రాజకీయాల్లోకి వచ్చి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఎలాంటి అడ్డగాడిదకైనా ఉంటుందని నాకు తెలుసు. మరి నాలాంటి నిలువు గాడిదకు ఉందో లేదోనన్నదిమాత్రం నాకు తెలీదు. అందుకే నేను ఈసీ వారికి ఈ బహిరంగలేఖ వ్రాయుచున్నాను.
నా అర్హతలు :
- ఇంటరు నాలుగు సార్లు తప్పినప్పటికీ, నేను పదోతరగతి నిక్కముగా ప్యాసయి ఉన్నాను. ఒక లక్షన్నరదాకా పుస్తకాలు చదివియున్నాను -అదికూడా కేవలం మూడు నెలల వ్యవధిలోనే! మల్లయుధ్ధం, జూడో, కరాటేల్లో ప్రవేశం ఉంది కాబట్టి చట్టసభల్లో నెగ్గుకురాగలను. పంచెలూడగొట్టడంలో దుశ్శాసనుడికున్న అనుభవం నాకూ ఉంది. నేను మా అన్నకన్నా గందరగోళంగా మాట్లాడగలను. నా అభిమానులు నన్ను మించిన వెధవలు, లత్తుకోర్లు, లుఛ్ఛానాయాళ్ళు. బుర్రలు ఏమాత్రం వాడకూడదని వాళ్ళందరూ ఏప్పుడో ఒట్టేసుకున్నారు.
- "జారే జహాసె అచ్చా... యే బుల్బుల్ హమారా... యే సితారా హమారా" అనే వేమన పద్యం నాకూ వచ్చు. నాకూ 'సంస్కృత'పాండిత్యం ఉంది. సభల్లో తప్పతాగినవాడిలా నేనూ మాట్లాడగలను. తపంచాలతో కాల్చడం దగ్గరనుంచీ, స్నైపర్షాట్లు తీసుకోవడం వరకూ నాకు అనుభవం ఉంది. ఈ మధ్యనే మా వెంపలి వృక్షమునెక్కి, అక్కడినుండి మా రోట్లోకి దూకాను కాబట్టి నేను ఎక్కని ఎత్తూ, చూడని లోతూ లేదు. నా అభిమానులు కులగజ్జి నాయాళ్ళు. వాళ్లందరికీ కలిపి నాకున్నంత -బఠాణీ గింజంత- బుర్ర కూడా ఉండదు.
- నాకు... షేవ... షేయాలని... ఉండి. నకు... పుల్లయ్య గారి.... ఆసీస్సులు, ఎల్లయ్య గారి అసీష్షులు, మల్లయ్య గరి అషిష్షులు ఉన్నాయి. నాకు సెవా... చెయలని ఉన్నది. నకు యెంకయా గరి అస్సీస్సులు... ఇంకా వెంకయా గరీ ఆషిషులు కుడా ఉనయి. అంతెకకుండ సత్తెయ గరె ఆఫీసులు కుడ ఉనయి. నకు సెవ చెయలని ఉనది. మా తత గరు అఫుడూ అంటే వారు ప్రజలే దేవుళు, సమజమె దెవాల్యం అని. నకు సాంతయ గరి అఫీషులు కుడ ఉనై. నెను మగ పడుచూనీ అండ్ ఇకడే నాకు అశీస్సు ఉంది. అంధులో కుచోని నేను సెవ చెస్తను. నాకు షేవ్ చెయాల్ని ఉంది. నెను బగలనకా రత్రనక షెవ్ చెస్తను. నూరు పుడకల 'త్రిపసుచ్చాపి'ని, రోడ్స్ను కుడతను. నాకు చినపటి నుందీ షెవ్ చెయ్యలను ఉంది. నాకు రొందు తమ్ముల్లు ఉన్నై. అవి సందు చుసుకొని దురుతై. నికు సెవ చెయలని ఉంది.
- అబ్రహం లింకను మా ఇంట్లో వారాలబ్బాయిగా ఉన్నాప్పుడు, నేనే అతనికి రాజకీయం నేర్పించి. అమెరికా పంపించి, నా పలుకుబడితో అతన్ని అమెరికాకి సర్పంచుని చేశాను. ఆ తరువాత అతనికి న్యూయార్కును సొంత డబ్బుతో కట్టించి ఇచ్చాను. ఆ తరువాత హిట్లరును జర్మన్ ఛాన్స్‌లర్ చేసింది నేనే! స్టాలిన్ ను చిన్నప్పుడు లాగి లెంపకాయ కొట్టిందీ నేనే! ఆ తరువాత అలెక్జాండర్‌కు కత్తి యుధ్ధం నేనే నేర్పాను. కుషాణులకు, హూణులకు, నేనే మంత్రిని. రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం నేనే రచించి "కాళిదాసు" అనే కలంపేరుతో తాటాకులమీద అచ్చోయించాను. మహమ్మదు ముందు నిలబడిన జిబ్రాయేలును నేనే! యేసును శిలువ మీదుండగా మేకులు తీసి, అతణ్ణి స్వర్గానికి పంపించడానికి ఫ్లైట్ టిక్కట్టుకు డబ్బులిచ్చిందీ నేనే! కృష్ణుడికి సాంఖ్యశాస్త్రంలో డౌట్లుంటే నన్ను అర్ధరాత్రి అపరాత్రి అనే తేడాలేకుండా కాల్‌చేసి చంపేవాడు. అతనికి భ్గవద్గీత నేర్పేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది.
- మా మహానాన్న మాజీ సర్పంచ్. నేను మారధాన్ రన్నర్‌ని. ముద్దులెట్టడంలో నాకు నేనే సాటి.
కావున పై అర్హతలున్న నేను ఈసీ తరఫున అభ్యర్ధిగా నామినేషన్ వేయుటకు సంకల్పించుచున్నాడను. మీరు మీ అనుమతితోపాటు, నామినేషన్ పేపర్లుకూడా పంపించగలరు.
భవదీయుడు