Friday, May 24, 2019

జనసేన - క్లీన్ పాలిటిక్సూ - ఎట్సెట్రా!

Image result for janasEna
చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం చేయడానికి కనీసం మూడేళ్ళముందే, చిరంజీవి అనవసరం అంటూ అప్పట్లో నేను అభిప్రాయపడ్డాను. అప్పట్లో ఎవరైనా పవన్ కల్యాణ్ రాజకీయరంగ ప్రవేశం అన్నట్లైతే నేను ఖచ్చితంగా సమర్ధించుండేవాణ్ణి. అప్పట్లో పవన్ గురించి కేవలం మంచివిషయాలు మాత్రమే నాకు తెలుసు అంతర్ముఖుడనీ, పుస్తక ప్రియుడనీ, ముక్కుసూటి మనస్తత్వమనీ మాత్రమే తెలుసు. శ్రీజ పెళ్ళి విషయం, ప్రజారాజ్యం పార్టీపెట్టినప్పుడు చేసిన ఓవరాక్షన్, ఆయన స్పీచ్చిలు, ఇజం పుస్తకంలో ఆయన కోసిన కోతల నేపధ్యంలో నా అభిప్రాయం మార్చుకున్నాను.

నాకు తెలిసినంత వరకూ పవన్ కారణాల్ని ఇలా విశ్లేషిస్తున్నాను.

అవగాహనా లేమి: చిరంజీవి, పవన్ల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్లకి స్థానిక సమస్యలమీద గానీ, రాష్ట్ర సమస్యలమీదగానీ లేశమంతైనా అవగాహాన లేదు. పవన్ ఐతే అసలు సమస్యలని వదిలేసి ఎక్కడా లేని ఉత్తర-దక్షణవిబేధాలు, తెలంగాణా-ఆంధ్ర ప్రజలమధ్య గొడవలూ అంటూ అర్ధంలేని వాగుళ్ళు వాగాడు. ఈతన అంతగా పోలేరమ్మ కేకలు వెయ్యాలనుకుంటే ఉన్న సమస్యలమీద వెయ్యాల్సింది. కొన్ని విషయాలమీద కొద్దిపాటి అరుపులు వేసినా, అది మీడియా కవరింగ్ కోసమే. ఒక్కటంటే ఒక్క సమస్యను చివరిదాకా follow-upచేసి, సాల్వ్ అయ్యేలా చూసింది లేదు. ఈయన ఉపన్యాసాల్లోకూడా ఈయన చిన్నప్పటి లీలలు, యోగాలు, యుధ్ధవిద్యలు, తాను చదివానని చెప్పుకొనే పుస్తకాలు, తెచ్చుకున్న కోపాలు, సినిమా డైలాగులేతప్ప విధాన నిర్ణయాలుకానీ, సమస్యల గురించిగానీ, వాటి పరిష్కార మార్గాలగురించికానీ మాట్లాడిన పాపాన పోలేదు. ఒఠ్ఠి స్వోత్కర్ష!! ఐదేళ్ళలో కనీసం వివిధ పార్టీల వార్తాపత్రికలు (పేపర్లు) చదివినా, జనాలతో మాట్లాడినా విషయపరిజ్ఞానం పెరిగేది. ఐదేళ్ళూ సినిమాలూ, చంద్రబాబు భజనలూ, ఫోటోషూట్లతో ఏదో ఉధ్ధరించే పోజుల్లో ఫోటోలు. విషయంలేనప్పుడు ఇవన్నీ పనిచెయ్యవుసార్! ఏ సొల్లుకబుర్లు చెప్పినా మన కులపోళ్లకు చఖ్ఖగానే ఉంటాయ్. వాళ్ళు దేవుడువీ, నాయకుడివీ అని చంకలు నాకుతూనే ఉంటారు. మిగతా వాళ్ళుకూడా మనబాట పట్టాలంటే బుర్రలో గుజ్జున్నమాటలు మాట్లాడాలి.

నిజాయితీ లేకపోవడం : జయప్రకాష్ నారాయణ్ దగ్గరినుండి, అన్నా హజారే వరకూ అధికార పక్షంపైన పోరాడారు. ఈ పృఛ్ఛకుడు మాత్రం ప్రతిపక్షాన్ని ప్రశ్నించాడు. అధికారపక్షంతో  లాలూచీ పడ్డాడు. ఎన్నికల నామినేషన్ మొదలయ్యక ఒక్క చిన్న విమర్శకూడా అధికారపక్షనాయకుడిపైనా, వారి ముద్దుబిడ్డ, మేధావీ ఐన లోకేష్ మిద చెయ్యలేదు. బాబుకి భయపడ్డాడో, అమ్ముడుపోయాడో ఆయనకే తెలవాలి. ముస్లిములమీద వివక్షచూపిస్తున్నందుగ్గానూ తనకు అమెరికా గడ్డంటే ఏహ్యభావముందని, దానికి తన పాదాలు తాకించననీ అన్నాడు. ఆనక అమెరికా వెళ్ళాడు. వెళ్ళి, డబ్బులకోసం కాదు, అభిమానుల్ని కలవడంకోసం వచ్చానన్నాడు. వారి అభిమానసంఘాలవాళ్ళేమో డబ్బులు విరాళాలు సేకరిస్తూ కేమెరాకు దొరికారు. కాస్ట్‌లెస్ పాలిటిక్సన్నాడు. కాపు కులస్తులున్నారని భీమవరం, గాజువాకల్లో పోటీచేశాడు (అక్కడ గెలిస్తే గెలుపుసాధ్యమని సర్వేలు ఘోషిస్తున్నయ్ అని ఈయనే అన్నాడు). నీతివంత మైన పాలిటిక్స్ అన్నాడు. అవినీతి ఆరోపణలున్నవారికి సీట్లిచ్చాడు. జగన్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నాడన్న నోటితోనే నాగబాబుకి ఎంపీ సీటిచ్చాడు. నాగబాబు పవన్‌కంటే అజ్ఞాని, కుసంస్కారి.

అభిమానులు: పవన్, బాలయ్యల అభిమానులు రౌడీ వెధవలు, సంస్కార హీనులు, జులాయిగాళ్ళూనూ. అందునా కులాల ఆధారంగా అభిమానించే కాలంలో మనం ఉన్నాంకాబట్టి అదొకటుంటుందిక్కడ మళ్ళీ. పవన్ అభిమానుల్లో చదువుకున్నోళ్ళు, రాజకీయం అంటే అవగాహనున్నోళ్ళూ, లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశమైనా వాళ్ళ రౌడీ వేషాలుమాత్రం కొంపముంచాయి. కత్తి మహేష్ విషయంలోకానీ, రేణూ దేశాయ్ విషయంలోగానీ,. అలీ విషయంలోగానీ వీళ్ళ ప్రవర్తన అత్యంత అమానవీయం. రేణూ దేశాయ్ విషంలోనైతే ఆమె పెళ్ళిచేసుకుంటే వీళ్లకేంపోయిందో అర్ధంకాలేదు. ఒక అభిమాన దరిద్రుడైతే రేణూ దేశాయ్‌కి సతీసహగమనం చెయ్యమని సలహా ఇచ్చాడు (ఆ సలహ ఇచ్చిన వెధవకి "సతీసహగమనం" అంటే అర్ధం తెలిసుంటుందని నేననుకోను). ఒక్క సందర్భంలోనూ పవన్ కల్యాణ్ అభిమానులను మందలించి, అదుపులో పెట్టింది లేదు. అదే విరాట్ కోహ్లీని చూసినట్లైటే కొన్ని పదులసార్లు అనుష్కని defend చేశాడు. "నేనాడలేక పోవడానికి మా బ్రేకప్‌కీ సంబంధమేమిటి? ఆవిణ్ణి ఇందులోకి లాగవద్దు" అని పదులసార్లు చెప్పాడు. రేణూ దేశాయ్ పాపం ఎన్నోసార్లు వాపోయింది ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారు ఈ అభిమాన తీవ్రవాదులు అని. పవన్ కనీసం పట్టించుకున్న పాపాన్ పోలేదు. ప్రజారాజ్యంరోజుల్లో సినీనటుడు రాజశేఖర్‌ని వెంటాడి కొట్టినప్పుడే అభిమానులకి నిర్ద్వందంగా "ఇది పనికిమాలిన పని" అని చెప్పుండాల్సింది. ఐనా ఈ అభిమానుల్లో కులాభిమానులు, సినిమా అభిమానులు తప్ప పవన్ పాలసీలు నచ్చి అభిమానించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే పవన్‌కు పాలసీలే లేవుకాబట్టి. ఈ అభిమానులు పవన్‌కీ పట్టిన శని. వీళ్ళకంటే సూటిగా విమర్శించి, అవసరమైతే చెవి మెలేసేవాళ్ళను దగ్గరగా ఉంచుకోవడమ్మేలు. Fans like these cause idealogical noise and severely cloud one's senses there by one fails to see the matters clearly.

ప్రసుతానికి ఈ పోరంబోకుల చైతన్యం, ఉన్మాదంలోకి తిరిగి, ఈ క్రింది విధంగా సోషల్‌మీడియాలో బైటపడుతోంది :

No photo description available.Image may contain: textNo photo description available.No photo description available.Image may contain: 1 person

క్యాడర్: అంటే క్యాడర్ లేకపోవడం. ఎన్నికల ముందు కొద్ది నెలలవరకూ జనసేనలో ఎవరు పోటీచేస్తారో, పవన్ గాక ఇంకెవరున్నారో ఎవరికైనా తెలుసా? అసలు పవన్ ఎక్కడనుంచి పోటీసేస్తున్నాడోనైనా తెలుసా? ఇదిగాక మళ్ళీ బీయస్పీ అంట. అదెందుకు స్వామీ? కమ్యూనిస్టులతో వ్యవహారం ఇంకో ప్రహసనం. ఇదిగాక అభిమానుల్లోనే గుంపులూ, అందులో మళ్ళీ గొడవలు, వీళ్ళంతా సోషల్ మీడియాలో కుమ్మసుద్దంగా తన్నుకోవడం, రాజీపడడం, ఇదంతా మనంచూసి తరించడం. అభిమానులకు టికెట్లు రావాలంటే పరీక్షలు రాయాలీ? పార్టీలు ఫిరాయించేవారికి మాత్రం పిలిచి సీటిస్తారూ? ఇవన్నీకాక అవినీతి పరులకు సీట్లివ్వడం ఇంకొకటి.


ఇప్పుడు తీరా ఓడిన తరువాత జనసేనవాళ్ళు "మేము క్లీను పాలిటిక్సు చేశాం. డబ్బులు, సారా పంచలేదు. కాబట్టే ఓడినా మాకు ఆనందంగానే ఉంది" అనడం లోకవంచన అంతకుమించి ఆత్మవంచన. లోకేశ్ నియోజకవర్గంలో ఓటుకు పదివేలు పంచారని వార్తలొచ్చాయ్ ఐనప్పటికీ లోకేశుడు ఓడాడు. అయినా జనసేన అభ్యర్ధులు డబ్బులు పంచలేదని ఎవరు చెప్పారు? కులరాజకీయాల్ని క్లీన్‌పాలిటిక్సన్నది ఎవర్రాబాబూ? ఓటమికి కారణాలుకూడా నిజాయితీగా విశ్లేషించుకోకపోతే మరోసారి ఇదే "విజయం" తప్పదు. అవుగానీ రాజోల్లో గెలిచినతనికి కల్యాణ్ బాబుగారు శుభాకాంక్షలు తెలిపారా? గెలిచినతనికులం కాపు కాదుకాబట్టి "అఖ్ఖర్లేద"నుకున్నారా?