Census అనగా జనాభా లెక్కలు. ఇది ప్రతి పదేళ్ళకూ జరుగుతాయి.
సమస్యల్లా దాన్ని NPRతో ముడిబెట్టడమే. కిరణ్ రిజుజు అనబడే MPగారు NPR ఆధారంగా NRC తయారుచేస్తాం అని చెప్పారు. ఇహ మిగిలిందల్లా దాన్నుంచి CAAకు వెళ్ళడమే!
బీజేపే ఎప్పుడూ ఇంతేనబ్బా! ఎవడైనా ఇప్పుడు ఆర్ధికాభివృధ్ధి గురించి మాట్లాడుతున్నాడా? అసలు సమస్యను ప్రక్కదారి పట్టించడానికి కొసరు సమస్యను తెరపైకి తేవడంలో వీళ్ళు చాలా సమర్ధులు. అసలుదాన్నొలిదిపెట్టి NPR, NTR, NCC, NCRఅంటూ ఏందీ రభస? తీరాచూస్తే ఇదంతా చేసేటోళ్ళ అర్హత ఇంటర్మీడియటా?
వీళ్ళు గతంలో చేసిన నోట్లరద్దు, GSTచూశాకకూడా జనాలు వీళ్ళనెందుకు నమ్మాలసలు? వీళ్ళకేమో వీళ్ళ డిగ్రీ సర్టిఫికేటు సమర్పించడంకూడా సాధ్యపడదా.. ఇలాంటోళ్ళకు జనాలు సిటిజెన్షిప్పు ఋజువు కాగితాలు తప్పక సమర్పించుకోవాలా? బావుంది సంబడం!