మనమెప్పుడూ బలహీనుల పక్షానే ఉండాలి. వారి గెలుపే కోరుకోవాలి. అసలు రష్యాకి యుక్రెయినుమీద దాడిచేయడాని కారణమే లేదు. ఆయిల్ విక్రయంలో పోటీ తొలగించుకోడానికి, అక్కడి నేలలోని Neodymium, Lithium, Zirconium మూలకాల నిల్వలకోసం కక్కుర్తిపడితే అసలుకే ఎసరొచ్చేలా ఉంది. ఇక బాబుగారు అణ్వాయుధాలు వాడితే అందరూ వెలివేస్తారు. ఇప్పటికే ఉత్తరకొరియా, చైనా, ఇరాను, కజాకిస్తాను సలాం చెప్పేసి తప్పుకున్నై. ఇహ బాబుగారికి 2030 నాటికి బెలారుస్‌ను రష్యాలో కలిపేసుకొనే ఉద్దేశ్యాలున్నాయట. ఇహ లుకాషెంకోకూడా వెళ్ళిపోతే అడుక్కుతినాలి. ఇటుపక్క యుక్రైనేమో క్రిమియాను వశంచేసుకొనే దిశగా కదులుతోంది. అది రష్యాకున్న ఒకేఒక్క warm water port.
యుక్రేనియన్లు ధాటిగా పోరాడుతున్నారు. ఈ వాగ్నర్ రాక్షససేన బెలారుస్‌లో తిష్టవేయడంతో, జర్మనీ ఒక నాలుగువేల సైన్యంతో కలినింగ్రాడ్‌వైపు సాగిపోయింది. అయినా వీళ్ళ పిచ్చిగానీ... యుక్రెయిన్నే ఏమీపీకలేకపోయాడు. NATOతో సున్నమెందుకు పెట్టుకుంటాడు? ఈమాత్రం చాతాళానికి second most powerful army అట. గాడిదగుడ్డేం కాదూ? ఇటుప్రక్క జర్మనీ, స్వీడెన్, USAలు పూర్తిగా open అయిపోయాయి. USA, Israel, Germany పంపించే క్షిపణులూ, క్షిపణి రక్షక వ్యవస్థలూ, ట్యాంకులూ యిక్రెయినుకు అందితే రష్యా చెమడాలు ఎక్కదీస్తారు.
అయినా ఇప్పటికే కామన్ opinion ఏంటంటే పుతిను కుర్చీకిందకు నీళ్ళొచ్చేసాయి అని. రష్యాలో ఇప్పటికే జనాలు గరంగరంగా ఉన్నారట. ఆయనెవరో Ivan Sorokin అత. తీసుకెళ్ళి జైల్లో పెట్టేసారు. ఇక Yevgeny Prigozhin ఆయన వేషాలు ఆయన వేసుకుంటున్నాడు. పస్తుతానికి ఈయనకి రక్షణమంత్రి Sergei Shoigu కీ పడట్లేదట. అయినా వాగ్నర్ సైన్యంలేకుంటే రష్యా సైన్యంలో అంతా దద్దమ్మలన్నమాట. అప్పుడు వాగ్నర్ సైన్యాన్నే ముందుగా అంతమొందించాలి. అదెలాగూ రష్యన్ సైన్యంకాదు కాబట్టి పుతిన్ తేలుకుట్టిన దొంగలా ఉండిపోల్సొస్తుంది.