నెట్ఫ్లిక్సోడి కంటెంటులో లోకల్ కంటెంటుండదు. దానికోసం మళ్ళీ వీపీఎన్ను వాడి, లండనుకో, లేకుంటే అమెరికాకో కనెక్టయ్యి తరించాలి. ఈలోపం అమెజనువాడిలోకూడా ఉంది.కానీదానికో విరుగుడుంది టాబ్లెట్లోంచో, సెల్లుఫోనులోంచు వీపీఏన్నుకు కనెక్టయ్యి ఆయా డివైజులనుంచీ టీవీకి మిర్రర్రింగు చెయ్యొచ్చు.
అదేమిటీగానీ కొన్ని సినిమాలకు ఇంగ్లీషు సబ్టైటిళ్ళుండవు.
అతిముఖ్యమైన సమస్య వీడి సినిమాల్లో, సిరీసుల్లో (చెత్త కంటెంటు vs మంచి కంటెంటు) నిష్పత్తి అతి ఎక్కువ. మంచి మంచి పేర్లతో ఉంటాయి. IMDBలో చూస్తే వాటికి రేటింగు ఏ రెండో, మూడో ఉంటుంది.
ఇక సిరీసుల్లో వీలైనంత irrelevant కంటేంటు ఉంటుంది. ఉదాహరణకి మొన్నొకసారి అప్పుడెప్పుడో మహిళలందరూ కొర్టులోకి చొరబడి మరీ ఒక రౌడీవెధని చంపేసిన సిరీసు చూస్తున్నాను. అందులో వాడెక్కడ పుట్టాడు, వాడికి ఈతవచ్చా? రాదా? వస్తే ఎక్కడనేర్చుకున్నాడు? ఎంతబాగా ఈదగలడు? విషయాలు చర్చిస్తుండడంతో ఇక అపేసాను.
అసలు వీడి సిరీసన్నీ ఇలాగే ఉంటాయి. నేరస్తుడి నేరజీవితమ్మీద కాకుండా వాడి పుట్టుపూర్వోత్తరాలాపై దృష్టిపెడతాడు. అలాగే ఇవ్వాళ Xanax మందు గురించి చూస్తున్నాను. రకరకాల ఇంటర్వ్యూల్లో జనాలు 'అది చాలామంచి మందు. అందరూ వాడండీ' అని ఒక గంట చెప్పడంతో నేను అవుల్రెడీ అమెజానులో ఓకేజీ ఆర్డరిచ్చేశాను. చివరి అరగంటలో 'అది అత్యంత ప్రమాదకరమైన మందు' అని మళ్ళీ వీడే చెబుతుండంతో నేను ఆర్డరు క్యాన్సిలు చేసేసాను.
మొన్నొకరోజు Killer Sally చూస్తుంటే మొదటి మూడు ఎపిసోడుల్లో రకరకాల ఇంటర్యూలు చేయించి, వీడియోలు చూయించి Sally దారి తప్పిందే ఐనా అమాయకురాలు అని చెప్పేస్తాడు. ఆ 'Sally సాధ్వీమణిని మొగుడేదో ఘాట్టి ఘాట్టిగా కొడుతుండడంతో, వాడినుంచి అత్మరక్షణార్ధమై ఒక తుపాకీతో మొగుణ్ణి కొద్దిగా కాల్చింది. వాడేమో చచ్చూరుకున్నాడు' అని మనంకూడా అనుకుంటాం. చివ్వరి ఎపిసోడులో మాత్రం 'Sally శాడిస్టూ, మొగుడే అమాయకుడు. ఆమె వాణ్ణి రెండుసార్లు కాల్చింది (ఒకసారు చాతీలోనూ, ఇంకోసారి నుదిటిమీదా కాల్చుతుంది -అదీ execution స్టెల్లో). అది ఆత్మరక్షణ ఎలా అవుతుంది?' అని అంటాడు. వీడెప్పుడూ తిన్నగా విషయానికి రానే రాడు! ఆముక్క ఒకటి రెండు ఎపిసోడుల్లో చెప్పొచ్చుగా? మనకి నాలుగ్గంటలు బొక్క! మధ్యలో లక్షాపాతిక ఇంటమదితో ఇంటర్వ్యూలు. వాళ్ళందరూ రెండో ఎపిసోడులో ఒకలాచెప్పి, నాలుగోదాంట్లో ఇంకోలా చెబుతారు. కొందరు చెప్పేదానికి అసలు రిలవెన్సే ఉండదు. మధ్యలో మనం పిచ్చాళ్ళం.
మొన్నామధ్య ఏదో ఆరోగ్యం గురించి చూస్తుంటే ఒక అందమైన భారతీయ డాక్తరొచ్చి 'అలా చేస్తే మీరు చచ్చిపోతారూ...' అని అందంగా నవ్వుతూ చెప్పింది. మనం చచ్చిపోతే ఆవిడకు అంత ఆనందం కలుగుతుందనమాట!
వీళ్ళే తీసిన కొన్ని సినిమాల ఆనిమేషను అతిఘోరంగానూ, సినిమాలు అతిబోరుగానూ ఉండడంతో రేటింగు సైట్లు పదికిగానూ ఏకంగా సున్నా స్టారులిచ్చాయి.
మరి జనాలు వీణ్ణి వదిలేసిపోతున్నారూ అంటే పోరూమరి! పైపెచ్చు వీడిది అత్యంత ఖరీదైన OTT.
