క్లస్టర్ బాంబులు వివాదాస్పద ఆయుధాలు. చాలా దేశాలు వాటివాడకాన్ని నిషేధించాయి -కొన్ని దేశాలు మినహా. అన్నింటిలోకి పెద్ద జోకేంటంటే రష్యా ఈ 'అందచేత'ను ఖండించిందట. వీళ్ళుమాత్రం వెయ్యొచ్చు క్లస్టర్ బాంబులు. అదిమాత్రమేనా ఫాస్ఫరస్ బాంబులూ వాడారు. అణ్వాయుధాలు వాడుతామనీ బెదిరిస్తున్నారు. ఇప్పటికే బెలరూస్‌కు కొన్ని తరలించారు. Mariupol పట్టణంలో సామాన్యపౌరులను ఊచకోతకోసి గుట్టలుగుట్టలుగా సామాజిక సమాధుల్లో పాతిపెట్టారు. స్కూళ్ళు, ఆసుపత్రులు అన్నపట్టింపులేమీ లేక కంటికి నదురుగా కనిపించిన ప్రతిదాన్నీ చదును చేశారు.
రష్యాకి ఏనియమాలు వర్తించవు అని కూయడమే ఇది. బలిసిన బాతు బజార్లో గుడ్డెట్టింది అన్నపోకడ ఇది. రష్యన్లుమాత్రమే మనుషులా? యుక్రేనియన్లు కాదా? వాళ్ళని చిత్తమొచ్చిన రీతిలో చంపుకోవచ్చా? ఆడమగ అన్నతేడాలేకుండా, చిన్నపిల్ల్లలు, వృధ్ధులు అన్నతేడాలేకుండా వారిమీద అత్యాచారాలు చేసినప్పుడు ఈబుద్ధి ఏమయ్యింది? నగరాలకు నగరాల్ని నేలమట్టంచేసినప్పుడు ప్రభువులవారికి నోరెందుకు పెగల్లేదు? వయాగ్రాలు జేబుల్లో పెట్టుకొస్తిరికదయ్యా! యుద్ధం ఎవరెలా చెయ్యాలో ఈయన నిర్ణయించేస్తాడా? ధర్మయుద్ధం మిగతావాళ్ళుమాత్రమే చెయ్యాలా? ఈయన చెయ్యడా?
ఇప్పటివరకూ వెలగబెట్టింది చాలు. అయినా ఇప్పుడు బంతి తమరికోర్టులో లేదు ప్రభూ! ముందు నీకుర్చీ కాపాడుకోవయ్యా సామి.