజు ఈవిడ చెప్పేదానికి విరుధ్ధంగా ఇంకోటేదో చెప్పేవాడు. నానా రభస. కంఫ్యూజను. చివరాఖరికి ఈ మొత్తాన్నీ రేశరహస్యాల పరిరక్షణ పేరుతో గంపకింద పెట్టేశారు. ఆశ్చర్యకరంగా సుపృఈం కోర్టూ "ఒకే" అనేసింది. 

రక్షణమంత్రిగారు మొన్న ఇంకేదో అనేసారు. "హిందీ" మీదుగా దేశంలో ఏకత్వాన్ని సాధించాలని. హిందీ భాష ఎలా పుట్టిందో ఆయనకు తెలిస్తే ఇలా మాట్లాడేవారు కాదు. అయినా ఏ హిందీ బాబు? ఎవరి హిందీ? ఏ మాండలికం. అపని ఇంగ్లీషు భాషతో చెయ్యొచ్చుగా. "యాంటీ నేషనల్ శక్తులు" ఎలాగూ పాకిస్థాన్ వెళ్ళరు. వాళ్లనప్పుడు ఏకంగా అమెరికా పంపిచెయ్యొచ్చు. వాళ్ళు ఖుష్. మనకెలాగూ సెన్సిబుల్ గా ఆలోచించేవాళ్ళు అఖ్ఖర్లేదు. వాళ్ళనఖ్ఖడకి పంపించేస్తే, వాళ్ల తంటాలు వాళ్ళు పడతారు. ఈ ప్రబుధ్ధుడే మొన్నోసారి ఆధార్‌తో పనిలేకుండా ఇంకో కార్డును ప్రవేశపెడతాం అన్నాడు. ఎంత అద్భుతమైన ఆలోచన!! ముందుగా పాన్ కార్డు తెచ్చుకోమని దుంపదెంచారు. అదే సర్వస్వం అన్నారు. ఇప్పుడు తీరాదాన్ని బ్యాంకులు, ఆదాయపన్నువాళ్ళు తప్ప పట్టించుకొనే నాధులు లేరు. తరువాత ఆధార్ కార్డు. దాన్ని తెచ్చుకోమని రాచి రంపాన పెట్టారు. ఆధార్ లేనివాడికి అన్నీ కట్‌చేస్తాం అన్నారు. దాని తీసుకొనొచ్చి, ప్రతిదానికీ లింకు చేశారు. అదొక్క కార్డుతో కార్డుహోల్డరుడి వయసు, ఫోన్ నెంబరు, బ్యాంకకౌంటు, కారు నంబరు, వాడి సెక్సు, ప్రవర, కులం, గోత్రం అన్నీ తెలుసుకోవచ్చని ప్రపంచ సెక్యూరిటీ మేధావులు గోలపెట్టినా వినలేదు. ఇహ మాకు వేరే పనేమీ ఉండదనుకున్నావా నాయనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు కొత్త కార్డులు తీసుకొస్తే, మేము నానా తిప్పలూ పడి వాటిని సాధించడానికి గవర్నమెంటు ఆఫీసులచుట్టూ తిరగాలా?

మోదీకూడా స్పీచుల్లో ఏందేందో మాట్లాతాడు. ఈయన గణిత, చరిత్ర పరిజ్ఞానాలు అధ్బుతం మరియు అనితర సాధ్యం. ఆమధ్యో ఇంటర్వ్యూలో ఇలాగే రోడ్డుమీద పకోడీలేసుకొనేవారికి ఉద్యోగం ఉన్నట్లుగానే భావించాలి అని చెప్పి ఉద్యోగాల కల్పనకూడా హుళక్కే అని చెప్పకనే చెప్పాడు. అదేంటో అవసరమైన వాటినిగురించి తప్ప మిగతా అన్ని విషయాలమీద వెంటనే స్పందిస్తాడు. టెక్నాలజీమీద ఈయనకున్న పట్టు రాడార్ల విషయంలో చూశాం. డిమానిటైజేషన్ గురించి ఈయన చేసిన హడావిడీ అంతాయింతాకాదు.

ఇప్పుడు ట్రంపు. ఆ మధ్య పాలస్తీనా విషయంలో ఏదో వెర్రి వ్యాఖ్యలు చేశాడు. ఆయనది చెయ్యవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. ఉత్తర కొరియా విషయంలోనూ, ఇరాను అప్పుడప్పుడూ పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యన ఈ బాబుగారికి తానుచేసిన ఘనకార్యాలకి నొబెల్ ప్రైజైతే బాగా సరిపోతుందని అనిపించిందిట. ఆమధ్య క్లింటనుకూ అలాగే అనిపించింది, ఆయనేదో యాసర్ అరాఫత్‌తో రాసుకుపూసుకు తిరిగాడు కాబట్టి , తాను సెర్బియా మీద బాంబులేసినా అదేమంత పట్టించుకోనఖ్ఖర్లేని విషయం అని అయనకు అనిపించింది. ఇప్పుడు ఈయన. ఇప్పటికీ భారత్ పాకిస్థాన్‌ల మధ్య మంచిసంబంధాలకోసం పనిచేస్తానంటూ అనసరపు పేరంటాలు పాత్ర బాగా పోషిస్తున్నాడు. నిన్న ఏకంగా మోదీని జాతిపిత అని సంబోధించి, వ్యవహారాన్ని పరాకాష్టకు చేర్చాడు. అసలు భారతమాత అన్న కాన్సెప్టే అనవసరపు కాన్సెప్టు, ఇకమళ్ళీ జాతిపిత అనేది ఇంకో అనవసరపు కాన్సెప్టు. ఇప్పుడు ఏకంగా జాతిపితలు (బహువచనం) అట. పనిలో పనిగా జాతికి బాబాయినీ, పిన్నినీ, తాతల్నీ అవ్వల్నీ, మరదళ్ళనీ, వదినల్నీ కూడా మనకు తెలియజేస్తే బాగుంటుందనుకుంటున్నాను. జాతిబామర్ధి ఎవరో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది.

వీళ్లందరికంటే గందరగోళంగా మాట్లాడే ఒకే ఒక్కడు పవన్ కల్యాణ్. అయన గెద్దలాగే అసలువిషయం అనే కోడిపిల్లచుట్టూ గిరికీలు బాగా కొడతాడుగానీ, అసలువిషయాన్నిమాత్రం మాత్రం పొరపాట్నకూడా ముట్టుకోడు. అయనకు భయం అసలువిషయం చర్చిస్తే, ఒకట్రెండు నిమిషాలకంటే మాట్లాడ్డనికి తనదగ్గర సబ్జెక్టులేదని. అందుకే అయనగురించి ఆయన చెప్పుకుంటాడు. వాళ్ళు పార్టీ సమావేశాలు అని చెప్పుకున్నా నేను వాటిని ఇంటర్వ్యూలు అనో ఏకపాత్రాభినయాలు అనో అంటాను.

Tuesday, September 10, 2019

చంద్రయానమూ - హీలియమూ

ఈ మధ్యే చంద్రయాన్ వైఫల్యాన్నిగూర్చి తెలుసుకొని, ప్రపంచమే బాధపడింది. ఆఖరుకి పాకిస్తాన్ శాస్త్రవేత్తలుకూడా మంచి ప్రయత్నమని అభినందించారు (రాజకీయ నాయకులు నోరు పారేసుకున్నారు. అదివేరేవిషయం).

అదలా ఉంచితే చంద్రుడిమీదున్న హీలియం నిల్వలు గమనించుకురావడం (తరువాత్తరువాత తవ్వుకురావడం) చంద్రయాన్ లక్ష్యాల్లో ఒకటని ఒకానొక సైటువాళ్ళు తెగ ఊదరగొట్టేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు వీళ్ళకెలా తెలిసిపోతుంటాయో నాకర్ధం కాదు. నిజమే హీలియం అరుదైన మూలకమే! దానివల్ల ఎన్నోఉపయోగాలున్నాయి నిజమే. జడవాయువైన కారణంగా అది ఏ రసాయనిక చర్యల్లోనూ by product గా వెలువడే అవకాశమే లేదు. మనకు దొరుకుతున్న హీలియంకూడా యురేనియం అణువులు విఛ్ఛిన్నమైనప్పుడు భూమిపొరల్లో చిక్కుబడిపోయి, ఇప్పుడు ఏ సహజవాయు నిక్షేపాల్లోనో, బైటపడుతుంది. అంతకు మించి మనం హీలియం విషయంలో చెయ్యగలిగేది ఏమీ లేదు.

ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వద్దాం. వాయు అణువుల వేగాన్ని RMS velocity (Root Mean Square Velocity)గా కొలుస్తారు. ఎప్పుడైతే ఒక వాయువు RMS velocity ఒక గ్రహపు escape velocity కంటే ఎక్కువో, అప్పుడు ఆ వాయువు ఆ గ్రహమ్మీద నుంచి రోదసిలోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు భూమి escape velocity హైడ్రోజన్, హీలియంల RMS velocity కంటే తక్కువ. కాబట్టి భూమికి హైడ్రోజన్, హీలియంలను నిలిపిఉంచే సామర్ధ్యంలేదు. అదే ఆక్సిజన్, నైట్రోజన్‌లను మాత్రం నిలిపి ఉంచగలదు. చంద్రుడి విషయానికే వస్తే, చంద్రుడిమీద ఏవాయువూ నిలువదు. మరి హీలియంమాత్రం ఎలా నిలుస్తుంది? ద్రవరూపంలో? హీలియం ద్రవరూపంలో ఉండాలంటే -268 డిగ్రీల సెల్షియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కావాలి. చంద్రయాన్ లక్యమైన చంద్రుడి దక్షణధృవం దగ్గర ఉష్ణోగ్రతలు -232 కంటే తగ్గే అవకాశమే లేదట. ఘనరూపం అనేది అసలు సోయిలోకేరాదు. అలా ఘనరూపంలో ఉండాలంటే -272.20 డిగ్రీల సెల్షియస్ ఉండాలి. ఇది కేవలం .80 డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత. సహజ పరిస్థితుల్లో ఒక గ్రహ ఉపరితలమ్మీద ఇంత గక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం అసాధ్యం. అందునా సహజ పరిస్థితులవల్ల చల్లబడి ఘనరూపంలోకి మారలేని ఒకే ఒక వాయువు హీలియం (మనం హీలియంని ఘనపదార్ధంగా మార్చేటప్పుడు పీడనాన్ని పెంచుతాం). ఆ సైటువాళ్ళకి ఇలాంటి హీలియంని మోసుకొచ్చేంతటి వెర్రి ఆలోచనలు ఎందుకొస్తున్నాయో పరమాత్ముడికెరుక!

Wednesday, September 4, 2019

pyaar ka pehla KHat likhne meiN, waqt to lahta heiN



To write the first love letter, it takes time
For the baby birds to fly, it takes time

Not for her body, I wanted to reach for her heart
To travel long distances, it takes time

When a relationship or a ship has a hole in it (wrecked),
To get any help, no matter how much you pray, it takes time

I have found the cure for my injured heart
But for the serious injuries to get cured, it takes time

To write the first love letter, it takes time
For the baby birds to fly, it takes time

To write the first love letter, it takes time
For the baby birds to fly, it takes time