నిన్న ఫేస్‌బుక్‌లో ఈ వీరనారి వీడియో చూశాక, దీన్ని తెలుగు పత్రికలుకూడా విశేష ప్రాచుర్యం కల్పించినట్లు తెలిసింది. అసలు విషయమేమిటంటే ఇవన్నీ ఈవిడగారి బుర్రకు తట్టిన విషయాలుకాదు. ఎవరో వైసీపీ ఐటీ సెల్లువాళ్ళు ఏప్రెల్ ఎనిమిదో తారీఖున ఒక పోస్టుపెడితే దాన్ని ఈ స్వాతి భట్టీయం గావించేసి, కేమెరా ముందు ఎక్కడలేని "గీర"తో అభినయించేసింది. అయినా అమెరికా మీద అంతటి చులకన భావం ఉన్నప్పుడు అక్కడికెందుకు వెళ్ళడం. ఇండియాలో ఉద్యోగంకూడా లేకుండా అడుక్కుతింటుంటే అప్పుడు స్వర్గంలో ఉన్నట్లు ఉంటుందేం? వచ్చెయ్యమ్మా ఇండియావచ్చెయ్! గవుర్నమెంటు ఆసుపత్రి ఐసీయూలో ఒక్కరోజు గడిపితే ఒంటి కొవ్వుకరిగి, కింద బలుపుపోయి, దిమ్మగిరిగి, బుధ్ధి వస్తుంది.
ఈవిడ వాగిందాంట్లో అమెరికాను తిట్టిపోయడమూ, ఇండియాను నెత్తికెత్తుకోవడమూ తప్ప ఇంకేంలేదు. వట్టి స్వకుచమర్దనం టైపు. మధ్యలో అసలు విషయాన్ని వదిలి స్వేఛ్ఛ, స్వాతంత్రాల గురించీ, పెళ్ళికిముందే డేటింగుల గురించీ ఒక కామెంటు. ఇండియాలో అక్రమ సంబంధాలు పెట్టుకొని, భాగస్వామిని చంపుతున్నరు. మోసాలు, దోపిడీలు, రేపులు, హత్యలు లేకుండా ఏరోజూగడవదు. . అదీ భారత సంస్కృతిలో గొప్పతనం! అంతెందుకు, ఈవిడెప్పుడూ డేట్ చెయ్యలేదా? డేటింగే చెయ్యకుండా, ఏమీ తెలియనివాడితో పక్క పంచుకోవడం వ్యభిచారం అవుతుంది (ఇండియన్ మ్యారేజ్ దాన్నుంచే derive చెయ్యబడింది మరి) కదా! అయినా డేటింగ్ అంటే మంచమెక్కడమని నీకెవరి చెప్పారు? ఓహో! తమరి మురికి బుర్రకి sex తప్ప మరో యావుండకపోవడంతో డేటింగంటే sex అని fix అయ్యావా నారీమణీ?

ఈ PM గారితో పోల్చితే ఏమాత్రమూ తీసిపారేయదగ్గవారు కారు అక్కడి అధ్యక్షులవారు. ఆ మూర్ఖుడి దయవల్ల నేడు అమెరికాలో ఇన్ని కష్టాలు. అక్కడ lockdown విధించడానికే కుదరడంలేదు. ఒక్కోరాస్ట్రానిది, ఒక్కోబాట! ఈ రంధిలో డొమెస్టిక్ విమానాలు నడుస్తున్నాయ్, కారేసుకొని, NYనుంచి ఏకంగా కాలిఫోర్నియాకు బయలుదేరితే, వాణ్ణాపే దమ్ము ఎవడికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోగం వ్యాపించకపోతే ఆశ్చర్యపడాలిగానీ, వ్యాపిస్తే ఎవరైనా ఎందుకు ఆశ్చర్యపడాలి?
ఇహ Hydroxychloroquine గోల. ఈ Hydroxychloroquineని మలేరియాని నయంచెయ్యడానికి వాడుతారు. మిగతా దేశాల్లో Hydroxychloroquine ఎందుకు లేదు అంటే... అక్కడ ఇంకా మలేరియా ఎవరికీ రావట్లేదు, కొన్ని దేశాల్లో పదుల్లో కేసులుంటాయి. ఇండియాలోలాగా వేలల్లో మలేరియాకి బలైపోవడం వాళ్ళకి కేవలం ఒక జ్ఞాపకం. ఇండియా ఇంకా మలేరియానికూడా నివారించని స్థితిలో ఉందికాబట్టి ఇండియాకు Hydroxychloroquine నిల్వలు maintain చెయ్యడం తప్పనిసరి. ఈమాత్రం దానికి ముప్పై దేశాలు ఇండియాలోని ఈ మందుకోసం అంగలార్చుతున్నాయి అని అనుకోవడం మూర్ఖత్వం. అయినా ఒకరి బ్యాగులో ఏ ఏస్ప్రినో ఉందంటే సరేగానీ హైబీపీకి, ఆస్మాకీ, గుండెపోటుకీ మందులూ ఇంకా ఇన్సులిన్ ఇంజెక్షన్లూ ఉంటే "అహా! వీడు చాలా ఆరోగ్యవంతుడురా భయ్!" అంటామా? బుర్రలు కుంచెం వాడండి.

ట్రంపు బెదిరిస్తే PM గారు వణుక్కుంటూ Hydroxychloroquine పంపించేశారు. అది కూడా ట్రంపు అనుమతించిన దేశాలకే సుమా. మిత్రదేశం ఇరాన్‌కు పంపించడానికి యాభయ్యారు అంగుళాల ఛాతీ పంచెలు తడుపుకుంటొంది. ఈ మహానుభావుడు పెద్ద పుడింగి!