నోబెల్ బహుమతో, పాగల్ బహుమతో. కనీసం మతో. ఏదో ఒకటి ఇవ్వండ్రా బాబూ. మొన్నేమో ఇరాకునుండీ తప్పుకొన్నాడు (అసలు ఇరాకు మీదకి యుధ్ధమే ఒక పనికిమాలిన పని. ఎంతకాదనుకున్నా సద్దామువారు ఇరాకు రాజుగారు. ఐసిస్ని పీకమీద తొక్కి నొక్కడం అయనకు అవసరం. అమెరికావాడు వెళ్ళి చేసిన పుణ్యకార్యంతో ఐసిస్ వాళ్ళకు అమెరికా ప్రభుత్వంని ఐసిసోళ్ళు గంధర్వులనే భావించారు. ఆనక వీడు సైన్యాన్ని విరమించుకోవడం). ఇప్పుడు బాబుగారికి నొబెల్ బహుమతీ, అధ్యక్ష పరపతీ రెండూ కావాలట! ఇంకేం అఫ్ఘనిస్తాన్నుండికూడా విరమించుకున్నాడు. ఆనక పాకిస్తాన్ సైన్యంతో రంకు వ్యవహారమొకటి! వీడు, మన ఇంటర్మీడియట్గాడు కలసి ఇండియా దుంపతెంచేలా ఉన్నారు. నాయనలారా మమ్మలను అరావయ్యేళ్ళ కాంగ్రెస్ దుష్పరిపాలన ఏమీ పీకలేకపోయింది స్వామీ! మీరుమాత్రం అనితరసాధ్యమైనదాన్ని పదేళ్లలో చేసిచూపినారుస్వామీ!
ఇప్పుడు ఇండియాని రక్షించగలిగేవాడు ఒక్క K.A. Paul మాత్రమే!! ఏమంటే! ప్రపంచయుధ్ధాలు ఆపడం, ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టించడం ఆయనకుమాత్రమే తెలిసిన విద్యలు మరి!! 😀