Tuesday, December 24, 2019

c/o కంచరపాలెం

Image result for venkatesh maha director

ఎవడ్రా సినిమా తీసింది!!! అసలది కధా? అదొక సినిమానా? సినిమా అంటే ఎలా ఉండాలి? టాప్‌స్టార్సుండాలి. అసలు కధతో పనేంటి సినిమాకు? బూతులేకుండా, హింసలేకుండా అసలా కధలేమిటి? ఆ దిక్కుమాలిన ఔన్నత్యాలు, ఆవులు, గేదెలూ ఏమిటి? "కళాత్మక వ్యాపారం" అనంటే "హీరోయిన్ల ఒంటిసొగసులతో వ్యాపారం" అనికూడా తెలుసుకోకుండా  ఎవడు బడితే వాడు సినిమా తీస్తే "తెలుగు సినిమా" ఇలాగే తగలడుతుంది!! అసలు రికార్డుడాన్సు (అనగా ఐటం సాంగు) లేకుంటే అదసలు తెలుగు సినిమా ఎలా అవుతుంది? ఎక్స్పోసింగు లేకుంటే అది తెలుగు సినిమా ఎలా అవుతుంది? ఫైట్లు లేకుంటే అది తెలుగు సినిమా ఎలా అవుతుంది? అందులో నటించిన ఒక్కరన్నా అసలు మనకు తెలుసా? What nonsense is that? What depravity os this? Double meaning dialogues లేకుండా సినిమా ఉంటే "తెలుగు సినీ కళామతల్లి " ఎంతబాధపడుతుందో ఎవడికన్నా పట్టిందా అసలు?

నేనలాగే వాగుతానుకానీ 'మహా'నుభావా! నువ్వు మళ్ళీ ఇలాంటి సినిమా తియ్యాలి. నీలాంటోళ్ళూ మళ్ళీ మళ్ళీ రావాలి. మా "తెలుగు సినీ కళామతల్లి" నడ్డిమీద తన్ని బయటకుతోసైనా సరే ఇలాంటి సినిమాలు తీయాలి. ఏడించావునాయనా. నవ్వించావు. రెండుసమయాల్లోనూ కన్నీళ్ళు తెప్పించావు. ఇక చివరిచ్చిన ట్విస్టూ... ఆ చివరి డైలాగూ... అద్భుతం స్వామీ!!! తీసుకో వీరకొరడాలు. వాయించు. మా దర్శక దరిద్రుల్నీ, నటన రాని నటులనీ, మా దరిద్రపునటీ మణులనీ, వీళ్ళందరికోసం చొక్కాలుచించుకొనే మా ప్రేక్షకగాడిదల్నీ, ఆ గాడిదల కొడుకుల్నీ.

ఈ సినిమా చూసాక నాకు "గంగిగోవు పాలు" వేమన పద్యం గుర్తొచ్చింది. వందలూ, నూటాయాభలు తీస్తారు. ఎందుకు? ఎవడడిగాడు? ఎవడు బాగుపడ్డాడు? వీళ్ళు తీసిన సినిమా యేదైనా చెప్పుకంటుకొంటే గడ్డి వెదుక్కుంటాం - చెప్పులు తుడుచుకోడానికి.

టెక్నికల్ వాల్యూస్ సంగతేమోగానీ. ఇలాంటి సినిమాల్ని మనం ఆస్కారుకు పంపించుకోవాలి. బాహుబల్లులను కాదు.