Friday, March 6, 2020

మునుగుతున్న బ్యాంకులు

Image result for payal rohatgi yes bank tweet

చిన్నప్పుడు ఒక పాఠం ఉండేది "పిసినారి" అని. ఒకడెవడో తన సొమ్మును ఏమాత్రం ఖర్చుపెట్టకుండా, దాన్నొక గొయ్యితీసి దాంట్లో పెట్టి, ప్రతిరోజూ వచ్చి చూసుకొని, లెక్కించుకొని మురిసిపోయేవాడట. ఒకరోజు ఇదంతా చూసిన ఒక దొంగ మొత్తం ముల్లె దొంగిలించుకుపోయాడట. నాకెందుకో బ్యాంకుల్లో డిపాజిట్టు చెయ్యడంకంటే ఇదే తెలివైన పని అనిపిస్తుంది. కాకపోతే ఒక iron safeలో పెట్టి, దాన్ని దాచెయ్యడమే. ఎలాగూ దిక్కుమాలిన గవుర్నమెంటు దొంగలనుంచీ రక్షించలేదు, రేపే దొంగో ఆ ఇనుపభొషాణం తెరవమని గొంతుమీద కత్తెడితే మనమే సొంత చేతుల్తో తెరిచి, అర్పించుకోవాల్సుంటుంది. అందుకన్నమాట దాన్ని దాచెయ్యడం.

తనదాకా వస్తే కానీ తెలియదు అని ఒక సామెత. పాయల్ రోహిత్గీ అని ఒక వీర బత్తాయిణి వుంది. ఇన్నాళ్ళు మన ఇంటర్మీడియట్ గాడి చంకలు ఘాట్టి ఘాట్టిగా నాకింది. ఇప్పుడు నిజం తెలుసుకున్నదై "ఇది బ్లూమింగు యెకానమీ కాదు యేమీ కాదు" అని 'సంబరమాశ్చర్యాలకు' గురయ్యింది. రోజూ తాగున్న మోదీరసం ఇప్పటికి దిగింది వనితామణికి. అందులో కూడా HMOInida అట. బ్యాంకులను ఒడ్డున పడెయ్యడం హోంమినిస్టరు పనా?

ఇదెందుకు మునిగింది అన్నది చాలామంది విశ్లేషించారు. అదికాదు విషయమిప్పుడు. ఇది మునగడం ఖాయమని నెలలక్రితమే తెలుసట. మునగడానికి ఒక ప్రధాన కారణం Non Performing Assets (ఎకానమీ మినిస్టరు రంగంలోకి దిగి దానికి ఏ స్కూలుపిల్లలో కారణమని చెప్పేదాకా, మనం NPAలే కారణమనుకోవాలి అధ్యక్షా!!). ఎవ్వరూ అప్పివ్వని ప్రతి పనికిమాలిన కంపెనీకీ యెస్సోడు అప్పిచ్చాడు. అదేంటో నాకర్ధంకాదు. ఎవడైనా ఒకైదులక్షలు అప్పుకావాలండీ అని వెళితే బ్యాంకులు ఒక ఐఐటీ ఎన్ట్రెన్సు టెస్టు పేపరు చేతిలోబెట్టి, "అరగంట టైములో వాటికి సమాధానాలు రాయి, నీకొక 90% వస్తే, అప్పుడు చూద్దాం" అంటాయి. అదే ఏ కంపెనీ వాడో నాకొక వందకోట్లుకావాలంటే మాత్రం వెంటనే "మీ అక్కౌంట్ నంబర్ ఏంటి సార్?" అంటాయి. అసలు విషయమేంటంటే ఈ మునుగుతున్న దాన్ని కొనమని SBIని బలవంత పెట్టారట. అందువల్ల SBI షేర్లు (అనగా పులులు)  కూడా ఎలుగుబంట్లై (bear trend పట్టి) పోయాయట. ఒకవేళ SBI నిజంగానే కొనిందా, SBIమ్యూచువల్ ఫండ్ల అధిక ఫలాలమీద ఆశలు పెట్టుకున్నోళ్ళ ఆశలన్నీ గోవిందో!! గొహోవిందా!! ఎలాగూ యెకానమీ 'బేర్‌'మంటోంది (అనగా మరొక ఎలుగుబంటి). ఇన్వెస్టర్లు రావడానికి వెనుకాడుతున్నారు (అల్లర్లూ, ప్రభుత్వం నిరంకుశత్వంపైపు పయనిస్తుందన్న భయాలవల్ల).

ఆనక మూలుగుతున్న ఎలుగుబంటిమీద తాటిపండులా కరోనా వైరస్. ప్రభుత్వాన్ని "కుచ్ కరో నా!" అంటే "కర్నేకు ముఝే కుచ్ భీ సమఝ్ మే నహీ ఆరా!" అంటోంది. ఆ కరేదేదో కరోనా వైరస్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అన్నట్లు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఏంచెయ్యాలో ఒక ప్రబుధ్ధుల వర్గం ఇవ్వాళే ఒక బ్లాగులో రాసింది. వీళ్ళను నమ్మడమంటే కుక్కతోకపట్టుకొని గోదారి ఈదడమే! ఇదింగో తింగరిజాతి. ఇలాంటోళ్ళు మంత్రులైనందుకే ఇలా ఛస్తన్నారు.  ఈ పాఖండులకు మనుషులు చచ్చినా ఫర్లేదు. వీళ్ళ డాంబికాలకుమాత్రం కొరత రాకూడదు. ముందుగా మనం బలమైన చెప్పులేసుకోవడం మొదలెట్టాలి. ఆ చెప్పులు తెగేదాక వీళ్ళని చావబాదాలి. ఆ తరువాత కాల్చిపార్నూకాలి నడిరోడ్డులో ఈ పరాన్నభుక్కుల్ని. లుచ్ఛానాయాళ్ళరా! మీరిచ్చే చచ్చు పధ్ధతులు పాటించి ఛస్తన్నార్రా జనాలు. ఛండాలపు వెధవల్లారా! ఇంత విలనీ ఏమిట్రా పాఖండులారా? 

అయినా మనం భయపడఖ్కర్లేదు. ఎందుకంటే? 
  1. మందిరం మనం అక్కడే కడతాం.
  2. ప్రమాదంలో పడిన హిందూమతాన్ని మనం రక్షించితీరుతాం.
  3. గోమూత్రం కూలుతున్న యెకానమీనుండి కూడా మనల్ని  రక్షించగలదు.
  4. ఏది యేమైనా మిగతా దేశాల్లోని ముస్లిమేతరులందరికీ మనం మనదేశంలో ఆసరా ఇచ్చితీరుతాం.
Stay positive మచ్చా! యెకానమీ పోతే పోనీ. తుమ్మితే పోయే ముక్కులాంటి యెకానమీ మనకు మాత్రం ఎందుకు?

Image result for modiji soch samajh ke hi kiya hoga meme

ఇంటర్మీడియట్ గారు  ఇలా చేశారంటే, ఎంతో ఆలోచించి చేసుంటారు మరి!!


Update: చివరకు తెలిసిన విషమేమిటంటే రెండు రూపాయలున్న షేరును పది రూపాయలకు SBIచే కొనిపించారట (ఏ తలమాసినవాడైనా ఇలా కొంటాడా? లక్షఖరీదుచేసే కారుని ఏ గాడిదకొడుకైనా ఐదు లక్షలక్కొంటాడా? రైట్వింగు ఎకానమీలో ఇదెలా సాధ్యమో ఆడం స్మిత్ చెప్పాలి). ఆనక వాళ్ళు ఒక మూడేళ్ళు వాళ్ళుకొన్న షేర్లు అమ్మకూడదు అని కండిషనట. మనం SBIఅని పేరుకు చెప్పుకున్నా అది SBI led  consortium అందులో LICక్కూడా షేర్లుంటయ్. ఇంకోమూడేళ్ళలో ఇవికూడా నష్టాలు పట్టిపోతే అప్పుడు వాటినీ పైవేటుపరం చేస్తారు. అప్పుడెంచక్కా ప్రపంచంలో ఏబ్యాంకు మునిగినా మనకు మూడుతుంది (single point of failure నుంచి మనం విజయవంతంగా multiple points of failureవైపు పయనిస్తున్నాం. ఇది నిజంగా అద్భుతమైన విషయం!) ఇహ నాయనలార! మనకు స్విస్బ్యాంకులే గతి. త్వరలో అమెరికన్ ఎకానమీలగా ఇండియన్ ఎకానమీ కూడా ఏదుస్తుంది. ఇహ ఇండియాలో డబ్బులు దాచుకోవడం పేద్ద బేకు పని.