Monday, March 2, 2020

క్షమాభిక్ష అవసరమా?

అసలు క్షమాభిక్ష నాకు అర్ధం కాదు. నిందితుడు నేరం చేశాడు అని రుజవైపొయింది. వాడికి గవర్నమెంటే ఒక లాయర్నిచ్చింది. ఏళ్ళ తరబడి వాదనలు సాగాయి. నిందితుడుకూడా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇహ క్షమాపణ ఏంటి? అంటె ఒక గవర్నరో, రాష్ట్రపతో మొత్త న్యాయ వ్యవస్థని చెత్తబుట్టలోకి విసిరెయ్యొచ్చా? అప్పటిదాకా విచారణ చేసినోళ్ళు, వాదించినోళ్ళు, శిక్షలు విధించినోళ్ళు పిచ్చోళ్ళా? ఇహ నిర్భయ కేసుకొస్తే, వాళ్ళు క్షమాభిక్ష అడుక్కుంటున్నట్లు లేదు. అదేదో వాళ్ళు సంపాయించిన అస్థిలా కాలర్ పట్టుకొని దబాయించి అడుగుతున్నారు.

అయినా వాళ్ళు చేసిందేమీ ఆకలెస్తే రెస్టారంట్కి వెళ్ళి తిండి దొంగిలించడం కాదు. వీళ్ళను క్షమించే హక్కు ఎవరికిమాత్రం ఎందుకుండాలి? తాగి కారు నడిపినవాళ్ళతో transport department ఇంతకంటే కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ గాడిదల్ని కూచోబెట్టి మేపుతున్నారు. కూటికి లేక ఎంతోమంది చనిపోతుంటారు. వాళ్లల్ని ప్రభుత్వాలు పట్టించుకోవు. ఈ రాకాసులకు మటన్ బిర్యానీ పెట్టి మరీ మేపుతున్నారు.

వాళ్ళేమో ఒక్కొక్కడు ఒక్కోసారి ఆఖరు నిమిషంలో క్యూరేటీవ్ పిటీషన్లు, క్షమాభిక్షలు ఫైల్ చేస్తున్నారు. అవికాస్తా కోర్టులో కొన్నాళ్ళు, లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర కొన్నాళ్ళు గడుపుతాయి. తీరా అన్ని తంతులూ పూర్తయ్యాక మళ్ళీ వాళ్ళకి 14 రోజుల టైమివ్వాలంట. ఇంకానయం తాజ్మహల్ కూడా చూపెట్టాలని, పబ్బుల్లో తిప్పాలనికూడా చెప్పలేదు. వాళ్ళందరికీ ఒకేసారి శిక్ష విధించాలట. వాళ్ళేమైనా పిక్నిక్కుకు లేకుంటే కాశీయాత్రకు వెళుతున్నారా అందరినీ కలిపి పంపించడానికి? ఇన్ని చెప్పిచచ్చిన ఇగ్లీషువాడు ఈ రూల్సన్నీ ఎప్పుడైనా పాటించాడా? ఇదిగాక వాళ్ళ సున్నితమనసులకో, పవిత్రదేహాలకో గాయాలైతే ఇక నిరవధిక వాయిదాయే శరణ్యం. అందులో ఒకడు రాష్ట్రపతి వాడు పెట్టుకున్న అప్పీలును తిరస్కరించాడని, దాన్ని సుప్రీంకోర్టులో సవాలుచేశాడట. ఆడు మొనగాడ్రా బుజ్జీ!

మనోళ్ళొక విధాన నిర్ణయం తీస్యుకునారు. ఏమి "దరిద్రపు నేరాలు చేసిన వెధవలకి క్షమాభిక్ష ప్రసాదించకూడదు" అని. ఇది స్వాగతించాల్సిన విధాన నిర్ణయం. మరి లాబుక్కుల్లో కూడా అది రాసి ఎందుకు ఛావలేదు? ఇది అలసత్వంగాక మరొకటి కాజాలదు. ఇది మన దౌర్భాగ్యం. రేపు ఇండియా వెళ్ళినప్పుడు నేనూ ఒకరిద్దర్ని చంపేస్తాను. ఏనాకొడుకు ఏం పీకుతాడో చూస్తాను!

ఈ డిఫెన్సు లాయర్ మాత్రం పిచ్చపిచ్చగా నచ్చాడు. వ్యవస్థ గుడ్డలూడదీసి జంతర్మంతర్ దగ్గర ఊరేగించాడు.