Sunday, August 6, 2023

జై శ్రీరాం ముఠా

 ఈమధ్య సోషల్ మీడియాలో ఇదొకటి మొదలయ్యింది.ఎవరో ఏదో ఒక సీరియస్ విషయం పోస్ట్‌చేస్తారు. వెంఠనే ఒక యాభైమంది "జై శ్రీరాం" అని కామెంటుతారు. టాపిక్ ఏదైనా కావచ్చు. 


  • ఎక్కడో రికార్డింగు డాన్సులు జరిగాయి: జై శ్రీరాం.
  • వరదల్లో వందలమంది కొట్టుకుపోయారు: జై శ్రీరాం.
  • ఆక్సిడెంటులో ఒక పాతికమంది పోయారు: జై శ్రీరాం.
  • పడవ బోల్తాపడి ముప్పైమంది గల్లంతయ్యారు: జై శ్రీరాం.
  • రైలు పట్టాలు తప్పింద్: జై శ్రీరాం.


అసలు relevance అన్నమాటకి విలువుండదాండీ? ప్రతిదానికీ జై శ్రీరామేనా? ఇవ్వాళ నాకర్ధమయ్యిందేంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో రామకోటి రాసుకుంటున్నారు. అదికాస్తా ఇట్లా వికటిస్తోంది. రామకోటి పుస్తకాలు కొనడానికి లోభించి, వీళ్ళ బులాపాటం ఇక్కడ తీర్చుకుంటున్నారు.  ఆపాటికి పైన ఉదాహరించిన వాటన్నింటికీ రాముడే కారణం అని అర్ధం వస్తోంది.  ఇంకొన్నాళ్ళ తరువాత సుఖవిరేచనం తరువాతకూడా "జై శ్రీరాం" అంటారేమో!

ఇహ వీళ్ళని సమర్ధించే వాళ్ళున్నారు. వాళ్ళదింకోగోల. వాళ్ళమ్మ వాళ్ళనాన్నతో మాట్లాడే భాష మనపై వాడుతారు. ఒక్కోసారేమనిపిస్తుందంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎల్లకాలమూ పడగ్గదిలోనే గడపకుండా పిల్లాడికి కొంచెం మంచిబుధ్దులు నేర్పించి ఉండాల్సింది అని.