Sunday, March 22, 2020

ఇండియాలో పరిస్థితి అదుపు తప్పనున్నది

ఇది మూర్ఖత్వం కాక మరింకేమిటి? ఏలుతున్న వారికి బుధ్ధుందా? 14 గంటల కర్ఫ్యూ తరువాత చప్పటు, తప్పెట్లు, తాళాలుకొడుతూ అందరూ కలిసి ఊరేగడమిటి? 

ఇంతాచేస్తే ఇదే హెల్త్ వర్కర్లకు కావాల్సిన ఉపకరణాలు తక్కువగా ఉన్నాయట! ముంచుకొస్తున్నది మహాప్రళయం. తస్మాత్ జాగ్రత్త!! 

ఇప్పటివరకూ మరణాల సంఖ్య వేలల్లో మాట్లాడుకున్నారు. అదుపు తప్పిందా ఇవే మరణాలు కోట్లలో ఉంటాయ్!! 


క్వారంటైన్ అవ్వాల్సినోళ్ళు రైలెక్కి వస్తున్నారట. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి ప్రజలు ఉన్నదేశం. పేద దేశం. ఎన్ని క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయ్? ఎన్ని ఐసీయూలు ఉన్నాయ్? ఎంతమందిని ఎదుర్కోగలరు? ఇటలీని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సింది ఇక్కడ. ఇప్పటికే పట్టణాలను సెక్షన్ల వారీగా లాక్‌డౌన్ చేసుండాల్సుంది. మహమ్మారిగా మారే నాలుగవ స్టేజ్ చూడబోతున్నారు.