నిజాముద్దిన్ ఓలియ అని సూఫి సన్యాసి డిల్లిలోని ఘియాస్పూర్‌లో నివసించేవాడట. ఈయనగురించి ఇప్పటికీ పాటలు కట్టి పాడుతుంటారు. ఈయన బాగా లబ్దప్రతిస్టుడు. ఆయన శిష్యుడే ఆమిర్ ఖుస్రో. ఈ ఆమిర్ ఖుస్రో గారికి సంస్కృత, అరబిక్ భాషల్లో మంచి పాండిత్యం ఉంది.ఈయన కవి, రచయిత కూడాను.
సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్కి ఆమిర్ ఖుస్రో అంటే అభిమానం. తరువాత్తరువాత ఆమిర్ ఖుస్రౌ ఘియసుద్దీన్ రాజదర్బారులో పనిచేశాడు. అయితే సుల్తాన్ గారికి నిజాముద్దీన్ ఓలియ తనమీద కుట్రలుచేసి తనచేత పరలోకయాత్ర చేయించాలని చూస్తున్నాడని అనుమానమట. ఒకానొక శుభదినాన ఆయన బెంగాల్లో యుధ్ధం చేసి గెలుపు సాధించిన తరువాత నేరుగా డిల్లీ బయలుదేరి, నిజాముద్దీన్ గారికి ఫర్మాన్ పంపాడట 'డిల్లీవదిలి వెళ్ళిపో'అని. అది చూసిన ఆమిర్ ఖుస్రో కంగారుగా నిజాముద్దిన్ గారి వెళ్ళి, 'గురువుగారూ మీరుబయలుదేరండి రాజుగారు మిమ్మల్ని చపడానికే వస్తున్నాడు' అని విన్నవించుకుంటే, అప్పుడు నిజముద్దీన్ గారు నిమ్మళంగా కూర్చొని 'హనూజ్ డిల్లి దూర్ అస్త్' అని పర్షియన్ భాషలో అన్నారట. దీన్నే హిందీలో 'డిల్లీ అభ్ భి దూర్ హై' అంటారు. 'వాడొచ్చినప్పుడు చూసుకుందాం లే' అని తెలుగులో చెప్పుకోవచ్చు.
చివరికి ఆయనచెప్పిందే నిజమైంది. యుధ్ధాన్ని గెలిచిన ఆనందంలో.సుల్తానుగారు వేడుకలు నిర్వహించారట. ఆయన ప్రసంగించడానికి అనువుగా ఒక స్టేజి కట్టారు. ఆయన దాన్నెక్కి ప్రసంగిస్తుండగా అకాలవర్షం కురిసింది. వర్షంలో తడిసిన స్టేజి కూలిపోయింది. సుల్తాను గారు బెంగాల్లోనే మరణించారు. అయనెప్పుడూ డిల్లి రాలేదు.
P.S: దీన్నే ఇంగ్లీషులో Cross the bridge when you come to it. అని చెప్పుకోవచ్చు.