ఈ రాత్రికి కార్యక్రమమల్లా పదింటికల్లా బవేరియన్ వనిత శిల్పం వద్దకుచేరి, ఈ సోకాల్డు రాకెట్టులను 90 మీటర్ల ఎత్తుకు చేర్చి కాల్చివేయడమే! దాదాపు ఒక పుష్కర కాలం తరువాత దీపావళి సెలెబ్రేటు చేయుచున్నవారలము - అదికూడా ఒక తంతులా కాక ఇష్టముతో!! నాకు మరియు, మాకు (plural but not the royal we) నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Monday, December 31, 2018
Sunday, December 30, 2018
అనువాదాలు కాదు, అసలు ప్రతులు చదవండి!
ఎవరైనా రామాయణాన్ని విమర్శించినా, అశ్వమేధ యాగంలాంటి యాగపధ్ధతుల్లోని అశ్లీలతను ఎత్తిచూపినా, వేదాల్లోని విషయాల్ను విమర్శించినా, ఒకప్పటి ఆహారపు అలవాట్లలో గోమాంసభక్షణ తప్పనిసరని ఋజువుచేస్తూ ఒక పుస్తకం రాసినా, ఈ బ్యాచ్ "అనువాదాలు కాదు, అసలు ప్రతులు చదవండి" అంటుంది. ఈ గుంపు ఉద్దేశ్యమల్లా ఎవడికీ అఖ్ఖర్లేని అ దిక్కుమాలిన సంస్కృతాన్ని నేర్చుకోవడంలో ఆయా విమర్శకులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటుంటే చూసి ఆనందించాలి, ఆ విధంగా ఆయా విషయాలమీద విమర్శ లేకుండా చెయ్యాలి అని. పోని సంస్కృతం ఒకడు నేర్చుకొని వాడు అనువదించాడనుకుందాం, ఇప్పుడు నువ్వో, నేనో మళ్లీ నేర్చుకొని, అర్ధంచేసుకు చచ్చేది అప్పటికే అనువదించబడిన విషయమే కదా! మరి ఆమాత్రానికి reinventing the wheel ఎందుకు? అయినా ఉనికిలోనే లేని సంస్కృతం ఎవడిక్కావాలి? పోనీ ఇంతలా అసలు ప్రతులపై ప్రేమలు ఒలకపోస్తున్న మేధావులందరూ అనువాదాలుకాదూ చదివి కాదూ భక్త్యోన్మాదంతో ఊగిపోతున్నది? వీళ్లందరూ మాత్రం అసలు ప్రతులు చదివినారా?
మరి ఈ పుణ్యాత్ములు మార్కిజాన్ని విమర్శించాలంటే ముందుగా జర్మన్ నేర్చుకొని, ఆ తరువాత జర్మన్ భాషలో Das Kapital పుస్తకాన్ని చదివి, ఆపై తీరిగ్గా విమర్శిస్తారా? లేదే! మహా ఉంటే అదే పుస్తకాన్ని, ఇంగ్లీషులోనో లేదా వారి మాతృభాషలోనో చదువుతారు. ఇంకొందరు ప్రబుధ్ధులు వికీపీడియానో, ఇంకొకరు రాసిన బ్లాగునో చదువుతారు. మరి ఎందుకు మతగ్రంధాలకే ఇన్ని భాషాపరమైన నియమాలు? ఖురాన్ను విమర్శించడానికి అరబిక్కూ, బైబిల్ను విమర్శించడానికి యూదుభాష (లేదా పురాతన గ్రీకు) నేర్చుకు తీరాల్సిందే అనైతే వీరు అనుకోరుగానీ, సంస్కృతం నేర్చుకోవాలని ఒక ఉచిత సలహా పడేస్తారు. ప్రతిదాన్నీ ఒరిజినల్సులోనే చదివేట్టైతే, ఇంటర్ కాంటినెంటల్ వంటకాలు చెసే షెఫ్ఫులందరూ బహుభాషాకోవిదులుగా మారాలి ముందుగా!
Thursday, December 27, 2018
ఆవరణ - సంతేషీవర లింగణ్ణయ్య భైరప్ప
ఈ పుస్తకం గురించి గౌరీ లంకేష్ వ్యాసల్లో చదవడం జరిగింది. ఆవిడ అభిప్రాయం ప్రకారం అది ఒక చెడ్డ పుస్తకం. అలా అభిప్రాయ పడిన గౌరీ లంకేశ్‌గారు భైరప్ప గారు రచించిన "పర్వ" గురించి మాత్రం విస్త్రుతంగా ప్రచారం చేశారట. కొన్నేళ్లక్రితం నా కరుడుకట్టిన RSS apartmentmate ఒకరు నన్ను "ఆవరణ"ను చదవమన్నప్పుడూ నేను అన్నమాట "అబ్బాయ్ నాకు ఈ "ఆవరరణ" తెలీదుగానీ, ఆయనకు జ్ఞానపీఠ్ తెచ్చింది మాత్రం "పర్వ". నువ్వు భైరప్పతో మొదలెట్టలనుకుంటే నువ్వు ముందుగా "పర్వ" చదవడం మంచిది. పైగా నాలా నీకు అనువాదాలు చదవాల్సిన అవసరంలేదుకదా!" అని వాకృచ్చాను. అలాంటి నేపధ్యంలో ఈ మధ్యే పుస్తకాన్ని చదవడం తటస్థించింది.
మధ్యలో వచ్చే లక్ష్మి ఉర్ఫ్ రజియా పాత్ర నవలా నేపధ్యాన్ని మినహాయించుకుంటే (అది కధ కదా!), రచయిత ఇచ్చిన historical references నిజమే! కాకుంటే ఒక్క విషయం. ఇండియాని పాలించిన రక్కసుల లిస్టునుండి అక్బరును మినహాయించడం అన్యాయం. అక్బరు జిజియాను రద్దుచేసుండొచ్చుకాక, కానీ... అక్బరును మించిన కాముకుడూ, అహంభావి వాడి తరువాత మొఘలువంశంలో పుట్టినవాడు ఒక్క షాజహాన్ మాత్రమే! షాజహాన్ ఏకంగా తన సొంతకూతురుతో రాసలీలలు నెరపిన ఘనుడట!
చివరగా... హిందువులు మాత్రం ఉత్తములు అంటూ ఇచ్చిన సర్టిఫికెట్ గర్హనీయం (మహా రాణా ప్రతాప్, శివాజీ లాంటి కొన్ని exceptions ఉన్నప్పటికీ). హిందూ రాజులకు మత పిచ్చలేదు ఒప్పుకుంటాను. మరి కులపిచ్చసంగతో. అలాగని హిందూరాజులందరూ ధర్మప్రభువులుకాదే! పద్మనాభస్వామి దేవళంలో అంతటి సొమ్ము పోగుపడటానికి కారణం, ఆ రాజులుంగాళ్ళు బాలింతల ఱొమ్ముల మీదకూడా పన్నువేసేవారట! ఆ ఱొమ్ముల పరిమాణాలనుబట్టి పన్నుఱొక్కం నిర్ణయించబడేదట. ఈ పుస్తకంలో ఏకంగా హిందువులందరూ మనుస్మృతి తప్పని దానికిగానూ చెంపలువాయించుకొని తప్పుకున్నట్లు చెబుతారు. 2016లో మనుస్మృతిని తగలబెట్టినందుకు (అదికూడా కేవలం symbolicalగా) ఒక ప్రొఫెసర్‌పై నేరం బనాయించబడింది. ఈనాటికీ కులంపేరుతో పరువుహత్యలు జరుగుతున్నాయ్. అలనాటి ఔరంగజేబు అనబడే వెధవ చేసిన పనులనే చేసినా, ఒకానొక మహానుభావుణ్ణి భారతీయులు ప్రధానిని చేసి, వారు ఏ గడ్డి కరిచినా వారి చంకలునాకుతూ తమ బానిస బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. రామాయణ, భారతాలను గురించి అస్థాన ముల్లాలు (I mean ప్రవచనకారులు) చెప్పే విషయాలు బుర్రలతో విన్నా, వాటిల్లోని కులతత్వం అర్ధమవుతుంది. ఆ గ్రంధాల్లోని విషయాలు ఈనాటికీ మార్పులేకుండగనే ఆచరణీయాలని భావించే పిచ్చవెధవలు ఈనాటికీ భారత సమాజంలో ఉన్నారు.
నా దృష్టిలో "ఆవరణ" is a partial truth.
P.S. : నాకు తెలిసి కమ్యూనిజాన్ని/సోషలిజాన్ని, ఇస్లాంతో ఏ బుద్ధున్న వాడూ పోల్చడు. అసలు ఆరెండూ మౌలికంగానే పరస్పర విరుధ్ధాలు. కమ్యూనిజం దేవుణ్ణి అంగీకరించదు. ఇస్లాంలో.. ఎందుకులే... బంగ్లాదేశ్‌లో నాస్తిక బ్లాగర్ల హత్యలు వినలేదూ!!
Friday, December 14, 2018
2019లో పీకాలనుకుంటున్నవి
- బిరియానీ చెయ్యడం నేర్చుకోవాలి. చక్కటి "చాయ్" చెయ్యడం నేర్చుకోవాలి.
- రావిశాశ్త్రి పుస్తకాలన్నీ చదవాలి
- తెలుగు, ఇంగ్లీషు, హిందీ పుస్తకాలని చదివేసి, బయటకు విసిరెయ్యాలి. ఒక డెభ్భై పుస్తకాలు తగలెట్టాలి. And no more of paper-book buying for me unless they are Telugu.
- మరో క్లాసు అనబడే మరో తద్దినాన్ని తగిలించుకోవాలి.
- Mo Yan, Murakami లను చదివెయ్యాలి.
- Auswitz ని సందర్శించాలి, Aurora Borealis వెలుగులో ఒక రాత్రి గడపాలి.
- కనీసం ఒక్క మ్యూజియంకి రెగ్యులర్ విజిటర్నై ఉండాలి.
Friday, December 7, 2018
నాకూ రాజకీయాల్లోకి రావాలనుంది
రాజకీయాల్లోకి వచ్చి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఎలాంటి అడ్డగాడిదకైనా ఉంటుందని నాకు తెలుసు. మరి నాలాంటి నిలువు గాడిదకు ఉందో లేదోనన్నదిమాత్రం నాకు తెలీదు. అందుకే నేను ఈసీ వారికి ఈ బహిరంగలేఖ వ్రాయుచున్నాను.
నా అర్హతలు :
- ఇంటరు నాలుగు సార్లు తప్పినప్పటికీ, నేను పదోతరగతి నిక్కముగా ప్యాసయి ఉన్నాను. ఒక లక్షన్నరదాకా పుస్తకాలు చదివియున్నాను -అదికూడా కేవలం మూడు నెలల వ్యవధిలోనే! మల్లయుధ్ధం, జూడో, కరాటేల్లో ప్రవేశం ఉంది కాబట్టి చట్టసభల్లో నెగ్గుకురాగలను. పంచెలూడగొట్టడంలో దుశ్శాసనుడికున్న అనుభవం నాకూ ఉంది. నేను మా అన్నకన్నా గందరగోళంగా మాట్లాడగలను. నా అభిమానులు నన్ను మించిన వెధవలు, లత్తుకోర్లు, లుఛ్ఛానాయాళ్ళు. బుర్రలు ఏమాత్రం వాడకూడదని వాళ్ళందరూ ఏప్పుడో ఒట్టేసుకున్నారు.
- "జారే జహాసె అచ్చా... యే బుల్బుల్ హమారా... యే సితారా హమారా" అనే వేమన పద్యం నాకూ వచ్చు. నాకూ 'సంస్కృత'పాండిత్యం ఉంది. సభల్లో తప్పతాగినవాడిలా నేనూ మాట్లాడగలను. తపంచాలతో కాల్చడం దగ్గరనుంచీ, స్నైపర్షాట్లు తీసుకోవడం వరకూ నాకు అనుభవం ఉంది. ఈ మధ్యనే మా వెంపలి వృక్షమునెక్కి, అక్కడినుండి మా రోట్లోకి దూకాను కాబట్టి నేను ఎక్కని ఎత్తూ, చూడని లోతూ లేదు. నా అభిమానులు కులగజ్జి నాయాళ్ళు. వాళ్లందరికీ కలిపి నాకున్నంత -బఠాణీ గింజంత- బుర్ర కూడా ఉండదు.
- నాకు... షేవ... షేయాలని... ఉండి. నకు... పుల్లయ్య గారి.... ఆసీస్సులు, ఎల్లయ్య గారి అసీష్షులు, మల్లయ్య గరి అషిష్షులు ఉన్నాయి. నాకు సెవా... చెయలని ఉన్నది. నకు యెంకయా గరి అస్సీస్సులు... ఇంకా వెంకయా గరీ ఆషిషులు కుడా ఉనయి. అంతెకకుండ సత్తెయ గరె ఆఫీసులు కుడ ఉనయి. నకు సెవ చెయలని ఉనది. మా తత గరు అఫుడూ అంటే వారు ప్రజలే దేవుళు, సమజమె దెవాల్యం అని. నకు సాంతయ గరి అఫీషులు కుడ ఉనై. నెను మగ పడుచూనీ అండ్ ఇకడే నాకు అశీస్సు ఉంది. అంధులో కుచోని నేను సెవ చెస్తను. నాకు షేవ్ చెయాల్ని ఉంది. నెను బగలనకా రత్రనక షెవ్ చెస్తను. నూరు పుడకల 'త్రిపసుచ్చాపి'ని, రోడ్స్ను కుడతను. నాకు చినపటి నుందీ షెవ్ చెయ్యలను ఉంది. నాకు రొందు తమ్ముల్లు ఉన్నై. అవి సందు చుసుకొని దురుతై. నికు సెవ చెయలని ఉంది.
- అబ్రహం లింకను మా ఇంట్లో వారాలబ్బాయిగా ఉన్నాప్పుడు, నేనే అతనికి రాజకీయం నేర్పించి. అమెరికా పంపించి, నా పలుకుబడితో అతన్ని అమెరికాకి సర్పంచుని చేశాను. ఆ తరువాత అతనికి న్యూయార్కును సొంత డబ్బుతో కట్టించి ఇచ్చాను. ఆ తరువాత హిట్లరును జర్మన్ ఛాన్స్‌లర్ చేసింది నేనే! స్టాలిన్ ను చిన్నప్పుడు లాగి లెంపకాయ కొట్టిందీ నేనే! ఆ తరువాత అలెక్జాండర్‌కు కత్తి యుధ్ధం నేనే నేర్పాను. కుషాణులకు, హూణులకు, నేనే మంత్రిని. రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం నేనే రచించి "కాళిదాసు" అనే కలంపేరుతో తాటాకులమీద అచ్చోయించాను. మహమ్మదు ముందు నిలబడిన జిబ్రాయేలును నేనే! యేసును శిలువ మీదుండగా మేకులు తీసి, అతణ్ణి స్వర్గానికి పంపించడానికి ఫ్లైట్ టిక్కట్టుకు డబ్బులిచ్చిందీ నేనే! కృష్ణుడికి సాంఖ్యశాస్త్రంలో డౌట్లుంటే నన్ను అర్ధరాత్రి అపరాత్రి అనే తేడాలేకుండా కాల్‌చేసి చంపేవాడు. అతనికి భ్గవద్గీత నేర్పేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది.
- మా మహానాన్న మాజీ సర్పంచ్. నేను మారధాన్ రన్నర్‌ని. ముద్దులెట్టడంలో నాకు నేనే సాటి.
కావున పై అర్హతలున్న నేను ఈసీ తరఫున అభ్యర్ధిగా నామినేషన్ వేయుటకు సంకల్పించుచున్నాడను. మీరు మీ అనుమతితోపాటు, నామినేషన్ పేపర్లుకూడా పంపించగలరు.
భవదీయుడు
Tuesday, November 27, 2018
ప్రభువు నిద్దరోతుండెను!
లేకుంటే ప్రభువు జన్మభూమి ఐన అమేరికా దేశమునుండి, ప్రభువాక్యము ప్రకటించుటకై ఏతెంచిన ఒక దైవజనుడు అవిశ్వాసుల అనాగరికపు బాణములకు నేలకొరగుటయా? ఇష్హీ!! ప్రభు చిత్తమునెవరు ప్రకటించగలరు? ఇందులోకూడా ప్రభువు తన మర్మమునేదైననూ దాచి ఉంచినాడేమో!
ప్రభు నామము ప్రకటించుటకై మన తలుపుతట్టు దైవజనులను మనమునూ తలుపుచెక్కలతో తట్టి ప్రభుమహిమను గొప్పగ మనమునూ ప్రకటించెదము. ఆమెన్!
Sunday, November 4, 2018
Friends With Benefits, etc...
At last CBN and RG came together to overthrow the dictatorship of NAMO (If this is not Friends With Benefits, what is?). CBN is literally behaving like a spurned lover: going over the past and beating his breast about how he was being cheated from day his relation with NAMO had started. And I am sure that the yellow-newspapers would follow in suit and see a recreation of the devil disguise in NAMO. I wish I had attended that funeral -of the journalism.
Thanks to CBN for putting chameleons to shame ( I am sure a lot of CBN-fans had a change of heart too).
All of a sudden, NAMO has become a good listener: after the Rafael scam hit him. This is the great guy who had once advised Manmohan to "speak up". This guy now has all the time in the world to talk sorts of rubbish in his manki baat, but hardly has any time to clear the doubts in serious matters. Like the romans emperors arranged spectacles of gladiatorial games, NAMO is depending on statues, coats, speeches etc... I hope he learns some magic and does on the stage. The people are so stupid that he might even win.
By the way? Why is that all the govt projects take 4+ years to come to fruition? May be for the better results, Indians should try electing a new CM/PM every 3 months. Or may be they should issue a 'show cause to let you continue for the next quarter' notice every 3 months.
While things are being like this, the great CM divined that there will be a good news by Diwali. Apparently what Indians need are more temples (not schools, hospitals or even toilets. Just temples).
Long live stupidity!!!
Tuesday, October 30, 2018
Finally!
I have managed to read Yuval Noah Harari, a Murakami, A Markus Zusak.
But I have more books to read and throw them out so as to become more light weight. More interesting books to read abut the middle east. More serious German books. More criminology, more psychology.
I have more places to visit. More movies to watch from my Netflix. More types to beers to taste.
So, I am moving my target to 60 and I am wishing myself a happy 2019 :-)
Saturday, October 13, 2018
ప్రజాస్వామ్యము
మనుషులు భవిష్యత్తులో AIని సాధించాక ప్రస్తుతమున్న సామాజిక వ్యవస్థలుకూడా భవిష్యత్ పరిస్థితులకనుగుణంగా మారాలి అని వాదించే 21 Lessons for the 21st Century అనే పుస్తకంలో రచయిత ఈ విషయాన్ని పంచుకుంటాడు:
డెవిడ్ కామెరూన్ గారు పదవీ విరమణ చేస్తూ, బ్రెక్జిట్ విషయంలో ఏమిచేయాలో తేల్సుకొనేందుకు జరిపిన అభిప్రాయసేకరణతంతులో "మీరేమి ఆలోచిస్తున్నారు" అని కాకుండా "మీకేమనిపిస్తోంది" అంటూ ప్రజలందర్నీ ఓటు వేయమని ప్రార్ధించడాన్ని తప్పుబడుతూ Richard Dawkins అనబడే ఒక శాస్త్రవేత్త "చాలా మందికి బ్రెక్జిట్ వల్ల సంభవించే రాజకీయార్ధికపరిణామాలపై కనీస అవగాహన లేదు. అంతెందుకు ఆ కనీస అవగాహన నాక్కూడా లేదు. మాలాంటి అజ్ఞానులందరూ ఓట్లేసి ఉధ్ధరించేదేముంటుంది?" అని అడిగారట. ఇలాంటిదే నాకో సందేహం డెమాక్రసీ vs రిపబ్లిక్ విషయంలో ఇప్పటికీ పదిలంగానే ఉంది. రచయిత అంటారూ "తలకొక్క ఓటువల్ల ఒరిగే దేముంటుంది? హేతుబధ్ధంగా అలోచించేవారి, విషయం ఉన్నవారి తలకి ఒక ఓటు ఉండాలికాని. తలకొక్క ఓటు ఉండాల్సిందేనంటారా... మరి అదే స్ఫూర్తితో, ఐన్శ్తైన్ రాసిన సమీకరణాలు సరైనవో కావో తెలుసుకోవడానిక్కూడా మనం ప్రజభిప్రాయసేకరణ వాడొచ్చా? అంతెందుకు ఏ రన్‌వే మీద విమానం దిగాలో ప్రయాణికులు తమలోతాము చర్చించుకొని, ఫలానా రన్‌వే మీద విమానాన్ని దించాల్సిందేనని పైలెట్‌ని ఆజ్ఞాపించనిద్దామా?"
ఈ రచయిత intellectual oligarchyని అభిలషిస్తున్నారు.
ఇదిలా ఉండగా Think Like a Freak రచయితలు మాత్రం ఇంకోలా ఆలోచించారు:
వోటు అన్నదాన్ని ఒక వనరు/సరుకుగా మనం ముందుగా ఒప్పుకుంటే, ధనవంతులు తమ డబ్బుతో ఎక్కువ సరుకుల్ని కొనుక్కోవడం తప్పుకానప్పుడు, ఎక్కువ వోట్లని కొనుక్కోవడమ్మాత్రం ఎందుకు తప్పు? మీరు అంతగా ప్రజాస్వామ్య విలువలు అని బాధపడేవారైతే ఇలా చేద్దాం పోనీ... ఒక వోటు అందరికీ ఉచితం. రెండవ వోటు ఖరీదు లక్షరూపాయలు, మూడో వోటు ఖరీదు పదిలక్షలు, నాలుగో వోటు ఖరీదు కోటి రూపాయలు, ఐదో వోటు ఖరీదు.... అదీ విషయం. ఇందులో బోలెడు లాభాలున్నాయి. అతి చవకగా వచ్చేది మొదటి వోటు కాబట్టి, ధనవంతులు 100% పోలింగ్ శాతంకోసం తహతహ లాడుతారు. వోటర్లక్కూడా తమ వోటు విలువ తమకు తెలుసుకాబట్టి, "మీకు నచ్చే విధంగా వెయ్యాలంటే మాకు 'ఇంత' మొత్తం ఇవ్వండి అనడుతారు. ఒక వేళ ధనవంతులుగారికి తమ అభ్యర్ధిని గెలిపించాలని అంత దుగ్ధ ఉంటే వోటరుగారు అడిగినంతా సమర్పించుకుంటారు."
దీంట్లో నాకు బోలెడు loopholes కనిపించాయి. బేసిగ్గా మనుషుల ఇస్టాయిష్టాల్ని ఒక వోటుమార్కెట్‌గా చూస్తున్నారు రచయిత. చూసి దానికి ఆర్ధికశాస్త్ర సూత్రాలను అప్లై చెయ్యాలనుకుంటున్నారు. అంత డబ్బుపెట్టి అభ్యర్ధులను గెలిపించిన ధనవంతులు అధికారాన్ని తమకు అనుకూలంగా మార్చుకొంటే(వాళ్ళకు అధికారము, నైతికహక్కు రెండూ ఉన్నాయ్!), దానిద్వారా పోటీని నిరుపమాపించి వస్తుసేవల మార్కెట్‌లో మోనోపొలీని సాధించాలనుకొంటే, అది సరైన పనా? Law and Order నామమాత్రంగా ఉండే ఆసియా, దక్షణ ఐరోపా, దక్షణ ఆఫ్రికా, దక్షణ అమెరికా దేశాల్లో motivation factor డబ్బు కాదు. బలం. "నాకు ఓటెయ్యకుంటే కాల్చిపార్నూకుతాను" అంటే అప్పుడు ప్రజలేం చెయ్యాలి?
వోటు అన్నదాన్ని ఒక వనరు/సరుకుగా మనం ముందుగా ఒప్పుకుంటే, ధనవంతులు తమ డబ్బుతో ఎక్కువ సరుకుల్ని కొనుక్కోవడం తప్పుకానప్పుడు, ఎక్కువ వోట్లని కొనుక్కోవడమ్మాత్రం ఎందుకు తప్పు? మీరు అంతగా ప్రజాస్వామ్య విలువలు అని బాధపడేవారైతే ఇలా చేద్దాం పోనీ... ఒక వోటు అందరికీ ఉచితం. రెండవ వోటు ఖరీదు లక్షరూపాయలు, మూడో వోటు ఖరీదు పదిలక్షలు, నాలుగో వోటు ఖరీదు కోటి రూపాయలు, ఐదో వోటు ఖరీదు.... అదీ విషయం. ఇందులో బోలెడు లాభాలున్నాయి. అతి చవకగా వచ్చేది మొదటి వోటు కాబట్టి, ధనవంతులు 100% పోలింగ్ శాతంకోసం తహతహ లాడుతారు. వోటర్లక్కూడా తమ వోటు విలువ తమకు తెలుసుకాబట్టి, "మీకు నచ్చే విధంగా వెయ్యాలంటే మాకు 'ఇంత' మొత్తం ఇవ్వండి అనడుతారు. ఒక వేళ ధనవంతులుగారికి తమ అభ్యర్ధిని గెలిపించాలని అంత దుగ్ధ ఉంటే వోటరుగారు అడిగినంతా సమర్పించుకుంటారు."
దీంట్లో నాకు బోలెడు loopholes కనిపించాయి. బేసిగ్గా మనుషుల ఇస్టాయిష్టాల్ని ఒక వోటుమార్కెట్‌గా చూస్తున్నారు రచయిత. చూసి దానికి ఆర్ధికశాస్త్ర సూత్రాలను అప్లై చెయ్యాలనుకుంటున్నారు. అంత డబ్బుపెట్టి అభ్యర్ధులను గెలిపించిన ధనవంతులు అధికారాన్ని తమకు అనుకూలంగా మార్చుకొంటే(వాళ్ళకు అధికారము, నైతికహక్కు రెండూ ఉన్నాయ్!), దానిద్వారా పోటీని నిరుపమాపించి వస్తుసేవల మార్కెట్‌లో మోనోపొలీని సాధించాలనుకొంటే, అది సరైన పనా? Law and Order నామమాత్రంగా ఉండే ఆసియా, దక్షణ ఐరోపా, దక్షణ ఆఫ్రికా, దక్షణ అమెరికా దేశాల్లో motivation factor డబ్బు కాదు. బలం. "నాకు ఓటెయ్యకుంటే కాల్చిపార్నూకుతాను" అంటే అప్పుడు ప్రజలేం చెయ్యాలి?
Friday, September 28, 2018
అక్రమ సంబంధాలు - సుప్రీం కోర్టువారి తీర్పు
ఈ తీర్పును నేను స్వాగతిస్తున్నాను.
పెళ్ళి అనేది, సంబంధాలు అనేవి, వ్యక్తుల మధ్య వ్యవహారం. అందులోకి కోర్టులూ, ప్రభుత్వాలూ రానేకూడదు (ఇరువురిలో ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయిస్తే తప్ప). సంబంధాలు అక్రమమైనా, సక్రమమైనా అది ఆయా వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం. పెండింగ్‌లో ఉన్నకేసులు చాలవన్నట్లు దాని సివిల్ లేదా క్రిమినల్ కేసులాగా మార్చేయడం అనవసరం. అంతగా అవసరమైతే విడాకులకు అప్లై చేసుకోవచ్చు. అంతేగానీ కేసులేమిటి నాన్సెన్స్!
మరి వివాహ వ్యవస్థో? వివాహ వ్యవస్థ అంటూ ఎమీ లేదు. వ్యవస్థలో వివాహాలున్నాయి. వ్యక్తులమధ్య వివాహాలున్నాయి. వాటిని కాపాడుకోవలసింది ఆయా వ్యక్తులు మాత్రమే! ఒక భార్య అక్రమం సంబంధం పెట్టుకుంటే, ఈ సోకాల్డు "వ్యవస్థ" భర్తతో ఆమెకు విడాకులివ్వమని చెబుతుంది. అదే భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే మాత్రం ఇదే "వ్యవస్థ" ఆమెను సర్దుకుపొమ్మని చెబుతుంది. ఇంత అద్భుతమైన నైతికతను ప్రదర్శించే "వ్యవస్థ"ను మనమేమీ సంరక్షించుకోవలసిన అవసరం లేదు. పెళ్ళి పేరున జీవితాంతం కలిసే ఉండండి అని బలవంతపెట్టే ఈ "వ్యవస్థ" లేని అభివృధ్ధిచెందిన దేశాల వారు సుఖంగానూ, మరింత నిజాయితీతోనూ జీవిస్తున్నారు.
పనిలో పైగా వ్యభిచారాన్నికూడా చట్టబధ్ధంచేసి దానికూడా ఒక వృత్తిగా పరిగణిస్తే, వాళ్లకి పోలీసుల నుంచీ, బ్రోకరుల చేతిలో పీడల నుంచీ విముక్తి లభిస్తుంది.
P.S. : ఆ ద్విలింగ సంపర్కాన్ని నేరం కాదని చెప్పిన తీర్పులాగానే, ఈ తీర్పుకూడా ఉపసంహరించుకోబడుతుందని నాకనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ మధ్య సుప్రీం కోర్టు తీర్పులు కొన్ని చాందసవాదానికి గొడ్డలిపెట్టులా మారాయి.
Sunday, September 16, 2018
కౌ-ఇజం
కమ్యూనిజం: మీకు రెండావులున్నాయ్. ప్రభుత్వం రెండింటినీ స్వాధీనం చేసేసుకొని, మీక్కొన్ని పాలు దయచేస్తుంది.
ఫాసిజం: మీకు రెండావులున్నాయ్. ప్రభుత్వం రెండింటినీ స్వాధీనం చేసేసుకొని, మీకు పాలు అమ్ముతుంది.
సోషలిజం: మీకు రెండావులున్నాయ్. మీరు మీ పొరుగోళ్ళకి ఒకావు దానమిస్తారు.
బ్యూరోక్రాటిజం: మీకు రెండావులున్నాయ్. ప్రభుత్వం ఒకదాన్ని చంపేస్తుంది. రెండోదాన్నుంచి పాలు పితికి, వాటినికాస్తా పారబోస్తుంది.
కాపిటలిజం: మీకు రెండావులున్నాయ్. మీరొకదాన్నమ్మేసి ఒక దున్ననుకొంటారు. మీ మంద పెరిగి, మీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ ఆవులన్నీ అమ్మేసి, కాలుమీద కాలేసుక్కూర్చుంటారు.
ఫ్రెంచి కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. మీరు సమ్మె ప్రకటించి, జనాన్ని సమీకరించి రోడ్డురోకోలూ, రైల్ రోకోలూ చేస్తారు. ఎందుకంటే మీకు మూడావులు కావాలి.
ఇటాలియన్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. కానీ అవెక్కడున్నాయో మీకు తెలియదు. మీరుమాత్రం తాపీగా భోజనానికి కూర్చుంటారు.
స్విస్ కార్పొరేషన్: మీకు ఐదువేల ఆవులున్నాయి. కానీ అవేవీ మీవి కావు. వాటిని మీ దగ్గర దాచుకున్నందుగ్గానూ వాటి యజమానులనుంచి మీరు ఛార్జీలు వసూలు చేస్తారు.
అమెరికన్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. మీరొకదాన్ని అమ్మేస్తారు. ఆ మిగిలన ఒక్కావునూ నాలుగావుల పాలిమ్మని బలవంతపెడతారు. చివరకు అ ఆవు ఎందుకు చనిపోయిందో ఒక కన్సల్టెంటుద్వారా పరిశోధిస్తారు.
ఇండియన్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. వాటిని మీరు పూజిస్తారు.
ఐరిష్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. అందులో ఒకటి గుర్రం.
ఆస్త్రేలియన్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. అంతా బాగానే ఉంది గనుక మీరు అదంతా మానేసి, హాయిగా బీరు తాగుతూ ఏంజాయ్ చేస్తారు.
ఇరాకీ కార్పొరేషన్: అందరూ మీకు ఎన్నో ఆవులున్నాయనుకుంటారు. మీరుమాత్రం మీకు ఒక్కావుకూడా లేదని మొత్తుకుంటారు. మిమ్మల్నెవ్వరూ నమ్మరు. అంతాకలిసి మీదేశమ్మీద బాంబులేసి నాశనం చేస్తారు. మీకు ఇప్పటికీ ఒక్కావుకూడా లేదు. అయితేనేం? మీకు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది!
బ్రిటీష్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. రెండూ పిచ్చివి.
గ్రీక్ కార్పొరేషన్: ఫ్రెంచివాళ్ళూ, జర్మన్ వాళ్ళూ ఇచ్చిన రెండావులు మీకు ఉన్నాయి. మీరు రెంటినీ కోసుకు తినేస్తారు. వాళ్ళు మిమ్మల్ని వాటిల్ని తిరిగిమ్మన్నప్పుడు, ప్రపంచ బ్యాంకును సాయమడుగుతారు. ప్రపంచ బ్యాంకు రెండావుల్ని మీకిస్తుంది. మీరు ఆరెంటినీ కూడా కోసుకు తినేస్తారు. ప్రపంచ బ్యాంకు మిమ్మల్ని తనిచ్చిన రెండావుల్నీ తిరిగిమ్మంటుంది. అదేం పట్టించుకోకుండా మీరు క్రాఫు చేయించుకోవడానికి సెలూనుకు వెళతారు.
చైనీస్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. వాటినుండీ పాలు పిండడానికి మీరు 300 మందిని నియమిస్తారు. మీరు క్షీరోత్పత్తిలో, ఉపాధి కల్పనలో ప్రపంచంలోనే ముందున్నామని ప్రకటించుకుంటారు. "నిజం ఇది" అని చెప్పిన జర్నలిస్టును అరెస్టుచేసి, జైల్లో పెడతారు.
Courtesy Instagram.
Thursday, September 13, 2018
ఈ మధ్య విన్న కొన్ని విషయాలు
ఒకానొక ఒక ట్రైనులో ఒకతను హఠాత్తుగా నాతో... "దేవుడున్నాడంటారా?" అనడిగాడు.
I was like... really? That's why you are taking the train journey? To figure out the answer to your question?
ఇలాంటిదే ప్రశ్న నాకు ఒక టాక్సీ డ్రైవర్ నుంచి ఎదురైంది. Why don't you believe in God? (ఇందులో మాత్రం తప్పు నాదికూడా ఉంది)
నేపధ్యం: కారు ఒకానొక హైవేమీద 230KMPH లో వెళుతోంది. కుర్రాడు మొరొక్కో నుంచి.
నేపధ్యం: కారు ఒకానొక హైవేమీద 230KMPH లో వెళుతోంది. కుర్రాడు మొరొక్కో నుంచి.
నేనేమో.... కారు 230 కొడుతున్నప్పుడు మీతో అది నేను డిస్కస్ చెయ్యను మాస్టారు... కారు ఆగాక కావాలంటే నా రూం కొచ్చెయ్యండి. అక్కడ కుర్చీ.. తాడు... అన్నీ ఉన్నయ్. మీసైజుకు సరిపోతాయ్ కూడా! కూర్చొని ఖుల్లంఖుల్ల బాతే కరేంగె.
ఒంకొకాయన... స్టేషను సమీపిస్తుండగా.... ఇప్పుడు మన ష్టేషనుకు రెండిస్తారా, లేక నాలుగా? (రెండో ప్లాట్ఫారమా లేక నాలుగా?)
నేనేమో.. ఇలాంటి సృష్టిరహస్యాల గురించి తాత్వికచర్చలకు దిగి మనమెందుకండీ బుర్రపాడుచేసుకోవడం? సూపర్ కంప్యూటర్లుండగా? I mean common... why does it even matter? That guy was not even getting down at that station!
ఇంకొకాయన... "ఆ... శ్రీ... ఇక్కడ గొడావరి క్రాసింగుంది... కుంచెం లేటవుతుంది. ఒక ఇరవై నిమిషాలు లేటవుతుంది. వచ్చేస్తా."
ఈయన మాత్రం నాకు పిచ్చపిచ్చగా నచ్చాడు. భార్య "శ్రీ"గారు ఈయన రాకకోసం ఇంటివద్ద విరహతాపంతో రగిలిపోతూఉండగా, మధ్యలో ఏ దిక్కుమాలిన దేవుడో ఓర్చుకోలేక కలిగించిన అడ్డంకికి, softcore-క్షమాపణలర్పించుకోవడమే కాకుండా, వచ్చేస్తానని confirmationకూడా ఇచ్చేసిన ఇలాంటివాళ్ళు నేడుగానీ రాజకీయాల్లో ఉంటేనా నాసామిరంగా!
ఈయన మాత్రం నాకు పిచ్చపిచ్చగా నచ్చాడు. భార్య "శ్రీ"గారు ఈయన రాకకోసం ఇంటివద్ద విరహతాపంతో రగిలిపోతూఉండగా, మధ్యలో ఏ దిక్కుమాలిన దేవుడో ఓర్చుకోలేక కలిగించిన అడ్డంకికి, softcore-క్షమాపణలర్పించుకోవడమే కాకుండా, వచ్చేస్తానని confirmationకూడా ఇచ్చేసిన ఇలాంటివాళ్ళు నేడుగానీ రాజకీయాల్లో ఉంటేనా నాసామిరంగా!
Friday, August 24, 2018
క్విట్టెడువారు ధన్యులు, వారు మరింత నష్టపడకుందురు
1915లో ఈటలీ మిత్రరాజ్యాలకు వ్యతిరేకంగా మొదటి ప్రపంచ యుధ్ధంలోకి దిగింది. ఇటలీ ఉద్దేశ్యమల్లా ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యం "దురాక్రమించిన" Trento మరియు Trieste భూభాగాలను "విముక్తం" చెయ్యడమే. ఇటాలియన్ రాజకీయ నాయకులు యువతలో దేశభక్తినినింపే ఉపన్యాసాలిచ్చారు. పురాతన రోమన్ సామ్రాజ్య వైభవాన్ని పునర్నిర్మించే ఉద్దేశ్యంతో యువత "Trento, Trieste రాజ్యాలకోసం ప్రాణలర్పిస్తాం"అంటూ గెలుపనేది తమకు నల్లేరుమీద నడకేనన్న దృఢనమ్మకంతో యుద్ధానికి బయలుదేరింది.
ఫలితం మరోలా పరిణమించింది. Isonzo నది వద్ద వారితో తలపడ్డ అస్ట్రోహంగేరియన్ దళలు ఏర్పరుచుకున్న శక్తివంతమైన రక్షణవ్యవస్థలమీదకి మిడుతలదండులా దూకిన ఇటాలియన్ సైనికులు తీవ్రనష్టాలను చవిచూశారు. రెండేళ్లపాటు జరిగిన జరిగిన మూడు యుద్ధాలలో ఇటలీ వరుసగా పదిహేను, నలభై, అరవై వేల సైన్యాలను యుధ్ధభూమికి అర్పించుకొని వెనుదిరిగింది. ఇటలియన్ సైనికులు అప్పటికీ వెనుదిరగక మరిన్ని ఘోర యుద్ధాలు సాగించారు. వీళ్ళతో విసిగిపోయిన ఆస్ట్రోహంగేరియన్ రాజ్యం జరిగిన పదకొండో యుద్ధంలో రక్షణాత్మక వైఖరివీడి ఇటాలియన్ దళాలమీద దాడిచెయ్యడం మొదలుపెట్టింది. Caporreto వద్ద జరిగిన ఆ యుధ్ధంలో ఇటాలియన్ దళాలు వెనిస్ నగర పొలిమేరల్లోకి తరిమివేయబడ్డాయి. యుధ్ధం ముగిసాక చూసుకొంటే మొత్తం 7లక్షలమంది ఇటాలియన్ సైనికులు యుద్ధంలో మృతిచెందినట్లూ, పదిలక్షలమంది గాయపడినట్లూ తెలియవచ్చింది. చివరికి ఈ యుద్ధం బెనిటో ముస్సోలినీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. "పోగొట్టుకున్న రాజ్యాలు తిరిగి కైవస పరుచుకోవాలంటే దానికి అది ఈ కుళ్ళిపోయిన వ్యవస్థవల్లకాదు. ముస్సోలినీ వంటి మొనగాడైతేనే సరి" అని ప్రజలే అదికారాన్ని ఫాసిస్టులకు అప్పజెప్పారు.
ఎందుకిలా జరిగింది అంటే కారణం ఇది: తమ తప్పును ఒప్పుకొని, లెంపలు వేసుకొని, ప్రక్కకు తప్పుకోలేకపోవడం. ఇటాలియనులు మొదటి యుద్ధం తరువాత లెంపలువేసుకొని, శాంతిసందేశం పంపించుంటే ఆస్ట్రియనులు ఎగిరిగంతేసి ఒప్పుకొనుండే వాళ్ళు. ఎందుకంటే ఆసమయాన ఆస్ట్రియా ఏకంగా రష్యాతో నిండుగా యుద్ధాల్లో మునిగుంది. ఇటలియన్ రాజకీయ నాయకులు లేనిపోని గొప్పలకు పోయి "మరణించిన సైనికుల కుటుంబసభ్యులకు ఏం సమాధానం చెబుతాం?", "మన సైనికుల ప్రాణత్యాగాలు వృధాపోనీం" అంటూ రొడ్డకొట్టుడు భావోద్వేగాలతో మరింతమంది సైనికులు మరణించడానికి కారణమయ్యారు.
ఇలాంటిదే ఇంకో సంఘటన. 1919లో స్కాంట్లండ్ ప్రభుత్వం ఒక పార్లమెంటు భవనాన్ని నిర్మించాలనుకుంది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఈ మొత్తం భవననిర్మాణ కార్యక్రమం రెండేళ్లకు పూర్తవుతుంది మరియు నలభై మిలియన్ల పౌండ్ల ఖర్చవుతుంది. నిజానికి ఆ భవనం నిర్మించడానికి ఐదేళ్ళు పట్టింది మరియు నాలుగు వందల మిలియన్ల ఖర్చయ్యింది!!! కారణం? మళ్ళీ అదే! కాంట్రాక్టర్లు ఏదో ఒక సమస్యతో, మరింత డబ్బును మంజూరు చెయ్యమని ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పుడల్లా ప్రభుత్వం ఇలా ఆలోచించింది "ఇప్పుడు మనం భవన నిర్మాణం ఆపేస్తే, ఇప్పటిదాకా పెట్టిన ఖర్చంతా వృధా అయిపోతుంది. ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకుంటాం?". ఇది సరిగ్గా ఇటాలియనుల "మన సైనికుల ప్రాణాలు వృధా కాబోవు"కి మారురూపు. ఇప్పుడు వెనుదిరిగితే ఇప్పటిదాకా చేస్తూ వస్తున్నదని పొరబాటని ఒప్పుకోవాలి. అందుకెవరూ సిధ్ధంగా లేకపోవడమే ఈ భారీ నష్టాలకు కారణం.
ఈ ధోరణి కేవలం రాజకీయ, ఆర్ధిక రంగాల్లోనే కాదు. మతంలోకూడా చూడవద్దు. ఏనాడైతే గెలీలియో చెప్పినది ఋజువయ్యిందో, ఆనాడే బైబిల్లో ఉన్నది సత్యదూరమన్నది ఋజువైపోయింది. కానీ అలాగని ఒప్పుకొని లెంపలేసుకోవడమంటే, ఇప్పటిదాకా, తను, తన తల్లిదండ్రులూ, తన పూర్వీకులూ అనుసరిస్తూ వస్తుందంతా, చేస్తూ వస్తున్నదంతా పనికిమాలినది అని ఒప్పుకోవాలి. ఆ నిజాయితీ మనక్కుదరదు. కాబట్టి తప్పుడు దారిలోనే ముందుకెళ్ళి మరింత కూరుకుపోతాం! దీనినే sunk-cost fallacy అంటారు.
1986, 28 జనవరి. నాసావారు Challenger space shuttleని Cape Canaveralనుండి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటికే ఆ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది. challengerలో అంతరిక్షంలోకి వెళ్లేవాళ్లలో ఒక స్కూల్ టీచరుకూడా ఉండడంతో ప్రజలందరూ ఆ ప్రయోగంకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రయోగం జరిగే ముందురోజు రాత్రి నాసావాళ్ళు, వారి రాకెట్ మోటర్లు తయారుచేసిన కాంట్రాక్టరు Morton Thiokol సంస్థ ప్రతినిధులతో ప్రయోగం విషయంలో ముందుకెళ్ళడమా వద్దా అని చర్చలు జరిపారు. Morton Thiokolలో సీనియర్ అయిన Allan McDonald అనే ఆయన "అబ్బాయిలూ... రాకెట్ మోటర్లకు రక్షణగా వాడుతున్న రబ్బరు O-rings ని మనం ఇప్పటిదాకా 53 డిగ్రీల ఫారణైట్ వద్ద పరీక్షించాము. ఈనాటి ఉష్ణోగ్రత 18 డిగ్రీల ఫారణైటున్నది. అంత తక్కువ ఉష్ణొగ్రతావద్ద అవి పనిచేస్తాయని నాకు నమ్మకంలేదు. మీరు మీ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసుకోండి" అని చెప్పాడు. నాసా వాళ్ళు "మీకు నమ్మకం ఉండడమూ లేకపోవడమూకాదు. అవి పనిచెయ్యవని మీరనుకుంటే అవి ఎందుకు పనిచెయ్యవో శాస్త్రీయంగా ఋజువుచెయ్యండి. లేకుంటే నోర్ముసుకొని ప్రయోగానికి అంగీకారం తెలపండి" అని సమాధానం పంపించారట. ఋజువుచెయ్యలేని Mortonవాళ్ళు "సరే ఛావండి" అని రిప్లై పంపించారట. చివరికి ఆ ప్రయోగం విఫలమయ్యి, అందులో ప్రయాణిస్తున్నవారందరూ మరణించారు. తరువాత జరిగిన పరిశోధనలో ప్రయోగ వైఫల్యానికి కారణం ఇలా తెలియవచ్చిందట: తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా O-rings పనిచెయ్యకపోవడం.
Think Like a Freak రచయితలు ఈ విషయంలో ఒక ప్రయోగం చేశారు. వాళ్ళు తమ బ్లాగు పాఠకులనుంచి కొన్ని ప్రశ్నలను ఆహ్వానించి. వాటికి randomగా "అవును", "కాదు" అని సమాధానాలిచ్చారట (ఒక software dice సహాయంతో). వాళ్లకు వచ్చిన ప్రశ్నలు క్రింది విధంగా ఉన్నాయ్:
నేను ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలా?
నేను స్కూలుకి తిరిగివెళ్ళాలా?
నేను నా boy friend/girl friend కి రాంరాం చెప్పలా?
నేను బైపాస్ చేయించుకోవాలా లేక ఆంజియోప్లాస్టీ చేయించుకోవాలా?
నేను క్రైస్తవం పుచ్చుకోవాలా?
నేను సైన్యంనుండి బయటపడాలా?
చివరికి తేలిన విషయం క్లుప్తంగా ఏమిటంటే క్విట్టకపోవడంవల్ల ఊడిపడిన మహోపయోగం ఏమీలేదట. ఇలాంటి life and death questions విషయంలో మనం బొమ్మాబొరుసూ వేసి నిర్ణయాలు తీసుకున్నా ప్రపంచం ఏమీ బ్రద్దలవదట :-)
Friday, August 10, 2018
ఫ్రెంచి రివల్యూషనూ, Mississipi bubble
1717లో మిస్సిస్సిపి అనే ఒక ఫ్రెంచి కంపెనీ, మిస్సిస్సిపి లోయను ఆక్రమించుకొని అందులో New Orleans నిర్మిస్తాము అని చెప్పి, అందుకుగానూ షేర్లను ఫ్రెంచి స్టాకు ఎక్స్చేంజిలో అమ్మడం మొదలుపెట్టింది. కంపెనీ డైరెక్టరు John Law గారికి పదిహేనవ లూయీ గారితో మంచి సంబంధాలుండేవట. అయన అప్పటికే ఫ్రెంచి సెంట్రల్ బ్యాంక్‌కు గవర్నర్ జనరల్ అయ్యుండగా, లూయీ గారు ఆయన్ను దేశ ఆర్ధికమంత్రిగా కూడా నియమించి పారేశారుట. 1717లో వాళ్ళు చెప్పిన ఆ మిస్సిస్సిపిలోయలో బురదనేలలు, మొసళ్ళు తప్ప ఇంకేమీ ఉండేవి కాదుట. డైరక్టరూ, వారి ప్రచార సిబ్బందీ మాత్రం అక్కడ స్వర్గమే ఉందన్నటుగా కటింగులిచ్చారుట. ఉన్నదేమో స్వర్గము, అమ్ముతున్నదేమో ఆర్ధికమంత్రి ఇంకేం! డబ్బున్న ప్రతొక్కడూ వారు షేర్లు కొనడం మొదలెట్టారుట. 1717లో షేరు విలువ 500 లీవర్లుండగా అదికాస్తా ఆగస్టూ 1 1719 నాటికి 2,750 లీవర్లై కూచుందట. ఆగస్టు 30 నాటికి అది 4,100 లీవర్లుకాగా, సెప్టెంబరు 4 నాటికి అది 5,000 లీవర్లట. డిసెంబరు 2 నాటికి అది 10,000 లీవర్లవడంతో జనార్లు వెర్రెత్తినట్లు ఉన్నాస్తులు తెగనమ్ముకొని మరీ కంపెనీ షేర్లు కొనడం మొదలుపెట్టారట.
కొంతమందికి మాత్రం అనుమానమొచ్చిందట. షేర్లు మరీ ఇంత ఉబిద్రమైన ధరలకు ఎలా అమ్ముతున్నారు? ఒకవేళ మునిగిపోతే పరిస్థితేంగాను? అన్న అనుమానంతో వాళ్ళు తమ షేర్లను అమ్మడం మొదలుపెట్టారట. మార్కెట్లో ఎక్కువ షేర్లు సప్లయ్ లో ఉండడంతో ధర సాధారణంగానే తగ్గుమొహం పట్టింది. దాన్నిచూసి మరికొందరు అమ్ముకోవడంతో షేరు విలువ పతనం కావడం ప్రారంభమయ్యిందిట. కంగారెత్తిన John Law గారు డిమాండును మళ్ళీ పెంచడంకోసంగానూ, సాక్షాత్తూ సెంట్రల్ బ్యాంకుచేత షేర్లుకొనిపించడం మొదలుపెట్టారట. త్వరలోనే దానిదగ్గర డబ్బైపోవడంతో, ఆర్ధికమంత్రికూడా అయిన ఆపుణ్యాత్ముడు ఎక్కువ లీవర్లను ముద్రించమని ఆర్ధికశాఖకు ఉత్తర్వులిచ్చాడట. ఈ దెబ్బతో సహజంగానే మొత్తం ఫ్రెంచి ఆర్ధిక వ్యవస్థ ఈ బుడగలోకి వచ్చికూర్చుంది. కొద్ది రోజుల్లోనే షేరు విలువ 10,000 నుండి 1,000 లీవర్లకు చేరుకుని, తర్వాతపూర్తిగా చిత్తుకాగితం స్థాయికి చేరుకుందట. సెంట్రల్ బ్యాకు, రాజుగారి ఖజానాల్లో ఈ చిత్తుకాగితాలు తప్ప ఇంకేమో లేకపోవడంతో,రాజుగారు స్వయంగా ఎక్కువవడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సివచ్చిందట. మరి ఆప్పులు తీరడానికి డబ్బులెవరిస్తారు? జనాలేకదా! కాబట్టి జనాలమీద పన్నులు పెంచారు. అసలే "నిండామునిగాము మొర్రో!!" అంటుంటే ఈ పన్నుల తాటికాయేమిటన్నట్లు, తెలివైనవారు, తెలిసినవారు ముందే అమ్ముకోగా, మిగిలిన షేరుహోల్డర్లు మూకుమ్మడిగా ఆత్మహత్య జేసుకున్నారట.
ఈదెబ్బతో ఫ్రెంచి ప్రభువుల పరపతి తుడిచిపెట్టుకుపోవడంతో, వారికి ఏమాత్రం అప్పులు కావాలన్నా విదేశీ వడ్డీ వ్యాపారులు ఎక్కువ రేట్లు అడిగేవారట. ఇంగ్లీషువాళ్ళకుమాత్రం చవగ్గా అప్పులుదొరికేవట. అలా చవగ్గ వచ్చిన అప్పులతో ఇంగ్లీషువాళ్ళు సైన్యమూ, ఆయుధ సంపత్తీ సమకూర్చుకొని ఫ్రెంచి వలసలపై దాడులుచేసేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యమే 350,000 ఉండేదట. అది మొత్తం బ్రిటన్ సైన్యంకన్నా ఎక్కువట! ఆ John Law అనే ఒక్కడు చేసిన పనికి జనాలు చావడమేకాకుండా, ఫ్రెంచి సామ్రాజ్యమే నాశనమయ్యిందట.
లూయీ పదిహేనుగారి మనవడు పదహారవ లూయీ గారి హయాంలోకి వచ్చేసరికి ఆయన సంవత్సర బడ్జెట్టులో సగం అప్పులోళ్ళవడ్డీలకే సరిపోయేదిట. "ఏమిచేతురా దేవుడా!!" అంటూ ఆయన నూటయాభై ఏళ్ళుగా సమావేశంకాని Estates Generalను సమావేశపరిచాడు. తరువాతది చరిత్ర. టెన్నిస్ కోర్టు శపధమూ, బాస్టిల్ కోట పతనమూ, రక్తపాతమూ, భయం రాజ్యమేలడమూ, నెపోలియనూ. నెపోలియన్ కూడా ఇంగ్లీషు వర్తకులని "కిరాణావ్యాపారులు" అని ఎగతాళి చేసేవాడుట. చివరికా కిరాణవ్యాపారులే నెపోలియన్ తాటతీశారు.
కొంతమందికి మాత్రం అనుమానమొచ్చిందట. షేర్లు మరీ ఇంత ఉబిద్రమైన ధరలకు ఎలా అమ్ముతున్నారు? ఒకవేళ మునిగిపోతే పరిస్థితేంగాను? అన్న అనుమానంతో వాళ్ళు తమ షేర్లను అమ్మడం మొదలుపెట్టారట. మార్కెట్లో ఎక్కువ షేర్లు సప్లయ్ లో ఉండడంతో ధర సాధారణంగానే తగ్గుమొహం పట్టింది. దాన్నిచూసి మరికొందరు అమ్ముకోవడంతో షేరు విలువ పతనం కావడం ప్రారంభమయ్యిందిట. కంగారెత్తిన John Law గారు డిమాండును మళ్ళీ పెంచడంకోసంగానూ, సాక్షాత్తూ సెంట్రల్ బ్యాంకుచేత షేర్లుకొనిపించడం మొదలుపెట్టారట. త్వరలోనే దానిదగ్గర డబ్బైపోవడంతో, ఆర్ధికమంత్రికూడా అయిన ఆపుణ్యాత్ముడు ఎక్కువ లీవర్లను ముద్రించమని ఆర్ధికశాఖకు ఉత్తర్వులిచ్చాడట. ఈ దెబ్బతో సహజంగానే మొత్తం ఫ్రెంచి ఆర్ధిక వ్యవస్థ ఈ బుడగలోకి వచ్చికూర్చుంది. కొద్ది రోజుల్లోనే షేరు విలువ 10,000 నుండి 1,000 లీవర్లకు చేరుకుని, తర్వాతపూర్తిగా చిత్తుకాగితం స్థాయికి చేరుకుందట. సెంట్రల్ బ్యాకు, రాజుగారి ఖజానాల్లో ఈ చిత్తుకాగితాలు తప్ప ఇంకేమో లేకపోవడంతో,రాజుగారు స్వయంగా ఎక్కువవడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సివచ్చిందట. మరి ఆప్పులు తీరడానికి డబ్బులెవరిస్తారు? జనాలేకదా! కాబట్టి జనాలమీద పన్నులు పెంచారు. అసలే "నిండామునిగాము మొర్రో!!" అంటుంటే ఈ పన్నుల తాటికాయేమిటన్నట్లు, తెలివైనవారు, తెలిసినవారు ముందే అమ్ముకోగా, మిగిలిన షేరుహోల్డర్లు మూకుమ్మడిగా ఆత్మహత్య జేసుకున్నారట.
ఈదెబ్బతో ఫ్రెంచి ప్రభువుల పరపతి తుడిచిపెట్టుకుపోవడంతో, వారికి ఏమాత్రం అప్పులు కావాలన్నా విదేశీ వడ్డీ వ్యాపారులు ఎక్కువ రేట్లు అడిగేవారట. ఇంగ్లీషువాళ్ళకుమాత్రం చవగ్గా అప్పులుదొరికేవట. అలా చవగ్గ వచ్చిన అప్పులతో ఇంగ్లీషువాళ్ళు సైన్యమూ, ఆయుధ సంపత్తీ సమకూర్చుకొని ఫ్రెంచి వలసలపై దాడులుచేసేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యమే 350,000 ఉండేదట. అది మొత్తం బ్రిటన్ సైన్యంకన్నా ఎక్కువట! ఆ John Law అనే ఒక్కడు చేసిన పనికి జనాలు చావడమేకాకుండా, ఫ్రెంచి సామ్రాజ్యమే నాశనమయ్యిందట.
లూయీ పదిహేనుగారి మనవడు పదహారవ లూయీ గారి హయాంలోకి వచ్చేసరికి ఆయన సంవత్సర బడ్జెట్టులో సగం అప్పులోళ్ళవడ్డీలకే సరిపోయేదిట. "ఏమిచేతురా దేవుడా!!" అంటూ ఆయన నూటయాభై ఏళ్ళుగా సమావేశంకాని Estates Generalను సమావేశపరిచాడు. తరువాతది చరిత్ర. టెన్నిస్ కోర్టు శపధమూ, బాస్టిల్ కోట పతనమూ, రక్తపాతమూ, భయం రాజ్యమేలడమూ, నెపోలియనూ. నెపోలియన్ కూడా ఇంగ్లీషు వర్తకులని "కిరాణావ్యాపారులు" అని ఎగతాళి చేసేవాడుట. చివరికా కిరాణవ్యాపారులే నెపోలియన్ తాటతీశారు.
Wednesday, August 8, 2018
మరణం
మనిషిని అత్యంతకాలంపాటు విసిగించిన ఒకే ఒక్క సమస్య మరణం. పురాతన సంస్కృతులు మరణం జీవితంలో ఒక అవిభాజ్యమైన భాగమని, అసలు మరణం లేకుంటే జీవితానికి అర్ధంలేదని భావించాయి. మనషుల జీవితాల సంగతేమోకానీ, "ఈ స్వర్గ నరకాల కబుర్లన్నీ నమ్మం" మనుషులు నిర్ణయించేసుకుంటే మతాలన్నీ వాట అర్ధాన్నీ, మతాధికారులందరూ వారి అధికారాల్నీ కోల్పోతారు. అందుకే ఒకప్పుడు గొప్పగొప్ప తాత్వికవేత్తలు, మేధావులూ మరణమ్యొక్క అవశ్యకతను నొక్కిచెప్పేపనిలో మునిగితేలారు. సాహిత్యంలో 20వ దశకంలో ఈ తీరులో మార్పు కనిపించింది. ఉదారవాదులూ, సామ్యవాదులూ, స్త్రీవాదులూ ఇతరత్రావాదులూ స్వర్గనరకాల్ని పూర్తిగా విస్మరించేశారు. కావాలంటే ఒక కమ్యూనిస్టో, ఫెమినిష్టో చనిపోయాక ఏమౌతాడోనని వాళ్లవాళ్ల సాహిత్యాల్లో వెతికి కనుక్కొనే ప్రయత్నం చెయ్యండి చూద్దాం! ఇప్పటికీ మరణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేది జాతీయవాదులుమాత్రమే! దేశంకోసం చస్తే ఏదో ఒరిగిపడుతుందని వీరు నమ్మబలుకుతారు. అవసర సమయంలో దేశంకోసం మరణిస్తే, ప్రజల ఉమ్మడి మనసుల్లో కలకాలం జీవిస్తారని వీరు చెప్పేకబుర్లను ఎలా అర్ధంచేసుకోవాలో చాలామందికి అర్ధంకాదు.
సైన్సుదగ్గరికొస్తే, మరణం అనేది కేవలం ఒక టెక్నికల్ సమస్య. ఉదాహరణకి King Richard - The Lionheart గారి ఉదాహరణే తీసుకోండి. 1109 వ సంవత్సరంలో King Richard గారి ఎడమభుజంలోకి ఒక బల్లెం దూసుకుపోయింది. ఇలాంటి సంఘటనే నేడు జరిగితే, మన పేపర్లవారు King Richard గారు "స్వల్పగాయాలకు" గురయ్యారు అని రాసుండేవారు. కానీ ఆ సంఘటన జరిగింది 1109లో. అప్పట్లో దానికి ఉన్న ఒకేఒకమందు గాయమైన భాగం కుళ్ళిపోయి, అది మిగతా శరీరభాగాలకు పాకేలోపల నరికెయ్యడమే. భుజాన్ని నరకలేంకదాని, ఏంచెయ్యాలో తోచక ఆగాయాన్ని ఆలా వదిలేశారు. ఫలితంగా Lionheart గారు రెండువారాలు నరకయాతన అనుభవించి మరణించారు. ఆయనకనేకాదు. ఒకప్పుడు యూరప్లో చిన్నగాయాలైనా కూడా ఎందుకైనా మంచిదిలే అని మొత్తం చేతినో, కాలునో నరికేసేవారు. దీనిగ్గానూ సైన్యంలో వడ్రంగుల, లోహకారుల సేవలు వాడుకొనేవాళ్ళు. అదికూడా ఎలాంటి మత్తుమందువాడకుండా ఈ శశ్త్రచికిత్సలుచేసేవారు. ప్రస్తుతంచూస్తే మన డాక్టర్లు Nanobots ద్వారా శరీరంలో కృత్రిమ రోగనిరోధకను పెంచడంగురించీ, కాన్సరును పోరాడడం గురించీ ఆలోచిస్తున్నారు.
అసలా మాటకొస్తే కాన్సరుది ఒక ప్రత్యేకమైన కధ. కాన్సర్ అనేది శరీరంలో పోగుపడిపోయిన genetic errors కారణంగా వస్తుంది. ఇలా genetic errors పోగుపడాలంటే, ముందా వ్యక్తి దీర్ఘకాలం జీవించి ఉండాలి. శిశుమరణాల రేటు ఎక్కువగా ఉండే ఒకప్పటికాలంలో మనిషి ఐదారేళ్ళు జీవించడం గగనం. అది దాటి బ్రతికినవారు మహా ఉంటే ఒక ముప్పైయేళ్ళు జీవించేవారు. ఇంక అదికూడా దాటి బ్రతికినవారు దాన్ని షష్టిపూర్తి లాంటి అరుదైన వేడుకలు చేసుకొనేందుకు జీవించి ఉండేవారు. అందుకే ఆరోజుల్లో "ఆరేడుమందిని కనిపారేస్తే, అందులో కొందరైనా చేతికందివస్తారుకదా!" అని ఆలోచించేవాళ్ళు. ఇందుకూ... ఆరోజుల్లో కాన్సరు వ్యాధి గురించి ఇంత తరచుగా ప్రచారం లభించంది! అందుకూ.. ఆవ్యాధిని ధనవంతుల రోగమనీ, రాచపుండు అని వ్యవహరించింది! అసలా మాటకొస్తే చరిత్రలో రికార్డైన మొదటి కాన్సరు పేషంటు మొదటి డేరియస్ గారి రెండవ భార్య, క్రీ. పూ. 550లో జన్మించిన అటొస్సా గారట. ఒకప్పుడ్ శిశుమరణాల రేటు ఎలాఉండేదో అర్ధమవ్వాలంటే మొదటి ఎడ్వర్డు రాజుగారి వ్యవహారాన్ని ఒకసారి పరిశీలించాలి. 1237-1307 సంవత్సరాల మధ్య ఇంగ్లండును పాలించిన రాజుగారు మొదటి ఎడ్వర్డు. దేశంలోనే అత్యంత అధునాతమైన వైధ్యవిధానాలు ఆయనకి అందుబాటులో ఉండేవి. అయినప్పటికే ఆయనకు పుట్టిన పదహారు మంది సంతానంలో అందరూ చనిపోయి ఒక్కగానొక్క కొడుకు రెండా ఏడ్వర్డుగారు మాత్రం పాలనాధికారాలు పొందడానికి మిగిలున్నారట. పుట్టిన పదహారు మందిలో యవ్వనంలోకి అడుగుపెట్టింది 6గురు అంటా -అంటే 65 శాతం. నలభయ్యిల్లోకి జీవించి ఉండింది కేవలం ముగ్గురంట -అంటే 18 శాతం. ఇది రాజుల, రాజకుమారుల పరిస్థితి. ఇక సామాన్యులగురించి మనం సులభంగానే ఆలోచించవచ్చు. ఒక దిక్కుమాలిన ప్లేగు వస్తే యూరప్లో 2/3వ వంతు జనాలు హరీమన్నారు. ఒకప్పుడు ఇలాంటివి వస్తే దేవుణ్ణీ ప్రార్ధించడం తప్ప వేరే గత్యంతరం ఉండేదికాదు. మొన్నటికి మొన్న ఆఫ్రికాలో ఎబోలా వస్తే, ఆయా ప్రభుత్వాల, సంస్థల అలసత్వం అనుకున్నామేతప్ప, దేవుడిమీద భారం వేసి, నెత్తినచేతులు వేసుక్కూచోలేదు.
గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నది వట్టి పనికిమాలిన మాట. ఒకప్పుడు మనుషులు ఎందుకు చచ్చేవారోకూడా తెలిసేది కాదు. లోబోపీతో చనిపోయినా "సునాయాస మరణం" అనీ, "మంచి చావు" అనీ, "మందూమాకూ లేని రోగమని" చెప్పుకొని జనాలు చెవులు కొరుక్కొనేవారు. ఇప్పుడు కనీసం మనకు పేర్లైనా తెలుస్తున్నాయ్. చాలా వాటిని నివారించగలుగుతున్నాం. 2050 నాటికి మీరు జీవించి ఉండి, చేతిలో నిండుగా డబ్బుంటే మీరు మీ మరణాన్ని ఒక పదేళ్లపాటు వాయుదా వేసుకోవచ్చు. ఆపదేళ్ల తరువాత వచ్చే టెక్నాలజీతో ఇంకోపదేళ్ళు వాయిదా వేసుకోవచ్చు. ఏమో ఎవరికి తెలుసు! ఒకప్పుడు ధనవంతుకు మాత్రమే అందుబాటులో ఉన్న కాగితం, కంప్యూటరుల్లాగనే ఈ మరణాన్ని వాయిదావేసుకొనే టెక్నాలజీకూడా రాన్రాను బాగా చవకయిపోయి సామాన్య జనాలక్కూడా అందుబాటులోకి రావచ్చు. అప్పుడుకూడా ఈ చర్చివాళ్ళు, గడ్డాలవాళూ, పిలకలవాళ్ళు చెప్పేమాటలనెవరైనా వినేవాళ్ళుంటారా? ఆవిధంగా పదిహేను వందలయేళ్ళుగా (అతి కుర్రమతమైన ఇస్లాం దాదాపు పదిహేనువందలయేళ్లక్రితం పుట్టింది) మతాలు మరణానంతరం జీవించబోయే రెండవజీవితం గురించి సొల్లుకబుర్లు చెప్పి మనిషుల్ని వెధవల్ని చేస్తుండగా, సైన్సు కేవలం నాలుగొందల ఎలాంటి వాగడంబరం, చడీచప్పుడూ లేకుండా యేళ్లలో మనుషుల సరాసరి జీవన ప్రమాణాన్ని రెట్టింపు (కొండుకచో కొన్నిదేశాల్లో మూడింతలు) చేసింది. "అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను" పద్యం మన ప్రవక్తలకూ, దేవుళ్ళకూ, దేవునికుమారులకూ సరిగ్గా సరిపోతుంది.
Wednesday, August 1, 2018
Sapiens: గోధుమ మొక్క మానవులను మచ్చిక చేసుకున్న విధంబెట్టిదనిన.
ఒకప్పుడు గోధుమ మొక్కలు నానారకాల చెత్తమొక్కల మధ్య పెరిగేవి. ఏదో మధ్యప్రాచ్యంలో కొన్నిచోట్ల తప్ప ఇంకెక్కడా మచ్చుకైనా కనిపించేవికాదు. అలాంటిది ఈనాడు గోధుమసాగు ఏకంగా 2,52,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సాగుతోంది. ఈ వైశాల్యం బ్రిటన్ వైశాల్యానికి పది రెట్లు! ఒకప్పుడు చక్కగా వేటాడి, ఇంటికొచ్చి వినోదించిన ఆదిమ మానవులు, ఈ గోధుమ మోజులోపడ్డాక దానికి ఎక్కువ సమయం వెచ్చించడం మొదలుపెట్టారు. గోధుమ మొక్కలుంగారికి రాళ్ళంటే అసహ్యం. మనుషులు తమ వీపులు విరగ్గొట్టుకొని (మనుషుల వెన్నుపూసలు చెట్లెక్కడానికీ, పరిగెత్తడానికీ ఉద్దేశ్యించబడినవేగానీ, రాళ్ళుకొట్టడానికీ, బకెట్లతో నీళ్లుమొయ్యడానికీ ఉద్దేశ్యించినవి కావుట) నేలను చదునుచేసి, మొక్కలుంగారిని పెంచడానికి తంటాలుపడ్డారు. గోధుమమొక్కలుంగారికి ఇతర మొక్కల పొడ గిట్టదు. వారు ఇతరులతో తమ నీళ్లను, సారఖనిజాలనూ పంచుకోవడానికి ఇష్టపడరు. వాటిని ప్రత్యేకంగా పొలల్లో పెంచడానికి మనుషులు తయార్! మొక్కలుంగారికి జబ్బుచేస్తే, వాటికి పురుగు ఆశిస్తే మనుషులే కిందామీదా ఐపోయారు. మొక్కలుంగారికి దాహం వేస్తే బక్కెట్లతో నీళ్ళు పోశారు. మొక్కలుంగారిని మిడతలనుంచీ, కుందేళ్ళనుంచే రక్షించారు. అలా మొక్కలుంగారిని కంటికి రెప్పలా కాపాడుకోవడంకోసం ఆఖరికి పొలాలప్రక్కనే ఇళ్ళుకట్టుకొని నివశించడంకూడా మొదలుపెట్టారు (మనం దాన్నేదో డొమెస్టికేటు చేసుకున్నాం అని గొప్పలు చెప్పుకుంటాం. అదే మనల్ను డొమెస్టికేటు చేసుకొని. దానికి నచ్చినట్లు మనల్ని ఆడించింది). మొక్కలుంగారికి ఆకలివేస్తే పశువుల పెంటను ఎరువుగా వేశారు. ఒకప్పుడు దాని పొడ కూడ సోకని నేలల్లో, నేడు వందల ఎకరాల్లో అతి ముద్దుగా చూసుకుంటున్నారు.
ఇంతచేసి గోధుమ గింజలు అంత గొప్పవా? ఒకప్పుడు మనిషి అన్నిరకాల ఆహారాల్నీ తినేవాడు. వాటన్నింటితో పోల్చినప్పుడు అంత గొప్ప ప్రోటిన్లనీ, విటమిన్లనీ గోధుమలు ఇవ్వవు. అవి నాసిరకం ఆహారం. గింజలు తినడం మనుషులకు కొత్త విషయం. గోధుమలు తినడంవల్ల పళ్ళు, చిగుళ్ళు త్వరగా పాడయ్యేవి. మరి గోధుమ మనుషులకు ఏమిచ్చింది? ఆర్ధిక స్థిరత్వం? లేదు. అన్ని మొక్కలమీద ఆధారపడడం మానేసి, ఈ ఒక్కదానిమీదే ఆధారపడడం వల్ల, ఎప్పుడైనా వర్షాలు కురవక గోధుమలు పండకపోతే, రైతులు మూకుమ్మడిగా అత్మహత్యలు చేసుకొనేవాళ్ళు. హింసకు వ్యతిరేకంగా రక్షణ? ఏమాత్రంకూడా కాదు. ఒకప్పుడు మనుషులు ద్రిమ్మరులు. పొలం అనే ఒక స్తిరాస్థి ఏర్పడ్డంవల్ల తమ తండాలను రక్తమోడైనా రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఎందుకు గోధుమల మోహంలో మనుషులు మునిగితేలారు?
గోధుమలు నాసి రకం ఆహారమైతే అయ్యుండొచ్చుగాక. తక్కువ ఖర్చుతో ఎక్కువమంది కడుపు నిండాలంటే గోధుమలేగతి. ఒకజాతి అంతరించిపోకుండా ఉండటం అంటే ఆజాతి DNA ఉనికిలో ఉండటం. ఎలాగైతే ఒక కంపెనీ తన బ్యాంకుఖాతాలోని డబ్బుగురించేగానీ, తన ఉద్యోగుల ఆనందాన్నిగురించి ఆలోచించదో. అలాగే తొలినాటి నాగరికతలు ఆకలిచావులను దూరంగా ఉంచాలంటే గోధుమలే ఆయా నాగరికతలకు శరణ్యం. వాటి ప్రధాన ధ్యేయం మనుషులను సుఖంగా, పుష్టిగా ఉంచడంకాదు. వారి DNA అంతరించిపోకుండా చూసుకోవడమ్మాత్రమే! ఆవిధంగా 12,000 సంవత్సరాల క్రింతం మొదలైన వ్యవసాయ విప్లవ సూత్రం: నాసి రకం తిండైనా తిని, జాతిని వినాశనం నుంచి రక్షించుకో!
Friday, July 20, 2018
Third rate jounalism
ఈ మధ్య కేవలం రెండంటే రెండురోజులు తెనుగు వార్తాపత్రికలేమాత్రం జనాలనుధ్ధరిస్తున్నాయో చూద్దామని వాటిని ఫాలో అవడం మొదలుపెట్టాను. తెలుగు ప్రజల పవిత్ర సంస్కృతైన కులగజ్జి అలా ఉంచితే, పత్రికల వార్తలకు వీళ్ళు పెట్టే శీర్షికలు మాత్రం భలే క్యాచీగా కొండొకచో సజెస్టివ్గా ఉంటున్నాయి. ఉదాహరణకి "అక్కడ అలాంటివి కుదరవు" అనే టైటిల్తో ఒక పత్రిక ఏదో వార్త రాస్తుంది. ఇంకో పత్రిక "పట్టపగలు... నడిరోడ్డుమీద" అంటూ వార్త రాస్తుంది. మరొక చెత్తనా పత్రిక "ఆహీరోయిన్, ఆహీరో..." అని రాస్తుంది. ఇదిలా ఉంచితే... అదే వార్తని ఒకేరోజున వేర్వేరు titlesతో రాస్తారు. ఆహా!
తాము రాసిన చెత్తను మన చేత చదివించడానికై వీరెంత శ్రమిస్తున్నారోకదా!
పాఠకులకు వార్తలు అందజేయడానికి going the extra mile
policies అవలంభిస్తున్నందుగ్గానూ చాలా ముచ్చటేసింది.
వార్తాపత్రికలు చేస్తున్న ఈ హడావిడంతా వార్తలు అందించాలన్న తాపత్రయం కాదనీ, ఇదంతా page views కోసం, page clicks కోసం పడే కక్కుర్తి మాత్రమేననీ, వీళ్ళ కుతి అంతాకూడా add money గురించేననీ అర్ధమయ్యాక అసహ్యమేసింది. ఆఖరికి హత్యలనీ, రేపులనీ కూడా ఇలా క్యాచీగా నివేదించే జర్నలిజంపై రోత పుట్టింది. బాధితుల బాధపై డబ్బుచేసుకోవాలనే Schadenfreude journalismని main streamలో భాగంగా కలిగున్న తెలుగు sensibilities మీద చిరాకు, అసహ్యం లాంటివి కలిగాయ్.
అసలు తెలుగు పేపర్ ఓపెన్ చెయ్యగానే దాన్నిండా ప్రకటనలు, గ్రహ ఫలాలు, వాళ్ళ టీవీ ప్రోగ్రాముల గురించి డప్పుకొట్టుకోవడాలు, "matrimoney" యాడులు, చెత్త!! ఏదో ISKON templeను సందర్శించిన దరిద్రపు ఫీలింగ్ కలిగింది. దెబ్బతో add blocker తగిలించి మిగిలిన రెండు రోజులూ లాగించి. చివరకు bbc, rt.com లూ ఇంకా కొన్ని ప్రాంతీయ పత్రికలూ చదవడం మొదలు పెట్టాను. ఇంత లేకిగా వార్తలు రాసే, తమ సైట్లను ఇంత కక్కుర్తితో, లేకితనంతో నింపేసే పత్రికలు నాకు వాటిల్లో తగలలేదు. పోనీ వీళ్ళెమైనా గొప్ప వార్తలు రాస్తున్నారా అంటే అదీలేదు. ఈ కూపస్థ మండూకాలకు ఉభయరాష్ట్రాలు, వాటి రాజకీయాలు తప్ప మిగిలినవి అర్ధం కావు. మళ్ళీ అందులో ప్రతి పత్రికా ఏదో ఒక పార్టీ చంకలు నాకడం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలైతే సిగ్గులజ్జ విడిచి వాటివాటి కులనాయకులతో ఆరుబయట రమిస్తున్నాయ్. వాళ్లవాళ్ళ కులనాయకులు చేసే పుండాకోరు పనులను బహుచక్కగా దాచిపెడుతూ, వాళ్ళ యిమేజీలను పెంచడమే వీరి పవిత్ర కార్యం.
ఈ పత్రికలు, తెలుగు వాళ్ళ అభిరుచులు ఇంకో ఐదు దశాబ్దాలైనా ఇలాగే నేలబారుగా తగలడతాయ్!
Subscribe to:
Posts (Atom)













