Monday, December 23, 2019

EU చట్టాలూ - వీపీయన్నూ - అమెజాను శాడిజమూ- నెట్‌ఫ్లిక్సూ

Image result for submarine cable map
యూరప్‌లో చట్టాలు పైరసీ విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని law firms వాళ్ళ వాళ్ళ network agents తోటి టొరెంట్లు అనబడే P2P networksని స్కానుతూ ఉంటాయి. దొరికింది కదాని టొరెంటును క్లిక్కితే మొదటిసారి వెయ్యియూరోలూ (దాదాపు ఎనభైవేల రూపాయలు) రెండో సారి 5000 యూరోలూ (అనగా నాలుగు లక్షలు) ఆతరువాత 20,000 యూరోలూ (అనగా పదహారు లక్షలూ) జరిమానాలు వేసి, ఆనక జైల్లోకూడా పెట్టించగలవు. అలాగెందుకనగా ISPలూ, ప్రభుత్వరంగ గూడచార సంస్థలూ, లాయర్లూ, కంటెంట్ ప్రొవైడర్లూ కలిసి కట్టుగా పనిచేస్తారు. ఇండియా, అమెరికాల్లో మన ఉత్తిపుణ్యానికే యూట్యూబులో సినిమలు చూసెయ్యొచ్చు. యూరప్‌లో వాటినికూడా కొనుక్కొనే చూడాలి. తేరగా వచ్చే సినిమాలేవీ సెర్చిలో కనిపించవు. ఇదిచాలదన్నటు ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా పోయే డేటా అంతటినీ (అనగా రష్యా మినహా యూరపులోంచిపోయే మొత్తం డేటానీ. మళ్ళీ రష్యన్ డేటాలో కూడా ప్రధాన భాగం) జర్మన్, బ్రిటీష్ సీక్రెట్ సర్వీసెస్ జల్లెడపడతాయి. అందునా BND (Bundesnachrichtendienst లేక Federal Intelligence Service) ఛాదస్తం కొంచెం ఎక్కువగానే ఉన్న సంస్థ. ఇంతచేసే గవర్నమెంటులు జనాల డేటాని కంపెనీలు వాడకూడదని చట్టాలు చేసినప్పుడు బేలగా ప్రవర్తిస్తుంటాయి. ట్రాక్ చేసే కుకీలు వాడకూడదు అని రూల్ పెట్టొచ్చుకదా? వీళ్ళుచేసిందల్లా ఏంటంటే యూజరు అనుమతితో ట్రాక్ చేయ్యొచ్చు అనిమాత్రమే. ఇప్పుడు ఏకొత్త సైటు ఓపెన్ చేసినా  వాడుముందుగా మన అనుమతి తీసుకొనే లోనికు పంపిస్తున్నాడు లేకుంటే విండో క్లోజుచేసిపోతున్నాడు లేదా అనుమతిచ్చిందాకా విసిగిస్తున్నాడు. ఇదీగాక ఇక్కడ తేరగా వచ్చే WiFi నెట్వర్కులు బానే ఉన్నాయ్. అక్కడినుంచి మనం బ్యాంకు లావాదేవీలు జరపడం బేకైన పని. ఈ నేపధ్యంలో ఇవ్వాళే NordVPN అనబడే దాన్ని ఒక మూడేళ్ళకు కొనిపారేసాను. ఇప్పుడు చాలా ఆనందంగానూ ఉల్లాసంగానూ ఉంది. ఒక పూట భోజనానికయ్యే ఖర్చుకన్నా తక్కువఖర్చు నెలకు అవుతోంది. 80%  డిస్కౌంటుకదా!

ఇకపోతే NordVPN అనేది ప్రపంచంలోనే అత్యధిక సర్వర్లున్న VPN (5000 పైచిలుకు). ఇండియాలో చెన్నై, ముంబైల్లో ఉన్నాయి సర్వర్లు వీళ్ళకి. నెట్వర్కు స్పీడుగానే ఉందీ (నెట్‌ఫ్లిక్సు పనిచేస్తూనే ఉంది). మరీ Tor అంత దిక్కుమాలిన విధంగా లేదు. అయినా బుధ్ధున్నోడెవడూ ఇప్పుడు Tor వాడట్లేదు. ఇండియాలో కొంచెం కాస్ట్‌లీ ఇది. ఎందుకంటే వీళ్ళ లెక్కలు డాలర్లలో ఉన్నై. నాకైతే ఒకపూట Döner అనబడే షవర్మా, సలాడ్లకూడిన బ్రెడ్డుముక్కలు తినడంకన్నా తక్కువ ఖర్చౌతుంది.

ఇవ్వాళ తెలుసుకున్న విషయాలేంటంటే... నేను నా దోస్తు అమెజానకౌంటు ఇక్కడ వాడుతున్నాను. అమెజానోడు ఎంతటి దరిద్రుడంటే వాడసలు కొన్ని సినిమాలు అందుబాటులో ఉన్నట్లుకూడా మనకు తెలీనివ్వడు. ఇవ్వాళ ఇండియాకు కనెక్టయ్యి, సెర్చితే, అన్ని సినిమాలదీ లిస్టొచ్చింది. తీరా చూద్దుముకదా అని క్లిక్కితే, "మీరు ముందుగా ఆ VPN బందు చెయ్యండి" అని చిన్నగా తలంటాడు. Location Based Content Filtering అనేది ఏదైతే ఉందో, అది పూర్తిగా శాడిజం. దానివల్ల వాడికొచ్చేదేంటో నాకర్ధం కాలేదు. ఎలాగూ సైటు వాడిదే కాబట్టి, మనకు ఏం సినిమాలు నచ్చుతున్నాయి, ఏం చూస్తున్నాం అనేది లిస్టు రాసి పెట్టుకోవచ్చు. కావాలంటే సైకోఅనాలసిస్సూ అవీకూడా చేసుకోవచ్చు. ఎందుకు అలాచేస్తున్నాడో నాకర్ధం కాలేదు. ఇదే విషయం నేను E-books విషయంలో కూడా చూశాను. 

నెట్‌ఫ్లిక్సోడు కొంచెం మెరుగు. వాడూ సెర్చిలో సినిమాలు చూపించడు. VPN కి కనెక్టై సెర్చితే ఉన్న అన్ని సినిమాలూ చూపించేస్తాడు. ఇహ ఆ తరువాత మనం సినిమా చూసుకోవచ్చు. మనం VPN వాడుతున్నామా లేదా అనేది వాడికనవసరం. అయినా నా నెట్‌ఫ్లిక్సకౌంటును నేనుకాక ఇంకా ముగ్గురు వాడుతున్నారు (ఒక ఇటాలియను ఫ్రెండిణి, నా ఇద్దరు బెంగుళూరు దోస్తులు).  ఈవిషయంలో నెట్‌ఫ్లిక్సోడు  నాకు నచ్చాడు.