Wednesday, March 25, 2020

A Woman in Berlin (2008)

Image result for a woman in berlin movie

హిట్లరు దరిద్రుడు సైన్యాన్నంతటినీ తీసుకెళ్ళి యుధ్ధాలుచేయడానికే వాడాడు. బాబుగారి దృష్టంతా offence మీదే తప్ప, defence మీద లేదు. రష్యాతో యుధ్ధంలో ఓటమి ఖాయమయ్యాక. ఉన్న మిగిలిన సైన్యాలనుకూడా Battle of Bulge కోసమని వాడి ఏదో తన రక్షణకూ Reichstag రక్షణకూ కొంత సైన్యాన్ని తనవద్ద పెట్టుకున్నాడు. రష్యన్లు Berlin లోకి అడుగుపెట్టేనాటికి ఆ దరిద్రుడు బెర్లిన్ రక్షణభారం గాలికి వదిలేసి, తన Wolf's Lair అనబడే కలుగులోకి ఎలకలా దూరాడు. బెర్లిన్లోకి అడుగుపెట్టిన రష్యన్లు, ప్రతీకారంతో రగిలిపోతున్నారు. హిట్లారు దరిద్రుడు వాళ్ళమీద, వాళ్ళ ఆడాళ్ళమీద సాగించిన అమానవీయమైన హింస వాళ్ళహృదయాల్లో ఇంకా తాజాగానే ఉంది. వాళ్లకి బెర్లిన్ defrenslesగానూ, నిండుగా ఆడాళ్ళూ, ముసలాళ్ళూ తప్ప మరే ఇతర రక్షణ లేని నగరంగానూ కనిపించింది. ఇంకేముంది నాజీలుచేసిన బలాత్కారాలనే వీళ్ళూ చేశారు. దీన్నే Rape of Berlin అని చరిత్రలో చదువుకుంటాం. అప్పట్లో ఇదరు ఆడాళ్ళు ఎదురుపడితే 'wie oft?' ('ఎన్నిసార్లు?') 'ఎన్నిసార్లు రేపుకు గురయ్యావు?' అని పలకరించుకొనేవాళ్ళట.

సరిఘ్ఘా ఇదే ఈ సినిమా నేపధ్యం. Anonyama అని ఒకావిడ ఉంటుంది. ఆవిడ భర్తేమో "మేము ఒక్క అరగంటలో మొత్తం రష్యానీ జయించి వస్తాము. దయచేసి ఈ అరగంట నా ఎడబాటును భరించు" అనిచెప్పేసి రష్యా వెళతాడు. ఈవిడేమో ఈయనొచ్చేలోగా ఇక్కడ జరిగినవిశేషాలను భర్తగారు చదవడంకోసం రాస్తాను అంటూ డైరీలు రాయడం మొదలుపెటుతుంది. అక్కడేమో జర్మన్లు రష్యన్ల చేతిలో చావుదెబ్బతింటారు. రష్యన్లు అంతటితో ఆగకుండా తాము అప్పటివరకూ ఓడినప్రాంతాలనీ తిరిగి కైవసం చేసుకొంటూవచ్చి, బెర్లిన్‌లోకి అడుగు పెడతారు. బెర్లిన్‌లో రష్యన్లు జర్మన్ యువతులపై ఇష్టం వచ్చినట్లు అత్యాచారాలు చెయ్యడమే పనిగా పెట్టుకుంటారు. ధనవంతులైన జర్మన్ కుటుంబాలు రష్యన్ మేజర్లకు విందులిస్తూ, తమమీద, తమ ఓటమిమీద, తమమీద పడ్డ బాంబులమీద జోకులేసుకుంటుంటారు. ఇలాంటి నేపధ్యంలో ఒక అమ్మాయి (పేరు Anonyama) నాలుగైదు సార్లు తనమీద జరిగిన అత్యాచార హింసను తట్టుకొలేక. "ఇహ చాలు. ఇహనుంచీ నామీద చెయ్యేసేవాణ్ణి నేనే ఎన్నుకుంటాను." అని తనను తాను ఒక మేజరుకి అర్పించుకోడానికి బయల్దేరుంది. మొత్తానికి ఈ అమ్మాయి పట్టిన మేజరొకడు వీళ్ళకు కావాల్సిన అన్నమూ అవీ ఇస్తూ, వీళ్ళకు 'రక్షణ' కల్పిస్తుంటాడు. ఆ మేజరుగారు మొదటగా నేర్చుకున్న భాష జర్మన్ అట. ఆయన సినిమాలో ఎక్కుభాగం జర్మనే మాట్లాడుతాడు. కాబట్టి ఆయన సైన్యంలోనే కొందరు ఈయన్ని 'జర్మను మేజరు' అని గేలి చేస్తుంటారు. ఇదిలా సాగుతుంటే రష్యన్ సైన్యంలోనే ఒకమ్మాయికి జర్మన్లైకూడా వీళ్ళు ఇంత చఖ్ఖగా బ్రతకడమేమిటి అని అసూయ చెంది, మూడొ అంతస్తులోని పిస్తోలు చేతబట్టుకొని తిరుగుతున్న జర్మను కుర్రాడిని పట్టించడానికని అలా మేజరుని గేలిచేసే సైనికుణ్ణీ, ఇంకొక పైఅధికారినీ వేసుకొని వచ్చేస్తుంది. ఆ వచ్చిన సైనికుడు మేజరుచేతిలో చావుదెబ్బలు తింటాడు. ఇంట్లో ఎవరూ జర్మను సైనికులు లేరనీ, ఉంటే ఇంటిని మొత్తంగా తగులబెట్టుకోవచ్చనీ అప్పటికప్పుడు తీర్మానం చేసేస్తారు. తరువాత ఈ మేజరు చేతిలో దెబ్బలు తిన్న సైనికుడే దాదాపు సినిమా చివర్లో వచ్చి ఈ అమ్మాయికి రష్యన్‌కూడా వచ్చని తెలుసుకొని జర్మన్ సైనికులు తన ఊరిలో చేసిన ఘోరాలను రష్యన్లో చెప్పి జర్మన్లోకి అనువదించమంటాడు. ఈ అమ్మాయి చెబుతుంది "జర్మన్ సైనికులు మావూళ్ళో చిన్నపిల్లలని కాల్చిచంపారు. పసికందుల కాళ్ళుపట్టుకొని వాళ్ళ తలలు గోడలకేసి మోదారు" అని. ఆతరువాత మన ప్రబుధ్ధులు చేసిన పని ఇదా అని తెగ బాధపడిపోతుంది Anonyama. (ఇలాంటి పనులు చేయించినవాళ్ళు ఇండియాలో ఆదర్శప్రాయులు. వాడెవడో బాబరో, ఔరంగజేబో చేయించాడుకాబట్టి, మనమూ ఆ దరిద్రుల్లాగే చెయ్యాలిప్పుడు మరి). సినిమాలో కూడా ఆ జర్మను సైనికుడు ఒక చోట అంటాడు "మేము వాళ్లకు చేసినదాంట్లో వాళ్ళు మీకు కేవలం పదిశాతం చేసివదిలేస్తే మీరు చాలా అదృష్టవంతులు" అని.

ఒకానొక శుభదినాన హిట్లరు తనను నమ్మినవాళ్ళను గాలికొదిలి, ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో యుధ్ధం సమాప్తమవుతుంది. రష్యన్లందరూ వీధుల్లో తాగితందనాలుడుతూ సంబరాలు చేసుకుంటుంటారు. మేజరుగారు Anonyamaతో ఉంటారు. ఒకానొక పైఅధికారి బాగా తాగి లొనికి Anonyama దగ్గరకు వెళ్ళబోతే ద్వారపాలకుళ్ళా కూర్చున్న సైనికుడు కుదరదంటాడు. తాగున్నోడేమో, నేరుగా మూడో అంతస్తుకే చేరుకొని, జర్మను సైనికుడి ప్రియురాలిని చూసి ఆశ్చర్యపోయి (అక్కడెవరో ఉంటున్నారని ఎవరికీ తెలీదు), అమెను  అనుభవించబోతాడు. జర్మన్ సైనికుడు వీణ్ణి కాల్చిచంపుతాడు. పెద్ద గొడవౌతుంది. జర్మన్ సైనికుడుంటున్న ఇంటికి 'రక్షణ' కల్పించడం రష్యన్ చట్టాల ప్రకారం దేశ ద్రోహం మరి! అంతా సద్దుమణిగాక మేజరుగారు "నాకక్కడ ఎవరూ లేరు. నీతో ఉండిపోతాను అంటారు". ఈవిడేమో "నేనిప్పటికీ మాఅయన తిరిగొస్తే బాగుండుననే అనుకుంటున్నాను అంటుంది". ఈలోగా క్రిందస్తులోని జంటలో భర్త, దేశానికి జరిగిన అవమానానికిగానూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అతని భార్య భోరుభోరున విలపిస్తుంటుంది. Anonyama వాళ్ళకూతుర్ని తనకు తెలిసిన అమ్మాయి ఇంటిలో వదిలేసి ఇంటికి తిరిగొచ్చే దారిలో ఇలా ఆలోచిస్తుంది 'నా భర్త ఎప్పుడో చచ్చుంటాడు ఇక్కడ మేజరుతోనే సెటిలైపోవడం బెటరేమో! ఎలాగు వాడు నానుంచీ పెద్దగా ఆశించే రకం కాదు. నేను ఇంతచేస్తే వాడు అంత ఆనందపడిపోతాడు. నా ప్రాణానికి హాయిగా ఉంటుంది'. తీరా ఇంటికి తిరిగొచ్చేసరికి  రష్యన్ మేజరు ఎవ్వరికీ తెలియని ప్రాంతానికి బదిలీ ఐపోతున్నాడని తెలుస్తుంది. పైగా భర్తకూడా తిరిగొచ్చి ఇంట్లో కూచోనుంటాడు. అక్కడ ఉన్న రష్యన్ ఆఫీసరు భర్తకు అప్పటిదాకా జరుగుతూ వస్తున్నవాటిని క్లుప్తంగా చెప్పి ఉంటాడు. "అసలేం జరుగుతూ వస్తోంది?" అని ప్రశ్నించిన భర్తకు తను అప్పటిదాకా రాస్తూ వస్తున్న డైరీ ఇస్తుంది. అదంతా చదివిన భర్త, "నువ్వో పతితవి, నిన్ను చూస్తుంటేనే అసహ్యమేస్తుంది అంటాడు". Anonyama సైకిలు తొక్కుకుంటూ మేజరు ఆఫీసుకెళ్ళే సరికి మేజరు అప్పుడే బదిలీ అయిపోవడానికి జీపెక్కే పనిలో ఉంటాడు. ఆయనదగ్గరకు వెళ్ళి, "ధన్యవాదాలు మేజరూ, నీగురించి నన్ను తెలుసుకోనిచ్చావు, మరిప్పుడు నువ్వూ, నేనూ ఎలా జీవించాలి?" అనంటే ఆయన నిర్వేదమూ, విషాదమూ కలిసిన ఒక చూపు చూసి, బాధగా జీపెక్కేస్తాడు. ఇంటికొస్తే, రెండ్రోజులున్న మొగుడు, ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. 

చివరిగా Anonyama ఇలా అనుకుంటుంది "ఇప్పుడిలాంటివెవరికీ బాధ కలిగించట్లేదు. నా భర్త నాగురించి ఆలోచించాడోకూడా తెలీదు. అసలు వాడు మళ్ళీ తిరిగివస్తాడో రాడో తెలీదు. నాకు మాత్రం బోలెడు పనుంది. నేను నా ఇల్లు పునర్మించుకోవాలి".


Anonyamaగా Nina Hoss పరమాధ్బుతంగా నటించారు.

ఈసినిమాకి ఆధారం Eine Frau in Berlin (ఇంగ్లీషులో Anonyama: The Distruction of Berlin). యుధ్ధానంతరం జర్మన్ మహిళలు "మేమిలాంటి వాళ్ళం కాము, అలాంటి పనులు చెయ్యలేదు" అంటూ తిరస్కరించారట. పుస్తక రచయిత్రి కూడా ఆ తిరస్కారానికి దిగ్భ్రాంతి చెంది, తను చనిపోయాక మాత్రమే ఈ పుస్తకాన్ని పునర్ముద్రించమని కోరారట. అప్పుడుకూడ తన పేరు రహస్యంగా ఉంచాలని షరతులు విధించారట. అయితే ప్రస్తుతానికి మనకు రచయిత్రి పేరు తెలుసు. పుస్తకం ఇక్కడ ఉంది..