Friday, November 22, 2019

Lethal Marriage - Nick Pron

Lethal Marriage


Karla Homolka ఒక అందమైన అమ్మాయి. చిన్నప్పుడు కొంచెం odd గానూ, కౌమార దశలోనూ తల్లిదండ్రులతో పెడసరం గానూ ప్రవర్తించినా మొత్తానికి నార్మల్‌గానే ఉండేది. Criminologist కావాలని కలలు కనింది. అందంతోపాటు, తెలివితేటలుకూడా కలదవ్వడంతో అబ్బాయిల్లో మంచి పాపులారిటీ.

Paul Bernardo ఆరడుగుల ఆజానుబాహుడు, అందగాడు. చిరునవ్వుతో, పసిపిల్లవాడిలాంటి ముఖంతో ఎదుటివారిని చిత్తుచేయగలవాడు. 

Image result for karla homolka
అలాంటి Homolka, Bernardoలు అనుకోకుండా ఒక రెస్టారెంట్‌లో కలిసారు. ఆ పరిచయం ఆరాత్రే, ప్రేమగా మారి, పడకలాదాకా వెళ్ళింది. కొన్ని వారాల్లో Bernardoని కుటుంబానికీ పరిచయం చేసింది Homolka. Bernardo కూడా రాముడికన్నా మంచిదైన ప్రవర్తనతో మొత్తం కుటుంబాన్నీ ఆకట్టుకున్నాడు. ముగ్గురాడపిల్లలున్న ఆ కుటుంబం, కాబోయే అల్లుడు Bernardoను కొడుకులా ఆదరించింది. Weekend son అని ముద్దుగా పిలుచుకొనేవారు. కానీ...

Bernardo ఒక paraphilic.  సెక్స్‌మీద విపరీతమైన ఆసక్తి. అది తనకో వ్యసనం. అమెరికానుంచి కెనడాకు సిగరెట్లు స్మగ్ల్ చెయ్యడం అతని వృత్తికావడంతో, అమెరికా వచ్చినప్పుడల్లా Homolka ఇంట్లోనే ఉండేవాడు. అలా ఉంటున్నప్పుడు ఒక్కోసారి బయటకు వెళ్ళి ఒంటరిగా కనబడిన ఆడపిల్లలను కత్తితో బెదిరించి బలాత్కరించేవాడు. ఇలాంటి గుణవంతుడైన Bernardo కళ్ళు Homolka చెల్లెలు Tymపై పడ్డాయి. వెంటనే Hamolkaతో బేరం సాగించాడు. తనను కలిసేనాటికి, Homolka కన్య కాదు కాబట్టి, రాజాధిరాజైన తనకు (అలా పిలిపించుకోవడం వాడికున్న మరో మాయరోగం) కన్యలంటే ఇష్టంకాబట్టి, తనకు Tymని అర్పించమని Homolkaను బలవంతంచేశాడు. మొదట్లో కాదన్నా, తరువాత తన ప్రియుడిని తనవైపు తిప్పుకోడానికి అంతకంటే దారిలేదని భావించిన Homolka చివరకు సరేనంది. ఒకానొక Christmas eve నాడు ముహుర్తం పెట్టి, Tymకి మత్తుమందులు కలిపిన wine ఇచ్చి, తల్లిదండ్రులు నిద్రపోయిన తరువాత, ఇద్దరూ Tymతో రమించారు. ఈ ఘనకార్యాన్నంతా వీడియో తీసుకున్నారు. మత్తెక్కువై Tym చనిపోయింది. తెల్లవారి ఏవేవో నాటకాలాడి తప్పించుకున్నారు. ఇదంతా జరిగి నెలకూడా కాకముందే వీళ్ళిద్దరూ పెళ్ళి చేసేసుకొని, వేరే ఇంటికి వెళ్ళిపోయారు. 

అప్పటినుంచి Homolkaకూ కష్టాలు మొదలయ్యాయి. Bernardo paraphallic అవ్వడంతో వాడికి ఒక్క సెక్స్ సరిపోయేదికాదు. వాడికి హింసకూడా కావాలి. బుధ్ధిపుట్టినప్పుడల్లా Homolkaను ఒళ్ళుహూనమయ్యేలా తన్నడం మొదలెట్టాడు. ఆవిధంగా Homolkaను పూర్తిగా తనవశంలోకి తెచ్చుకున్నాడు. అటు Homolkaకూడా తక్కువేమీ తినలేదు. సత్యవంతుడి perversionని నెత్తినమోసిన సావిత్రి లాగా వాడికోసం ఎలాంటి దారుణాన్నైనా చేసే స్థాయికి వెళ్ళిపోయింది. తన ఒంటిమీద దెబ్బలను తన సహోద్యోగుల దగ్గ దాచేది, వాడితో కారులో తిరుగుతూ టీనేజి పిల్లలను అపహరించి, ఇంట్లో బలాత్కరించడంలో సహాయమూ చేసేది. ఒకసారి ఒక టీనేజీ పిల్లతో స్నేహం నెరపి, ఇంట్లోనే Tymకు ఇచ్చినట్లుగా మత్తిచ్చి, వీడియీ కెమెరా ముందు సెక్స్‌చేశారు. ఈసారి మాత్రం పిల్ల బ్రతికిపోయింది. 

ఒకసారి Bernardo అలా బయటకు వెళ్ళి  Leslie Mahaffy అనే ఒక టీనేజి పిల్లను వేటాడి తెచ్చాడు. ఆపిల్లకు గంతలుకట్టి, రాక్షస రతి అనుభవించి, చివరకు చంపేసి, ఆపిల్ల దేహాన్ని ముక్కలుముక్కలుగా కోసి, సిమెంటులో ముంచి, దగ్గర్లో ఉన్న వాగులో విసిరేసారు. 

ఇంకోసారి  Kristen French అనే ఇంకో పిల్లను తెచ్చి, మళ్ళీ పైన జరిగిన తంతంతా చేసి, ఈసారి ఒక dumping yardలో విసిరేశారు. 

ఇదంతా మొత్తం ఆరేళ్ళుగా సాగుతూ వస్తోంది. కెనడా పోలీసుల దగ్గర అత్యాచారాల అనుమానితుడిగా Bernardo పేరు నమోదై ఉంది. వాడి DNA samples కెనడియన్ పోలీసుల దగ్గర ఉన్నై (ఆ samples ని పరిశీలించడానికి కెనడా పోలీసులకు 26 నెలలు పట్టిందంట!! కారణం interdepartmental jealousy and their priorities). పోలీసులు గీయించిన ఊహాచిత్రం, Bernardoతో సరిపోయింది. ఆ విషయమై పోలీసులూ Bernardoను చాలాసార్లు విచారించారు. ఇదిగాక వాడిమీద కొంతమంది కంప్లైంట్లూ ఇచ్చారు పోలీసులకు. 

Image result for karla homolka beaten
ఒకానొక శుభదినాన Bernardo, Homolkaను చేత్తోకొడితే చేతులు నొప్పెడుతున్నాయన్న కారణంచేత, టార్చిలైటుతో మొహమంతా వాచేలా కొట్టాడు. అది చూసి భయపడిన కొలీగులు, Homolka వాళ్ళమ్మకు ఉప్పందించారట. అవిడవచ్చి కూతురుని ఇంటికి తీసుకెళ్ళి, ఒక గృహహింస కేసు నమోదు చేశారు Bernardo మీద. ఆవిధంగా బాబుగారు తొలిసారి అరెస్టయ్యారు. ఇంతలో 26 నెలలుగా షెల్ఫులో మూలుగుతున్న DNA samples అనాలసిస్సూ పూర్తయ్యింది. ఇహ Bernardoని మూసేశారు. Homolka కధ ఇంకా మిగిలే ఉంది. చెల్లెలు Tym మరణానికి కారణం తనేనని తన తల్లిదండ్రులకే ఇంకా తెలీదు. దెబ్బలనుంచి కోలుకున్న ఈవిడ పబ్బులూ, డిస్కోలూ అని తిరుగుతూ తన శారీరక వాంఛలు తీర్చుకోవడంలో తలమునకలై ఉంది. గృహహింస విషయమై ఇంటి తలుపుతట్టిన పోలీసులను చూసి వణికిపోయిన నారీమణి, తరువాతిరోజు లాయరును కలిసి విషయమ్మొత్తం వివరించడంతో, వాళ్లకి దిమ్మతిరిగింది. ఈలోగా Bernardo ముద్దుగా దాచుకున్న వీడియోలు మాయమవడంతో, Homolka అప్రూవర్‌గా మారతానని బేరం పెట్టింది. ఆ బేరం కుదిరాక, తనకు ప్రభుత్వంవారు మాటిచ్చాక, వీడియో టేపులు బయటపడి, Homolka రాక్షసత్వమూ బయటపడినా ప్రభుత్వంవారు ఇంకేమీ చెయ్యలేకపోయారు. అలా పన్నెండేళ్ళ జైలుశిక్షననుభవించి 2005లో విడుదలై పిల్లపాపలతో ప్రస్తుతానికి సుఖంగా ఉంది. 

ఇహ Bernardo ఇరవైదేళ్ళ శిక్షతరువాత, బాబుగారు 2020లో విడుదలవుతారట. 

వీడు చేసిన ఒకే ఒక్క మంచిపనేంటంటే, తన రాక్షసత్వాన్ని, వీడియోలో రికార్డ్ చెయ్యడం. అవిచూసిన జడ్జిలూ, ప్రజలూ నిర్ఘాంతపోయారు. మరోమాటలేకుండా శిక్షఖరారు చేసేశారు. 

ఈ మొత్తం విషయంలో నాకు నచ్చనిదేంటంటే, ఇలాంటి రాక్షసులక్కూడా జైలుశిక్షలేనా? అసలు వీళ్ళని చంపేసి, వాళ్ళ organ harvesting చెయ్యాలి. అన్ని నీచమైన పనులు చేసిన Homolka తన ఐరవైల్లోనే చఖ్ఖగా విడుదలైపోయి, కొడుకునుకని సెటిలైపోవడమేమిటి? ఈ దరిద్రుడు 2020లో విడుదలవ్వడానికి సిధ్ధంగా ఉండడమేమిటి? ఎంచక్కా అమెరికాలొనైతే ఈ దరిద్రుడికి ఏ 500 యేళ్ళొ జైలుశిక్షపడేది. సమాజానికి వీడిపీడ వదిలిపోయేది. 

ఇహ పోలీసుల పాత్ర. వీడి DNA నమూనాలు అటకమీదున్నా, వాటిని 26 నెలలపాటు analysisకి పంపలేదట. అలా చేసుంటే చివరి రెండు హత్యలూ జరిగేవే కాదు. అసలు అంతమది కంప్లైంట్ చేస్తే FIR ఎందుకు నమోదుకాలేదు. కుర్రాడు అందంగా ఉంటే వాడు ఇలాంటి దరిద్రప్పని చెయ్యడని ఎక్కడైనా రాసుందా? దగ్గరివారు, ఆఫీసులో వారు, వీడు వేటాడ ప్రయత్నించినవారు.. ఎందరో కంప్లైంట్లిచ్చారు. ప్రతిసారీ, పోలిసులు వీణ్ణి కలవడం, "అబ్బే... కుర్రాడు మంచోడు" అంటూ ఒక సర్టిఫికెట్ ఇవ్వడం. 

కోర్టులు. వీళ్ళు చేసిన పనులకి, కోర్టులు వేసిన శిక్షలకి ఏమన్నా సంబంధముందా? ఒకానొక స్థాయిలో వాడు తీసిన వీడియోలను అమ్మకానికిపెట్టి ఆడబ్బు వాడికిచ్చెయ్యాలని ఒక ప్రొసీడింగు సాగిందట. ఏంత సిగ్గుచేటు?? Mahaffy తల్లి "నా కూతురు చనిపోయింది నీకు లాభం చేకూర్చడానికి కాదు"  అంటూ కేసువేయాల్సొచ్చిందట. థూ!! ఇలాంటి రాక్షసులమీద మానవత్వమా. Homolka కేవలం battered wife మాత్రమే అంటూ సాగిన వాదనకూడా అతి నీచం. Homolka కోర్టులో ఒకసారి "Mahaffy ని చంపేముందు మత్తిస్తే, తనకు నొప్పి తెలియదని నేనే సలహా ఇచ్చాను" అని చెప్పి తానేదో దయామయురాల్లాగా మురిసిపోయిందట. ఈ నారీమణికి, భర్తనుంచి విడిపోయాక పోలీసులదగ్గరికెళ్ళి వ్యవహారం చెప్పాలన్న ఆలోచనలేదుగానీ, ఉమ్మడి క్రెడిట్ కార్డులు కాన్సిల్ చెయ్యాలనీ, లాయరు దగ్గరకూ, డిస్కోలకూ వెళ్ళాలని మాత్రం బాగానే తెలుసు. వీడియో సాక్షాలున్నా, ఇలాంటి రాక్షసులను ఉత్తిపుణ్యానికే వదిలెయ్యడం ఘోరం. మనిషి ప్రాణానికి ఏమాత్రం విలువివ్వని ఇలాంటివాళ్లు మనమధ్య స్వేచ్చగా తిరగొచ్చని చెప్పిన కెనేడియన్ చట్టాలకు దండం.

P.S. : This book is very graphic and is not for the feint hearted. This book goes through videos and describes scene by scene including the dialogues spoken by the victims and the culprits. Some victims (esp. Kristen French) cooperates with the culprits in an attempt to outsmart them and then realises that she is going to get killed. Her please to Homolka to let her fo are certainly not to be read in the office or in a public place. Read this book only if you are into some studies.