Wednesday, May 29, 2019

Streisand Effect

Image result for streisand effect
2003లో సాగరతీరక్షయాన్ని అధ్యయనం చెయ్యడానికని ఒక ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా ఒకాయన కాలిఫోర్నియా తీరాన్ని ఫోటోలు తీసుండగా, అందులో కొన్ని ఫోటోల్లో బార్బరా స్ట్రైసాన్‌డ్ అనబడే ఒకావిడ విల్లా ఫోటోల్లో పడిందట. ఆవిడ ఆఫోటోల్ని ఇంటర్నెట్నుంచి తొలగించడానికి లాయర్లద్వార చేసిన ప్రయత్నాల నేపధ్యంలో ఎక్కువమదికి ఆ విల్లా విషయం తెలిసి, ఎక్కువమంది ఆ విల్లా ఫోటోల్ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ విల్ల గురించి తెలుసుకొని తరించారట. ఒకవిషయమ్మీద నిషేధాలు, అడ్డుకట్టలు ఆ ఉద్దేశితస్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసి "ఎందుకు నిషేధించాంరా బాబోయ్" అని తలపట్టుకొనేలాచేసే పరిస్థితినే Streisand Effect అంటారు. "ఎక్కడికైనా వెళ్ళుగానీ, ఆ ఉత్తరం దిక్కునున్న గదిలోకి మాత్రం వెళ్ళొద్దు రాకుమారా!" అంటే వాడు అక్కడికే వెళతాడు కదా అలాగన్నమాట.


దీనిక్కొన్ని ఉదాహరణలు :

యమ్మెఫ్ హుస్సేన్ పెయింటింగులు.  భారతీయుల్లో పెయింటింగుల్ని పట్టించుకొనేది మహాఉంటే ఒక ఐదు శాతమ్మంది. నిజ్జంగా హిందూ సమాజాలవాళ్ళు ఎమ్మెఫ్ హుస్సేన్ పెయింటింగుల్ని అలా వదిలేసి ఉంటే వాటిల్ని ఎవ్వరూ పట్టించుకొనుండేవారు కాదు. వీళ్ళు నానా రభసాచేసి చివరకు ప్రతొక్కళ్ళూ వాటిని చూసే స్థితికి తీసుకొచ్చారు. వాటికి ఎనలేని publicity కల్పించారు. (Ofcourse ఆయా సంస్థల ఉద్దేశ్యం జనాల సోకాల్డు మనోభావాల్ని గాయపరచడం అది వేరే విషయం.) ఇలాంటి తింగరితనమే మహమ్మద్ కార్టూన్ల విషయంలోనూ చూడొచ్చు. ఛార్లీ హెబ్డో పత్రిక ఒక అనామక పత్రిక. వాళ్ళేదో ఒక కార్టూనేస్తే, దానికిగానూ  నానా రభసచేసి ప్రపంచమ్మొత్తం చూసేలాచేసి, ఆ పత్రిక సర్క్యులేషన్ పెరిగేంతవరకూ ఊరుకోలేదు. అంతటితో ఆగక పత్రిక కార్యాలయమ్మీద దాడి జరిపి, Je suis Charlie  ఉద్యమానికి కారణమై మొత్తం ముస్లిముల సహనశీలతనే ప్రశ్నించేలా చేశారు. ఇదే విషయం Satanic Verses విషయంలోకూడా చూడొచ్చు. బ్రిటన్లో ఎవరో ఒక రచయిత (Salman Rushdie) రాస్తే ఇరాన్లోని ఖొమైనీకి ఎందుకు? ఆయనిచ్చిన వెధవ ఫత్వాతో పుస్తకం అమ్మకాలు జోరందుకున్నాయ్.

ఉడతా పంజాబ్. దేశంలో పంజాబీ సినిమాలు చూసేది ఎంతమంది? పంకజ్ నెహలానీ గారి అపారమైన కృపవల్ల, ఆ సినిమా విపరీతంగా పాపులరైపోయి, సౌతులోకూడా subtitles వేసుకొని మరీ చూశారు.

Piratebay incident. ఒకానొక శుభదినాన UKలోని ఒక హైకోర్టు piratebay వాళ్ళ వెబ్‌సైటును అలాగైనా ఆపాలని, కొన్ని ISP లకు లేఖలు రాసిందట. ఫలితంగా pairatebay వెబ్సైటుని వీక్షించేవాళ్ల సంఖ్య మరొక పన్నెండు మిలియన్లు పెరిగిందట.

Chen Guangcheng incident. చైనాలో Chen Guangcheng అనబడే ఒక గుడ్డివాడు, మానవహక్కుల ఉద్యమకారుడు ఐన  లాయరును, చైనా ప్రభుత్వం ఏడేళ్ళు హౌసరెస్ట్ చేసి వేధించిందట. అయన అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులు, #FreeCGC అనే హ్యాష్‌టాగ్ని పాపులర్ చేశారు. చైనా ప్రభుత్వం ఆ హ్యాష్‌టాగ్‌ని సెన్సార్ చెయ్యడం మొదలుపెట్టింది. దానికి counterగా ఉద్యమకారులు ఆయన ఫోటోలను సోషల్ మీడీయాలో షేర్ చెయ్యమని కోరడంతో, ప్రజల్లో ఇది మరింతగా చొచ్చుకుపోయింది. ఇదిలా ఉండగా CGCగారు సెక్యూరిటీ గార్డుల కళ్ళుగప్పు గృహనిర్బంధమ్నుంచి తప్పించుకున్నారు!! ఇక చైనా ప్రభుత్వం C,G,C అక్షరాలనీ, లాయరు పేరునీ, ఫోటోల్నీ సెన్సార్ చెయ్యడం మొదలుపెట్టింది. ఉద్యమకారులు memesని వాడుకోవడం మొదలుపెట్టారు. లాయరుగారు తప్పించుకోవడాన్ని Schawshank Redemption సినిమాలో హీరోగారు జైలునుంచు తప్పించుకోవడంతో పోల్చుతూ, Schawshank Redemption పేరుని పాపులర్ చేసిపడేశారు.

Image result for winnie the poohKim Jong Un incident. ఉత్తరకొరియా రాజుగారు (పోనీ అధ్యక్షుడుగారు) ఒకానొకరోజున చైనాను సందర్శించారు. న్యూస్ పేపర్లకు రిలీజైన ఆయన ఫోటోల్లో ఆయన కొంచెం లావైనట్లు కనిపించారట. ఎవరో ఏదో ఒక ఫోరంలో చర్చిస్తుంటే, చైనా ప్రభుత్వం యధాప్రకారం సెన్సార్ చేసింది. దాంతో చిర్రెత్తిన చైనీస్ పౌరులు కొందరు Kim Jong Un కే fatman అని ముద్దుపేరు పెట్టి, ఆయన గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. చైనా ప్రభుత్వం దాన్నీ నిషేధించింది. చర్చారాయుళ్ళు double-moon అనీ OO అనీ ముద్దుపేర్లు తెరపైకి తీసుకొచ్చారు. చైనా వాటినీ నిషేధించింది. ప్రస్తుతానికి చైనాలో ఉత్తరకొరియా అధ్యక్షుడిపేరు Winnie The Pooh. Winnie The Pooh కార్టూన్లు ఉత్తరకొరియాలో నిషిధ్ధం అని ఎక్కడొ చదివినట్లు గుర్తు.

దేవుడు భూమ్యాకాశములను సృష్టించాడు. Adam, Eve లనుకూడా సృష్టించాడు. జ్ఞావృక్షానికి కనీసం కాపలాకూడా లేనప్పుడు నోర్మూసుక్కూర్చోవచ్చుకదా! "మీరు ఏ చెట్టుపళ్ళైనా తినండి కానీ, ఆ వొక్క చెట్టుపళ్ళను ఒగ్గెయ్యండి" అని కూయడం దేనికి?