Monday, December 2, 2019

Chloroform CHCL3

ఈ మధ్య కొన్ని వీడియోలు, సినిమాల్లో క్లోరోఫారంని ఇష్టమొచ్చినట్లు మత్తుమందుగా వాడడం చూశాను. ఎప్పుడో ఇంటరులో Organic Chestryలో చదువుకున్న పాథం గుర్తుకొచ్చింది. 

అసలు విషయం ఏంటా అని పరిశోధిస్తే తెలిసింది ఇది.

1. క్లోరోఫారంని ఒకప్పుడు మత్తుమందుగా వాడినమాట నిజమే. కానీ ఇప్పుడెవడూ వాడట్లేదు. ఎందుకంటే సరైన డోసేజి బోల్డు విషయాలమీద ఆధారపడుతుంది(రోగి బరువు, జెండరు, శరీరతత్వము వగైరాలు). ఏమాత్రం తేడావచ్చినా పేషెంటు మూడవ స్టేజీనుంచి ఐదవ స్టేజీ అనస్థీషియాకు చేరుకుంటాడు. అంటే ఊపిరితిత్తులు పనిచెయ్యడం మానేసి వాడు శాశ్వతంగా బబ్బుంటాడు. అనుభజ్ఞుడైన వైద్యుడిక్కూడా రోగిని మళ్ళీ మూడో స్టేజికి తీసుకురావడానికి కనీసం 15 నిమిషాలు పడుతుందట. ఈలోపు ఏమైనా జరగొచ్చు.

2. చిన్న డోసేజిల్లోకూడా  క్ళోరోఫార్మ్ కిడ్నీలమీద, లివర్‌మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది తెలుసుకు చచ్చాకే మనం క్లోరొఫొర్మ్ని మత్తుమందుగా వాడడం మానేశాం.

3. క్లోరోఫార్మ్ UV rays సమక్షంలో Oxidize అయ్యి Phosgene గా రూపాంతరం చెందుతుంది. అసలు క్లోరోఫొరంలో మలినాలు ఉంటే ఆమాత్రం సూర్యరశ్మి (Uv rays) కూడా అవసరంలేదు. Phosgene ఒక విషవాయువు. దీన్ని మొదటి ప్రపంచయుధ్ధంలో మనుషుల్ని చంపడానికి వాడారు. 


కాబట్టి చెప్పొచ్చేదేంటంటే క్లోరొఫొర్మ్ అనేది పిచ్చ రిస్కీ. ప్రస్తుతానికి మనం వాడేది Desflurane లేక Halothane అంతేగానీ క్లోరోఫార్మ్ పొరపాటునకూడా వాడం. మరీ దిక్కులేకపోఫ్తే పేషెంటు తలమీద మూర్ఛపోయేలాకొట్టి, వాడిమీద ఆపరేషన్ చెయ్యొచ్చెమోగానీ, క్లోరోఫొర్మ్ is deadly. Full stop.

P.S. : పనిలోపనిగా ఇంకోటి. Listerin అనబడే mouthwashను మొదటగా Industrial floor cleanerగా వాడరు. ఆ తరువాత గనేరియా చికిత్సలో ఔషధంగా వాడారు. ఆ తరువాత మన వైద్యులు Halitosisఅనబడే ఒక భయంకర రోగాన్ని కనుక్కున్నారు అలా కనుక్కున్నవాళ్ళు దానికి మందుగా Listerinవాడొచ్చని కనుక్కున్నారు. Halitosis అనగా bad breath. ఇహ ఆ తరువాత కంపెనీ షేర్లు పదిరెట్లు పెరిగాయట.