Sunday, July 9, 2023

గుర్తుకొచ్చిన కొన్ని షాయరీలు

 ఆజ్ మస్త్ కె బార్ మస్త్

చోన్, దిగ్రి నీస్త్

    - నాజిర్ ఖుస్రో


అనువాదము: (మంచైనా చెడైనా) మనవల్ల జరుగుతుంది, మననుంచే జరుగుతుంది. ఎందుకంటే (పైన) ఇంకెవడూ లేడు కాబట్టి.



ఘాలిబ్ షరాబ్ పీనెదే మస్జిద్ మె బైఠ్ కర్

యా వొహ్ జగహ్ బత జహా ఖుదా నహో


అనువాదము: ఘాలిబూ నన్ను మసీదులో సారా తాగనివ్వవయ్యా! లేదా దేవుడెక్కడ లేడో ఆస్థలం చూపించు (అక్కడికెళ్ళి తాగుతాను).



ఘాలిబ్ చూటీ షరాబ్ పర్ అబ్భీ కభీ కభీ 

పీతాహు రోజ్-ఎ-అబ్ర్ షబ్-ఎ-మాహతాబ్ మే


అనువాదము: ఘాలిబూ తాగడు అలవాటు వదిలింది. కానీ అప్పుడప్పుడు తాగుతుంటాను. మేఘభరితమైన పగళ్ళలోనూ, వెన్నెల రాత్రుళ్ళోనూ. (ఇంకేం వదిలింది?)

షాయరీ చెప్పలేదుగానీ, ఇలాగే మాట్లాడి ఒకతను బెంగుళూరులో నన్ను ఫిదా చేసినాడు. అతనిమాటలు: 'బారిష్ హొనేవాలా హై సాబ్. ఆస్మాన్ కో దేఖియే బాదల్ సె భరా హువా హై. అబ్ నహీ పీయెంగే తొ కబ్?'. అప్పుడు నేనే ఆయనకి ఈ షాయరీ గుర్తుచేశాను.


తుం సలామత్ రహొ బరస్ హజార్

హర్ బరస్ కె హొ దిన్ పచాస్ హజార్ 

   -ఘాలిబ్


అనువాదము: నువ్వు వెయ్యేళ్ళు జీవితువుగాక. ప్రతి యేడుకీ యాభైవేల రోజులుండుగాక. (ఈలెక్కన సుల్తానుగారు వెయ్యేళ్ళుగాదు లక్షలయేళ్ళు జీవించాలి.)