Thursday, April 30, 2020

The Lift Boy (2019)

The Lift Boy Poster

నెట్‌ఫ్లిక్స్ పుణ్యమాని ఇవ్వాళ ఈ సినిమా చూడగలిగాను. లేకుంటే ఇలాంటి సినిమాలు మనం ధియేటర్లలో ఎక్కడ చూడగలం?!

సినిమా చాలా సాదాగా, ప్రశాంతంగా  బల్లకట్టులా సాగిపోతుంది. ఉక్కిరిబిక్కిరిచేసే ఉద్వేగాలు, కన్నీళ్ళుపెట్టించే, బీపీలుపెంచే, చప్పట్లుకొట్టించే సీన్లు ఎమీలేవిందులో. ఐనా సినిమా చూశాక, ఒక మంచి సినిమా చూశామన్న ఆనందం మిగిలిపోతుంది చూసినవాళ్లలో. 

ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జక్టుని నాలుగుసార్లు ఫెయిలయ్యి, చికాకులోనూ, జీవితగమ్యం తెలియని అయోమయ అవస్థలోనూ ఉన్న రాజు, తనతండ్రికి గుండెనొప్పి రావడంతో, తండ్రి బదులుగా తను అపార్ట్మెంట్లో చేసే లిఫ్ట్‌బాయ్‌గా ఒక మూడువారాలు పనిచేయాల్సొస్తుంది. 'ఈ మూడువారాల సమయంలో అతనికి కలిగిన పరిచయాలు ఏమిటి, అతనిలో కలిగిన మార్పులేమిటి, అసలా పరీక్ష ఎలా పాసయ్యాడు, అయ్యాక ఏమయ్యింది, అతను తన కొత్త స్నేహితులకు చూపిన దారి ఏమిటి' ఇదీ కధ. సినిమాలో ఓచోట Mrs. D'souza చేత చెప్పించినట్లుగా 'గమ్యం ముఖ్యంకాదు. ప్రయాణమ్మాత్రమే ముఖ్యం' అని చెప్పడమే సినిమా లక్ష్యం. ఆముక్క చెప్పడానికి ఈ కధను ఎంచుకోవడం చాలా గొప్పవిషయం. Background musik చాలా చక్కగా కుదిరింది. ఇంత ఆరోగ్యకరమైన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయ్.

Tuesday, April 28, 2020

కరోనా: బ్రాహ్మణాచారమూ, యోగ వాశిష్ఠ్యమూ, యాగమూ, బీజక్షరాలూ

కరోనావల్ల సమాజంలో జోకరుగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎన్నికలప్పుడు  కిలారి ఆనందపాలుడు మాత్రమే... ఇప్పుడు ఎవుడుబడితేవాడు కామెడీ జేస్తున్నాడు.అసలు కరోనా రాకతోనే కామెడీ మొదలయ్యింది. కొందరు బడుధ్ధాయిలు ఉత్తరప్రదేశ్‌లో అనుకుంటాను గోమూత్రపార్టీ చేసుకుని కరోనానుంచి ముందస్తు విముక్తి పొందారట. అందులో కొందరి మాటలు వింటుంటే ఈ గాడిదలు చదువుకొని ఎమినేర్చుకున్నారా అనిపిస్తుంది. వాళ్లలో ఒకడి ప్రకారం గోమూత్రంలో వైరస్ బ్రతకలేదట. వాడుదాన్ని వాట్సాప్ యూనివర్సిటీలో తెలుసుకొనుంటాడు. ఇహ సెలబ్రిటీలుకూడా భారతీయ ఆచారాల గొప్పతనాన్ని ఏకరువు పెట్టడం మొదలుపెట్టారు. సంస్కారము, నమస్కారము, ఆచారము, ప్రక్షాళనము అంటూ. బాబులూ ఇంతకన్న గొప్ప ఆచారాలు జపనీయులకున్నై. అయినా పురాతన భారతీయులకు సబ్బుముక్కలూ, శానిటైజర్లూ, క్లోరోక్వినులూ తెలుసేం? 

భారతీయ ఆచారాలకు బ్రాహ్మణతను జోడించి తన వెధవతనాన్ని ముందుగా బయటపెట్టుకున్న ఖ్యాతి ప్రముఖ బూతుపాట రచయిత జొన్నవిత్తుల గారు. ఆయన ప్రకారము కులాలనుబట్టి పాటించే అంటరానితనమనబడు సామాజిక దూరం అంటువ్యాధులు ప్రబలకుండా చూడడానికి ఉద్దేశించినదట! అవునుమరి అంటువ్యాధులు కేవలం పంచములనుండి (వాళ్ళెలాగూ జంతువులకన్నా హీనులుకదా) ఇతరులకు వ్యాపిస్తుంది. బ్రాహ్మణుల్లో ఒకరికి అంటువ్యాధివున్నా అది స్పర్శద్వారా ఇంకొక బ్రాహ్మణుడికి సోకే అవకాశమే లేదు మరి. మరి బాబుగారు హైందవదురాచారాలనూ, అనాగరిక పధ్ధతులనూ, పురాణాల్లో కనిపించే వావివరసలు విడిచి సాగించిన శృంగారాన్నీ, స్త్రీలను కాల్చుకు తినడాన్నీ కూడా సమర్ధిస్తారేమో చూడాలి. ఇలాంటి పొగరుబోతులు నోటికొచ్చింది వాగడమూ, దాన్ని టీవీలు సిగ్గులేకుండా చూపించడమూ. ఇండియాకాబట్టి సరిపోయిందిగానీ ఇవే వెర్రికూతలు ఒక మోస్తరు దేశంలో చేసుంటే బాబుగారిని ప్రభుత్వంవారు బొక్కలోతోసి నాలుగు తగిలుంచుండేవారు. ఈ పోరంబోకులు జనాలకి మంచిని బోధిస్తారు. బీజాక్షరాలు అంటూ సొల్లువాగుడు వాగినందుకే ఈయన్ని జైల్లోపెట్టి గోళ్ళూడకొట్టొచ్చని నా అభిప్రాయం. అస్టక్షరీమంత్రాన్ని ఆలయగోపురమెక్కి అందరికీ పంచిన రామానుజాచార్యులకంటే ఎక్కువగా తెలుసేం గరికపాటికి? అంతకంటే ఉధ్దండుడా ఈ ప్రబుధ్దుడు? ఈ ప్రచనకారులంతా పచ్చి పనికిమాలిన బాపతుకాక మరింకేమిటి? ఇలాంటోళ్ళని వదిలించికొంటేగానీ ఏసమాజమూ, దేశమూ బాగుపడదు.

గరికపాటిగారిది ఇంకోగోల. చాగంటి కోటేశ్వరరావులాంటి కులపిచ్చితో కూడిన మనువాదపు కూతలు కుయ్యడంలేదుకాబట్టి ఈయన కొంచెం మెరుగనుకున్నాను. ఈయనా అంతే! ఈయనంటాడూ... "చెడుతిండివల్లా, చెడ్డఆలోచనలవల్లా" రోగమొకటొస్తుందని చెప్పబడింది అని. చెడుతిండి అంటే వివిధరకాల మాంసాలు తినడం అట. చెడు ఆలోచనలు అంటే జీవాయుధాలూ, యుధ్ధాలూ ఇంకా ఏవేవో అట. అసలు శ్లోకంలో అలాంటివేమీ లేకున్నా ఈయన తాలింపులువేసి దాన్ని ప్రస్తుత పరిస్థితికి అన్వయించేశారు. అంతటితో ఆగలేదు మహానుభావుడు దానికి విరుగుడునుకూడా సూచించాడు. వివిధ రకాల ధాన్యాలనుంచి కరోనాకు మందుకనిపెట్టొచ్చని అక్కడెక్కడో రాసుందట. ఆవిధంగా పరిశోధనలు కొనసాగించమని ఒక బోడిసలహా పడేశాడు. అసలు సంబంధమేలేనిదాని గురించి ఎవరైనా ఎందుకు పరిశోధించి సమయం, ధనం వృధా చేసుకోవాలి? ఒకరికి కామెర్ల వ్యాధి ఉందనుకుందాం. ఏదో ఒక పురాతన పుస్తకంలో కామెర్లు నయంకావడానికి రోగిచేత గులకరాళ్ళు మింగించవలెను అని రాసుందనుకుందాం. మతున్నోడెవడైనా కామెర్లు ఎందుకొస్తాయో తెలుసుకొని, అది నయంకావడానికి గులకరాళ్ళు మింగడం ఎలా సాయపడుతుంది అని తర్కిస్తాడు. అంతేగానీ వెంటనే పరిశోధనలు మొదలెట్టడు. how many nonsensical things do we have to research about? వాడెవడో రాజస్థాన్‌లో గుడ్లగూబలని ముట్టుకొన్న చేత్తో, కరోనా రోగిని స్పృశించడంద్వారా కరోనాను నయం చెయ్యొచ్చు అని చెప్పాడు. ఇప్పుడు డాక్టర్లు లేదా సైంటిస్టులు గోమూత్రమ్మీద, గుడ్లగూబలమీదా, బీజాక్షరాలామ్మీదా, ధాన్యాలమీదా, తావీజులమీదా, ప్రార్ధనలమీదా, గరికపాటిలాంటి అజ్ఙానులు వాగే వాగుళ్ళమీదా పరిశోధిస్తే ఇక మందును కనుక్కున్నట్లే! వీళ్లకేమీ బాధ్యత ఉండదుకాబట్టి ఒక్కో అజ్ఙానీ ఒక్కో క్యూర్ ఇచ్చేస్తాడు. వీళ్ళ మాటలు పట్టుకు పరిశొధనలు చేస్తే కుక్కతోకపట్టుకొని గోదారి ఈదినట్లే! బీజాక్షరాలు అంటూ సొల్లువాగుడు వాగినందుకే ఈయన్ని జైల్లోపెట్టి గోళ్ళూడకొట్టొచ్చని నా అభిప్రాయం. అస్టక్షరీమంత్రాన్ని ఆలయగోపురమెక్కి అందరికీ పంచిన రామానుజాచార్యులకంటే ఎక్కువగా తెలుసేం గరికపాటికి? అంతకంటే ఉధ్దండుడా ఈ ప్రబుధ్దుడు? ఈ ప్రచనకారులంతా పచ్చి పనికిమాలిన బాపతుకాక మరింకేమిటి? ఇలాంటోళ్ళని వదిలించికొంటేగానీ ఏసమాజమూ, దేశమూ బాగుపడదు. అయ్యా సామీ! నీ పనికిమాలిన బీజాక్షరాలు మడిచి జేబులోపెట్టుకో. అవేవీ లేకుండానే కొన్నిదేశాలు కరోనాను జయించాయి. ఇప్పుడదే ఇక్కడా జరుగుతుంది. అదయినప్పుడు ఆ ఘనతంతా నీదేనని చెప్పుకొనేందుకు మళ్ళీ టీవీలముందుకురా. అప్పటిదాకా మూసుక్కూచో నోరు.

ఈమధ్య ఇంకో కొత్త పిచ్చోణ్ణి చూస్తున్నాం. వాడెవడో చాగంటి అట. అమెరికాలో ఒక యాగం చేసి కరోనాను ఏదో పట్టణానికో, ప్రావిన్సుకో ఆమడదూరంలో నిలిపాడట. ఋజువట వాడి శ్రాధ్దం అట. గతంలో ఈయన ఏదో తుఫాన్నుకూడా యాగంద్వారా ఆపేశాడట. తుపాకీ తలకి గురిపెట్టి కాల్చి గుండును యాగంద్వారా ఆపమంటే సరిపోయేది. ఇలాంటోళ్ళని ఎందుకు రోడ్లపై తిరగనిస్తారో ఏమో! పిచ్చికుక్కల్ని వ్యానుల్లో తోసుకెళ్ళినట్లు వీళ్లనీ తీసుకెళ్ళాలి ఇప్పుడెముంది వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పుడు ఇలాంటి పాఖండులు మరికొందరొస్తారు "మేము చేసిన యాగంవల్లే వైరస్ ఉధృతి  తగ్గింది" అంటూ. ఎలాగూ మన డిగ్రీలు మనకు ఉద్యోగాలనిస్తాయేగానీ, తెలివితేటలు పెంచవు కాబట్టి మనమూ డాక్టర్లనీ, ప్రభుత్వాలు చేపట్టిన విధానాలనీ, పోలీసులనీ మర్చిపోయి, దేవుడే మనల్ను రక్షించాడు అంటూ గుళ్ళకి బారులు తీరతాం. అన్నట్లు ఫెయిత్ హీలర్లు ఇప్పుడు కరోనావార్డుల్లోకి వెళ్ళి యేసుకృపతో కరోనారోగులను మందలు మందలుగా ఆరోగ్యవంతులనుగావించవచ్చునే! ఎక్కడబడేడుస్తున్నారీ ఈ ఆపత్కాలంలో?


Thursday, April 23, 2020

B&D media: అర్ణభ్ గోస్వామి



ఒకప్పుడు మోదీ చంకలునాకే మీడియాని "గోదీ మీడియా" (lapdog media) అనేవాళ్ళు. ప్రస్తుతం వీళ్ళకి B&D media గా ప్రమోషన్ వచ్చింది. B&D అనగా "భడవ మరియూ దలాల్" కి సంక్షిప్త రూపం. భడవ అంటే వేశ్యలను సప్లైచేసేవాడు, తార్పుడుగాడు, pimp అని అర్ధం. దలాల్ అంటే బ్రోకర్. ఈ B&D మీడియా చేసేదేంటంటే establishmentకి తమను తాము తార్చుకోవడం. ప్రస్తుతానికి establishment చంకలేకాదు ఏదైనా నాకటానికి సిధ్ధమయ్యేవాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్లందరికీ ఆద్యుడు అర్ణభుడు. 

అర్ణభుడు ఎవర్నైనా ఒకాట ఆడుకోవాలంటే ఒక బకరాని చర్చకంటూ పిలుస్తాడు. ఆ బకరాతో ప్రతిచర్చకని ఒక పదిమందిని పిలుస్తాడు (చిన్నప్పుడు తిరునాళ్ళలో మీ పిల్లలో, తమ్ముడో తప్పిపోతే, వాళ్ళు ఈ ప్యానల్లో కనబడే అవకాశం ఉంది. అంతమందుంటారు ప్యానల్లో). ఈ పదిమందితో తానూ కలుస్తాడు. ఇహ రచ్చ మొదలు. ఈ పదకొండుమందీ చెప్పేదానికన్నా ఈయనొక్కడు అరిచేది ఎక్కువగా ఉంటుంది. బకరాని అరవొద్దంటూనే ఈయన అరిచేస్తాడు. ఇంకొన్నిసార్లు సిగ్గు పూర్తిగా విడిచేసి అరిచేహక్కు తనకే ఉందని నొక్కివక్కాణిస్తాడు. చాలా కొద్దిసార్లు బీజేపీవాళ్ళని కుంచెం విమర్శిస్తాడు. ఇప్పుడైతే ఆ మర్యాదకూడా వదిలేశాడు. ఈయన నిజాయితీ గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని:

ఒకసారి అర్ణభుడు బెంగుళూరునుంచి ఇంకెక్కడికో వెళుతున్నాడట. ఆ సమయాన ప్రభువులవారికి బెంగుళూరు  విమానాశ్రయంలో తగినంతమంది security personnel లేరు అనిపించిందట. ఇంకేం! అక్కడి అధికారులను పిలిచి ఆరా తీశారట. అక్కడి అధికారులేమో "ప్రభూ... ఎప్పుడూ ఉండేంతటి సెక్యూరిటీయే నేడునూ యున్నది. అదియునూగాక ఈ విమానాశ్రయమునకు ఉగ్రవాదుల నుంచి ముప్పు యున్నటుల మాకు సమాచారము కూడా లేకున్నది" అని విన్నవించారట. అంతట అగ్రహోదగ్రులైన ప్రభువులవారు "ధిక్కారమున సైతునా! నేటి రాత్రికే నా ప్రోగ్రామురాజమందున మీ అందరికీ నూరు కొరడాదెబ్బలు శిక్షగా విధించెదను" అని రెచ్చిపోయారట. ఇదంతా తెలుసుకున్న అక్కడి అధికారులు "ఈ మూర్ఖాగ్రేసరునితో తంపులుబడుటకు సమయమిదికాదు. ఈ మూర్ఖుడు మన విమానాశ్రయమును వీడి వెళ్ళువరకూ మరికొందరు తాత్కాలిక సిబ్బందిని విమానాశ్రయ రక్షణభారముకై నియమించెదము" అని అనుకొని ఆవిధంగా ముందుకు పోయారట.

ఆమధ్యొకసారి ఉత్తర్ ప్రదేష్లో అనుకుంటాను cloud burst వల్ల వరదలొస్తే, మోదీ అనబడే superman విమానాల ద్వారా వేలమంది గుజరాతీయులను తరలించినట్లుగా బీజేపీ నాయకత్వం డప్పుకొట్టుకుంది.  తరువాత తెలిసిన విషయమేంటంటే ఆవార్త నిజం కాదుట. అర్ణభుడికి కాలింది. వెంఠనే బీజెపీ నాయకురాలిని ఒకర్ని పిలిచి "వార్తని confirmచేసుకోకుండా, మీ ప్రచారానికి వాడుకోవడానికి సిగ్గులేదా?" అని రెచ్చిపోయాడు. చాలా సంతోషం. కానీ అసలు విషయమేమిటంటే... superman మోదీ గురించిన ఆ వార్తను ప్రచారంలోపెట్టింది ఆయనగారు పనిచేస్తున్న చానలే!! ఈయన వెరిఫై చేసుకోకుండా ప్రసారం చెయ్యొచ్చు. అది తప్పుకాదు. దాన్నెవరైనా వాడుకొంటేమాత్రం వాళ్ళు వెరిఫైచేసుకోవాలి. ఇదెలా ఉందంటే నేను విస్కీబాటిల్లో విషం పోసి అమ్మేస్తాను. కొనుక్కొని తాగేముందు వినియోగదారుడే అది విస్కీనా కాదా అని నిర్ధారించుకోవాలి. నేను ఏ బాధ్యతా తీసుకోకపోయినా వినియోగదారుణ్ణి విమర్శించే హక్కుమాత్రం నాకుంటుంది. దీనినే caveat emptor జర్నలిజం అందురు.


గుజరాత్ అల్లర్ల సమయంలో గుజరాత్ సీయం మోదీ నివాసానికి కారులో వెళుతున్నప్పుడు తనమీద కొందరు (అనగా ముస్లింమూకలు అని భావము) దాడిచేశారని స్టూడియో ఎక్కి అరిచాడీ ప్రబుధ్ధుడు. అసలు విషయం ఏమిటంటే ఈ ప్రబుధ్ధుడు ఆసమయంలో అసలు గుజరాతే వెళ్ళలేదట! అర్ణభ్ విశ్వసనీయత అర్ధం అవుతుంది. ఇప్పుడు ఇదే డ్రామా మళ్ళీ మొదలెట్టాడు. ఈయనమీద దాడిచేసిన జనాలు తన సెక్యూరిటీ చేసిన ఐదు నిముషాల 'ఇంటరాగేషన్‌'లో తమ తప్పును ఒప్పేసుకోవడమేగాక ఏకంగా సోనియా గాంధీయే తమను పంపించిందని చెప్పేసారట! అందుకే అంటారు హిస్టీరియా రిపీట్స్ అని.

మొన్నటికి మొన్న భాంద్రా రైల్వే స్టేషన్లో వలసకూలీలు నిరసన తలపెడితే. "వాళ్ళందర్నీ మసీదుముందు పోగేసింది ఎవరు? అసలు మసీదుముందే ఎప్పుడు జనాలు ఎందుకు పోగుపడుతుంటారు?" అని గొంతుచించుకున్నాడీ వీరుడు. అసలు విషమేమిటంటే భాంద్రా స్టేషన్నానుకొనే ఒక మసీదుందట. వలసకూలీలు స్టేషనుముందు కూడితే వీడుమాత్రం మసీదుముందు కూడారు అని చెప్పుకొచ్చాడు. మరిందులో మసీదుపెద్దల involvement లేదా? తప్పకుండా ఉంది! మసీదువాళ్ళు చేసిందేమిటయ్యా అంటే పోలీసుల విఙప్తి మేరకు మసీదులోని లౌడ్ స్పీకర్లలో "నాయనలారా గుమిగూడవద్దు. కరోనాను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడినుంచి త్వరగా వెళ్ళిపోండి, మీ ఆరోగ్యాల్ని రక్షించుకోండి" అని చెప్పడమే ఆ మసీదు యాజమాన్యపు involvement. యూట్యూబులో దీని వీడియోలున్నై, fact checking వెబ్‌సైటులున్నై. ఇలాంటి వీడియోలు చూశాకకూడా అర్ణభుడు తను నమ్మిన అబధ్ధాలను చెబుతూనే ఉన్నాడు. ఇంతాచేస్తే ఈయన స్టూడియోకు కేవలం ఇరవై నిమిషాల దూరంలో భాంద్రా స్టేషనుందట. నిజాలపై మోజున్నవాడే ఐతే భాంద్రాలో గ్రౌండ్ రిపోర్టింగ్ చేసుండేవాడు. మనక్కావలసింది అది కాదుకదా! 

ఇది ఇంకా తాజా వార్త: పాల్‌ఘర్‌లో సాధువులపై దాడి జరిగితే, ఆ చేసింది ముస్లిములే అని డిబేట్లు నడిపాడు. తీరా పోలీసులు "అదేమీ కాదబ్బాయ్. జరిగిన దాడిలో మతకోణంలేదు, అసలు దాడి చేసిందికూడా హిందువులే" అని చెబితే... కనీసం తను అప్పటిదాకా వాగిన సొల్లువాగుడుని retractకూడా చెయ్యకుండా మూసుక్కూచున్నాడు వెధవ. అంటే జనాలు నరుక్కుచస్తే ఈ శాడిస్టుకు ఆనందమన్నమాట.

ఆమధ్య కునాల్ కమ్రా అనే standup comedian విమానంలో తనను ఇబ్బంది పెట్టాడని వ్యక్తిస్వేఛ్ఛ, హక్కులూ అని టీవీలో పడేడిశాడు. మరి బాబుగారు స్టూడియోల్లో చేస్తున్నదేమిటి? heckling అనేది ఐస్‌క్రీం తినడంలాంటిది. మనం ఐస్‌క్రీం తింటున్నప్పుడు బాగనే ఉంటుంది. అదే ఐస్‌క్రీం మనమీద పడితే? ఈమొత్తం వవహారమ్మీద వరుణ్ గ్రోవర్ అనే ఇంకో standup comedian చేసిన వ్యాఖ్య నాకు నచ్చింది. అతనంటాడూ.. "heckling is right because... slapping wold have been wrong".


ఇంతటి వీరాధివీరుడైన, అరివీరభయంకరగళశాలి అర్ణభుడు కుక్కపిల్లలా మారిపోయి చేసిన ఇంటర్వ్యూ ఒకటుంది. అదేందంటే ఉధ్ధవ్ ఠాక్రేతో అర్ణభ్ చేసిన ఇంటర్వ్యూ. చాలా ఫన్నీగా ఉంటుంది. కుర్చీలో ఒకమూలకి ఒదిగిపోయి, వినయంతో ప్రశ్నలు అడిగి, ఉధ్ధవ్ చెప్పే సమాధానం పూర్తయ్యేదాకా మూసుకొని విన్నాడు. మొదట్లో కొంచెం తోకాడించినప్పుదు ఉధ్ధవుడు కొరడా ఝుళిపించడాలు, తుపాకీతో గాల్లోకి కాల్చడాలూ, కరెంటు షాకులివ్వడాలూ గట్రా చేశాక, పూర్తిగా కుక్కపిల్లలా మారిపోయి కాళ్ళునాకిన అర్ణభుణ్ణి చూస్తే చాలా ముచ్చటేసింది.

Monday, April 13, 2020

Long live Germany!!


ఈ కరోనా వైరస్ నేపధ్యంలో ఇతర దేశాలకి నిజమైన సహాయం (చైనా మార్కు సహాయంకాదు)  చేస్తున్న దేశాలు నాకు తెలిసినంతవరకూ మూడు. అవి ఇండియా, క్యూబా, జర్మనీ. ఇండిక్ష్యా ఏమో మందులనీ, కొన్ని వైద్య పరికరాల్నీ ఇటలీ, జర్మనీ, చైనాలాంటి దేశాలకు ఇదివరకే పంపించింది. క్యూబా ఎలాగూ వాళ్ళ డాక్టర్లతో దేశాలను ఆదుకుంటుంది. జర్మనీది మరో కహానీ. వీళ్ళకి పీక్‌స్టేజ్‌లో కేసులున్నప్పుడే, ఇటలీ, ఫ్రాన్స్‌లనుండి క్రిటికల్‌గా ఉన్న రోగులను ప్రత్యేక విమానాల్లో జర్మనీకి పట్టుకొచ్చి నయం చెయ్యడం మొదలుపెట్టారు. కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళకి తగినన్ని కేసులు లేవంజెప్పి, డాక్టర్లకు శిక్షణ ఇచ్చినట్లు ఉంటుందికదా అని ఏకంగా కష్టతరమైన కేసుల్ని ఏరుకు తెచ్చుకున్నారు. సమాఖ్య స్ఫూర్తి అంటే అది! 

ఈ యవారమమంతా మొదలవడానికి ముందు జర్మనీ రోజుకు 16,000 పరీక్షలు నిర్వహిస్తుంది. ఆనాడే మెర్కెలమ్మ చెప్పేసింది "అవసరమైతే ఆ సంఖ్యను పెంచగలంకూడా" అని. ప్రస్తుతం వీళ్ళు ప్రస్తుతం రోజుకు 50,000 చేస్తున్నారు. ఈమధ్య గంట, రెండుగంటల్లో పరీక్షలు చెయ్యగల టెస్ట్‌కిట్స్ వచ్చాయి. అవికూడా అందుబాటులోకి వస్తే, ఇక పరీక్షలు నిర్వహించడంలో జర్మనీ విశృంఖలతకు అడ్డూఆపూ ఉండదు. ఈ యవారమంతా ముగిసాక herd immunity సంగతి asses చెయ్యడానికి సిధ్ధమవుతున్నారు.

జర్మనీ ఇలా manageable conditionలో ఉండడానికి కారణాలు: 1) ప్రభుత్వం ఆలస్యంగా నిద్రలేచినా, సమస్య తీవ్రతను సరిగా అర్ధంచేసుకొని స్పందించింది. 2) ప్రజల సహకారం. మొదట్లో కొందరు మూర్ఖులు lock downని తోసిరాజని బేస్‌మెంట్స్‌లో పార్టీలు నిర్వహించినా, ఒకవారానికి అందరికీ పరిస్థితి అర్ధమయ్యింది. మ్యూనిక్‌లో ఐతే షాపుల్లో, రెస్టారెంట్లలో చాలా ఖచ్చితంగా Abstand అనబడే "ఎడం"ను పాటిస్తున్నారు. చిన్నచిన్న షాపుల్లోనైతే... షాపులో ఎంతమంది ఉండాలి అన్నవిషయం షాపువాళ్ళే నియంత్రిస్తున్నారు. గవర్నమెంటు "ఇలా చెయ్యండి బాబూ" అనేమీ చెప్పలేదు. జనాలకు పరిస్థితి బాగా అర్ధమయ్యింది.  Health systemకూడా చఖ్ఖగా ఉంది. కరోనా రోగులక్కూడా డాక్టర్లే ఇంటికివచ్చి మందులిచ్చిపోతున్నారు. పరిస్తితి ముదిరితేనే ఆసుపత్రులూ అవీ. వీళ్ళకు కలిసొచ్చిన మరొక అంశం ఇక్కడ ఇంట్లోనే క్వారంటైన్ అవ్వడం సాధ్యమవుతుంది. ఇండియా, బంగ్లాదేశ్ లాంటిదేశాల్లో ఇది చాలా కష్టం.

ప్రస్తుతం జర్మనీ పరిస్థితి ఏంటంటే నిన్న కొత్తగా వచ్చిపడినవి 2,400 కేసులు (ఇంత చిన్న సంఖ్య మార్చి 17న కనిపించింది). కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య నాలుగు రోజులుగా అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. ఇక్కడ ప్రస్తుతం కొత్తకేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే ట్రెండ్ ఇంకొన్ని వారాలపాటు కొనసాగితే బాగుణ్ణు. ఆతరువాతెలాగూ జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్, స్పెయిన్‌లకు సహాయం చెయ్యగల స్థితిలో జర్మనీ ఉంటుంది. అటుపక్క ఇండియాకూడా తొందరగా కదిలి ఇలాంటి అద్భుతాన్ని సాధిస్తే, చుట్టుప్రక్కలున్న దేశాలు ధైర్యంగా ఉండగలుగుతాయ్. ఎటొచ్చీ "మేము బాగుపడిపోయాం. ఇహ మీ చావు మీరు చావండి" అనే యెదవ లక్షణం ఇండియాకు ఎన్నడూ లేదు.

Sunday, April 12, 2020

దేవినేని స్వాతి మతిలేని వాగుడు

నిన్న ఫేస్‌బుక్‌లో ఈ వీరనారి వీడియో చూశాక, దీన్ని తెలుగు పత్రికలుకూడా విశేష ప్రాచుర్యం కల్పించినట్లు తెలిసింది. అసలు విషయమేమిటంటే ఇవన్నీ ఈవిడగారి బుర్రకు తట్టిన విషయాలుకాదు. ఎవరో వైసీపీ ఐటీ సెల్లువాళ్ళు ఏప్రెల్ ఎనిమిదో తారీఖున ఒక పోస్టుపెడితే దాన్ని ఈ స్వాతి భట్టీయం గావించేసి, కేమెరా ముందు ఎక్కడలేని "గీర"తో అభినయించేసింది. అయినా అమెరికా మీద అంతటి చులకన భావం ఉన్నప్పుడు అక్కడికెందుకు వెళ్ళడం. ఇండియాలో ఉద్యోగంకూడా లేకుండా అడుక్కుతింటుంటే అప్పుడు స్వర్గంలో ఉన్నట్లు ఉంటుందేం? వచ్చెయ్యమ్మా ఇండియావచ్చెయ్! గవుర్నమెంటు ఆసుపత్రి ఐసీయూలో ఒక్కరోజు గడిపితే ఒంటి కొవ్వుకరిగి, కింద బలుపుపోయి, దిమ్మగిరిగి, బుధ్ధి వస్తుంది.

ఈవిడ వాగిందాంట్లో అమెరికాను తిట్టిపోయడమూ, ఇండియాను నెత్తికెత్తుకోవడమూ తప్ప ఇంకేంలేదు. వట్టి స్వకుచమర్దనం టైపు. మధ్యలో అసలు విషయాన్ని వదిలి స్వేఛ్ఛ, స్వాతంత్రాల గురించీ, పెళ్ళికిముందే డేటింగుల గురించీ ఒక కామెంటు. ఇండియాలో అక్రమ సంబంధాలు పెట్టుకొని, భాగస్వామిని చంపుతున్నరు. మోసాలు, దోపిడీలు, రేపులు, హత్యలు లేకుండా ఏరోజూగడవదు. . అదీ భారత సంస్కృతిలో గొప్పతనం! అంతెందుకు, ఈవిడెప్పుడూ డేట్ చెయ్యలేదా? డేటింగే చెయ్యకుండా, ఏమీ తెలియనివాడితో పక్క పంచుకోవడం వ్యభిచారం అవుతుంది (ఇండియన్ మ్యారేజ్ దాన్నుంచే derive చెయ్యబడింది మరి) కదా! అయినా డేటింగ్ అంటే మంచమెక్కడమని నీకెవరి చెప్పారు? ఓహో! తమరి మురికి బుర్రకి sex తప్ప మరో యావుండకపోవడంతో డేటింగంటే sex అని fix అయ్యావా నారీమణీ?

కరోనా విషయానికే వస్తే ఇండియాలో కరోనా కేసులు నాలుగంకెల్లో ఉన్నాయట. అవి సర్కారీ లెక్కలు తల్లీ. నిజాలు వేరే ఉంటాయ్! అసలు ఇండియాలో తగినంత టెస్టింగే జరగట్లేదు. worldometers.info వాళ్ళ లెక్కల ప్రకారం ఇండియాలో ప్రతి పదిలక్షలమందికి గాను కేవలం 137 పరీక్షలుమాత్రమే జరిగాయి. మనం నిత్యం చెడదిట్టుకొనే పాకిస్తాన్‌లో ఈ సంఖ్య 262. అంటే ఇండియాకంటే పాకిస్తాన్ బెటరన్నమాట ఈ విషయంలో!! ఇప్పుడేముంది, ముందు టెస్టింగు సరిగ్గా చేస్తే, ఇండియా అమెరికానే మించిపోవచ్చు (మరణాలు, కేసులు రెండింటిలో). ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయ్! కార్పొరేట్లు విరాణాలు, అవసరమైన సామాగ్రి కూర్చడానికి కదిలి వస్తున్నాయ్. ప్రభుత్వం ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటొంది. ఓపక్క వైద్యులకు PPEలు ఇవ్వడం పక్కనపెడితే, కనీసం మాస్కులూ ఇవ్వలేని దరిద్రమైన స్థితి. టెస్టింగ్ కిట్లు నిన్నమొన్నటివరకూ లేవు. ఇప్పుడున్నాయో లెవో తెలీదు. ఎవ్వరిదగ్గరా ఏ సమాచారమూ ఉండదు. అంతా అంధకారం. జనవరిలో మొదటికేసు నమోదయితే, Prime Moronగారు షహీన్ భాగ్, ట్రంపు చంకలునాకడం, ఉన్న ప్రభుత్వాలనుకూల్చి తన పార్టీ ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకురావడం వంటి  జాతికి అత్యవసరమైన కార్యకలాపాలతో కాలం వెళ్ళబుచ్చారు. రాహుల్ గాంధీ అనేవాడు ఫిబ్రవరిలోనే మొత్తుకున్నాడు "ఒరే నాయనలారా! గడ్డుకాలం రానున్నది, కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండండి" అని. ఆరోగ్యమంత్రిగారు బీజేపీ బుధ్ధిపోనిచ్చుకోకుండా ఎకసెక్కాలాడారు. ఇప్పుడేడుస్తున్నారు. దానికితోడు PM (అనగా Prime Moron) గారు గంటలుకొట్టండి, దీపాలెట్టండి, పాడెలుకట్టండి, గోతులుతవ్వండి అంటూ ఉన్న lockdownను ఊడబెరుకుతున్నారు.
ఈ PM గారితో పోల్చితే ఏమాత్రమూ తీసిపారేయదగ్గవారు కారు అక్కడి అధ్యక్షులవారు. ఆ మూర్ఖుడి దయవల్ల నేడు అమెరికాలో ఇన్ని కష్టాలు. అక్కడ lockdown విధించడానికే కుదరడంలేదు. ఒక్కోరాస్ట్రానిది, ఒక్కోబాట! ఈ రంధిలో డొమెస్టిక్ విమానాలు నడుస్తున్నాయ్, కారేసుకొని, NYనుంచి ఏకంగా కాలిఫోర్నియాకు బయలుదేరితే, వాణ్ణాపే దమ్ము ఎవడికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోగం వ్యాపించకపోతే ఆశ్చర్యపడాలిగానీ, వ్యాపిస్తే ఎవరైనా ఎందుకు ఆశ్చర్యపడాలి?


ఇహ Hydroxychloroquine గోల. ఈ Hydroxychloroquineని మలేరియాని నయంచెయ్యడానికి వాడుతారు. మిగతా దేశాల్లో Hydroxychloroquine ఎందుకు లేదు అంటే... అక్కడ ఇంకా మలేరియా ఎవరికీ రావట్లేదు, కొన్ని దేశాల్లో పదుల్లో కేసులుంటాయి. ఇండియాలోలాగా వేలల్లో మలేరియాకి బలైపోవడం వాళ్ళకి కేవలం ఒక జ్ఞాపకం. ఇండియా ఇంకా మలేరియానికూడా నివారించని స్థితిలో ఉందికాబట్టి ఇండియాకు Hydroxychloroquine నిల్వలు maintain చెయ్యడం తప్పనిసరి. ఈమాత్రం దానికి ముప్పై దేశాలు ఇండియాలోని ఈ మందుకోసం అంగలార్చుతున్నాయి అని అనుకోవడం మూర్ఖత్వం. అయినా ఒకరి బ్యాగులో ఏ ఏస్ప్రినో ఉందంటే సరేగానీ హైబీపీకి, ఆస్మాకీ, గుండెపోటుకీ మందులూ ఇంకా ఇన్సులిన్ ఇంజెక్షన్లూ ఉంటే "అహా! వీడు చాలా ఆరోగ్యవంతుడురా భయ్!" అంటామా? బుర్రలు కుంచెం వాడండి.

ట్రంపు బెదిరిస్తే PM గారు వణుక్కుంటూ Hydroxychloroquine పంపించేశారు. అది కూడా ట్రంపు అనుమతించిన దేశాలకే సుమా. మిత్రదేశం ఇరాన్‌కు పంపించడానికి యాభయ్యారు అంగుళాల ఛాతీ పంచెలు తడుపుకుంటొంది. ఈ మహానుభావుడు పెద్ద పుడింగి!


Saturday, April 4, 2020

చచ్చు predictions





కుర్రాడు పాపం మార్చ్ 30 నుండి ఏప్రెల్ రెండు వరకూ ఉన్న నాలుగురోజులూ చాలా క్లిష్టమైనవి అని గొంతు చించుకున్నాడుగానీ. అంత గొప్ప విలయమేదీ ప్రపంచంలో జరగలేదు. నిజానికి కొత్త కేసుల విషయంలో ఇటలీ, స్పెయిన్ దేశాల పరిస్థితి మెరుగు పడింది. జర్మనీ అటూ ఇటూగా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నది. UKలో పరిస్థితి కొంచెం గందర గోళంగా ఉంది. ఫ్రాన్స్‌కూడా ఆనాలుగురోజులూ బాగానే ఉంది. నిన్న (మార్చి 3న) మాత్రం కొత్తకేసుల సంఖ్య ఆకాశానికి అంటింది. అమెరికా సంగతి సరేసరి. దానికి కారణం గ్రహాలు అనుకున్నోళ్ళు ఎఱ్ఱగడ్డలో జాయిన్ అవ్వండి. ఇండియాలో పరిస్తితి ఇలా తయారవడానిక్కారణం దేవుళ్ళు, దేవుళ్ళ చంకలు నాకేవాళ్ళు, ఆలస్యంగా నిద్రలేచిన ప్రభుత్వం, బొత్తిగా బుధ్ధిలేని జనాలు. ఈ నాలుగు రోజుల్లోనే అవి పెరిగాయంటే దానిక్కారణం చంద్రుడో, వాడమ్మ మొగుడో కాదు. అప్పుడెప్పుడో వెధవ్వేషాలు వేసిన వెధవలకు ఈనాలుగు రోజుల్లో పరీక్షలు నిర్వహించడమే!

మరణాలు పెరగడం అనేది జరగక తప్పదు. జనాలు ఆలస్యంగా వ్యాధిని రిపోర్టుచెయ్యడం, తగినన్ని వైద్య సదుపాయాలు లేకపోవడం ఇలా. వ్యాధి వ్యాప్తిమాత్రం చాలాదేశాల్లో ప్రమాదకరంగా లేదు - ఈ నాలుగురోజుల్లో. 

అయినా మనం చేసిన లేదా చేస్తున్న తప్పులకి గ్రహాలు ఎలా కారణమౌతాయ్? ఇంత పెద్ద విశ్వం మనుషుల అదృష్టాన్ని ప్రభావితం చెయ్యడానికే ఉంది అనుకోవడం అహంకారం కాక మరేమిటి?  మొత్తం సూర్యకుటుంబంలో భూమిపరిమాణం 0.001% కూడా ఉండదు. ఇక మొత్తం విశ్వాన్నే పరిగణలోకి తీసుకుంటే భూమి అసలు పరిగణలోకే రాదు. మొత్తం విశ్వం సూర్యకుటుంబమంత (పోనీ మన గెలాక్సీ అంత) ఉంటుందనుకుంటే, భూమి సైజు కరోనా వైరస్ కంటే చిన్నగా ఉంటుంది. అయినాకూడా విశ్వంలో మనమెంతో ముఖ్యులమనీ, మనకోసమే వివిధ నక్షత్రాలు అహరహం శ్రమిస్తున్నాయనీ మనం అనుకుంటుంటాం. కానివ్వండి.. రోగాలు ప్రబలితే దానికి మనం తప్పుబట్టాల్సిన అసలు వాళ్ళను వదిలేసి, దానికి కారణాలు ఆకాశంలో వెదుక్కుందాం. కారు కదలకపోతే మెకానిక్ దగ్గరకెళతామా? లేక ఏదో దిక్కుమాలిన గ్రహదోషం పొయ్యేదాకా ఎదురుచూస్తామా? మన బుర్రల్లో మెదడుందా లేక దేవుడి బ్రోకరు  (ఎవడు ఎక్కువగా పొగిడితే లేదా డబ్బులిస్తే వాడితో వెళ్ళే వేశ్యకద దేవుడు!) గాడిదకొడుకుల పెంట ఉందా? 

Friday, April 3, 2020

మతస్వేఛ్ఛ


We have to fuck the gods and the pimps of gods away before they fuck us big time.

అనుక్కున్నంతా అయ్యింది. ఒకప్పుడు రాస్తూ, మొత్తం కేసుల సంఖ్య మూడంకెలు దాటకుండా ఉంటే బాగుంటుందనుకున్నాను. ఇప్పుడది మూడువేల వైపు పయనిస్తోంది. ఇది పదివేలకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ప్రభుత్వం ఒప్పుకోవడంలేదుగానీ, ఇప్పటికే community spread అనబడే stage-3 మొదలయిపోయింది ఇండియాలో. దానికి కారణమల్లా దేవుళ్ళు, దేవుడిబ్రోకర్లు, దేవుడి ass lickers.

హైదరాబాదులో క్వారంటైన్లో ఉండాల్సిన వాళ్లందరూ ఒక గుంపుకట్టి సామూహిక నమాజులు చేస్తున్నారని Times Now వాళ్ళ కబురు. ఈ పనికిమాలిన వెధవలు నిన్న తమ వద్దకు వచ్చిన వైద్యసిబ్బందిని రళ్ళిచ్చుక్కొట్టడం చూశాం. ఇప్పుడు ఆసుపత్రుల్లో పరీక్షలకు సహకరించట్లేదట. "మాకేం కాదులే" అనంటున్నారట. తలకాయలో మెదడుకు బదులు, మౌలానాగాడి పెంట ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారు. సౌదీ అరేబియా, ఇరాన్ మొదలుకొని అన్ని ఇస్లామిక్ దేశాలూ అల్లాహ్ పీకేదేమీ లేదని తెలుసుకొని, కరోనా దెబ్బకు గజగజ వణుకుతున్నాయ్. సౌదీ ఐతే ఏకంగా "హజ్ యాత్రకు వచ్చి పవిత్ర నగరాల్లో కరోనాను వ్యాపింపచెయ్యొద్దు" అని వేడుకుంది. మక్కాను రక్షించుకోలేని సర్వశక్తివంతుడైన అల్లాహ్ ఈ గాడిదల్నిమాత్రం రక్షిస్తాడా? అదసలు అల్లాహ్‌కి వల్లయ్యే పనేనా? ఇదంతా చేసిన తబ్లిగీ చీఫు పరారీలో ఉన్నాడట. ఆ లుఛ్ఛావెధవ దొరికినప్పుడు వాణ్ణి హ్యూమన్ ట్రయల్స్‌కు వాడుకొంటే బాగుంటుంది. 


 ఆ పైనున్న ఫోటోలో హిందువుల్నీ చూడొచ్చు. ఇప్పుడర్జంటుగా వీళ్ళు రాముడి పెళ్ళికి హాజరవ్వాల్సిన అవసరముందా? అసలక్కడ హాజరైన ఒక్క వెధవకైనా బుధ్ధుందా! రేపు వీళ్ళలో ఒక్కరికి రోగమంటుకున్నా, రాముడొచ్చి నయంచేస్తాడా? చేస్తాడు అన్న నమ్మకమున్నప్పుడు రామనామ స్మరణ చేస్తూ వాళ్ళమీద వాక్సీన్ క్లినికల్ ట్రయల్స్‌కు సహకరిస్తారా? ఇలా చేసింది మళ్ళీ ఎమ్మెల్యేలు! వీళ్ళందర్నీ ఒక పధ్నాలుగు రోజులు జైల్లో పెట్టేసి, తిండి తిప్పలులేకుండా ఉంచెయ్యాలి, వీళ్ళ respective దేవుళ్ళు వీళ్ళని అప్పటికీ సజీవంగా ఉంచితే అప్పుడు వీళ్ళని తిండీ తిప్పలతో ఒక ఏడేళ్ళు ఖైదుచేయ్యాలి. 

కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో గుపులు కట్టొద్దురా అని ప్రభుత్వం మొత్తుకుంటే, ఇక cult leader వెధవ... కూటములు కట్టి, ప్రభువు కరుణకై ప్రార్ధించాడు. యేసు ప్రభువు కృపవల్ల మొత్తం దక్షణ కొరియాలోని కేసుల్లో 60% ఈ cult members వల్ల కలిగాయట! (ప్రభూ నీకృప తిరుగులేనిది తండ్రీ, ఎటొచ్చీ మాకే దిమ్మ తిరిగినది. ఆమెన్!). ఇది  చాలక మెంబర్ల అడ్రసులివ్వరా బాబూ అనడిగితే, వాడు నిరాకరించాడట. కేవలం చేతులేకాదు, ఒళ్ళంతా కాలిపొయ్యాక, ఆకులు పట్టుకున్నచందాన, మోకాళ్ళమీద నిలబడి, పత్రికలముందు, దేశానికి "సారీ" చెప్పాడు. ఏంచేసుకుంటాం వాడి వెధవ "సారీ"ని? నెత్తికి రాసుకోగలమా? లేక కాళ్లకేసుకోగలమా వాడి "సారీ"ని?

ఇండియా వీలైనంత తొందరలో అత్యయిక పరిస్థితి విధించాలి. అవసరమైతే కొన్నాళ్ళు, ప్రార్ధనా స్థలాల్ని మూసేసి, మసీదుల్లోనూ, చర్చిల్లోనూ సామూహిక ప్రార్ధనలు జరుపుతున్న నాయాళ్ళ తొక్కతీయాలి. హిందువుల పండుగల్ని సస్పెండ్ చేసెయ్యాలి. బయట ఎవరైనా అనవసరంగా కనిపిస్తే, వాళ్ళను క్వారంటైన్‌కు పంపించకుండా, అక్కడికక్కడే కాల్చిపార్నూకాలి. ఈ పనిని నిన్న డాక్టర్లను కొట్టినవాళ్లమీద ముందుగా ప్రయోగించాలి.  ఇండియాలో కేసుల సంఖ్య 10,000కు చేరుకోవడనికి మహాఉంటే ఇంకో పదిరోజులు పట్టొచ్చు. అక్కడినుంచీ లక్షకు చేరుకోవడం ఇంకో రెండుమూడ్రోజుల పని. కానీ ఒకటి, దీనికి కారణమైన ఏ ఒక్కణ్ణీ మతపరమైన కారణాలతోగానీ, ఇంకే కారణాలతోగానీ వదలకూడదు.