
బాబు గారు: తిక్క కుదిరింది. రాష్ట్రం ఈయన బాబుగారి జాగీరులా ఫీలయ్యాడు. చింతమనేని లాంటి రౌడీ వెధవలు అచ్చోసిన ఆంబోతుల్లా జనాలమీద పడుతుంటే చూస్తూ కూచున్నాడు. ఇంకొకడెవడో ఒక MP ఉండేవాడు. కోతివెషాలు, కొజ్జావేషాలు వేసుకొని పార్లమెంటులో తిరిగేవాడు. ఇలాంటి వెధవల్ని వెంటేసుకు తిరిగినందుకు ఇలా అవడం సరైనదే. మాట నిలకడ లేకపోవడం, విపరీతమైన అవినీతి, పీక్స్‌కు చేరుకున్న కులతత్వం, కులపత్రికల వెఱ్ఱి వాగుళ్ళు, జనాలను పిచ్చివాళ్ళకింద లెఖ్ఖగట్టి తను ఇష్టారాజ్యం వెలగబెట్టడం (ప్రభుత్వ డబ్బుతో వోట్లు కొనడం చంద్రబాబుకి తట్టిన ప్రమాదకరమైన మరియు నీచమైన ఉపాయం) ఇవీ బాబుగారి ప్రస్తుత గతికి కారణాలు. అసలు ఇతనేనా 1997 సమయంలో హైదరబాదును తీర్చిదిద్ద ప్రయత్నించింది, ఐటీ విషయంలో బెంగుళూరుతో పోటీపడింది అనిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని విమర్శించిన ఈ ఘనుడు తనదాకా వచ్చేసరికి లోకేష్‌ను ఎమ్మెల్సీగా దొడ్డిదారిన మంత్రిని చేశాడు. వాడి చేతిలో తెదెపా పరిస్థితి రాహుల్ చేతిలో కాంగ్రెస్ కంటే దరిద్రంగా ఉండబోతోంది. ఇంతటితో తెదేపా మటాష్. ఇప్పుడు జగన్ కనుక తలుచుకొంటే బాబుగారిచేత జైలు ఊచలు లెక్కపెట్టించ గలడు. అన్నట్లు దివ్యవాణి చెప్పాలిప్పుడు తాము ఓడిపోవడంకూడా ప్రభుకృపేనా అని. బాలకృష్ణలాంటి రౌడీ వెధవ గెలవడం విచారకరం.
భళ్ళుమంది బాసూ... గలాసు: ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్నగారు ఒకచోటైనా గెలిచారు. తమ్ములుంగారు రెండుచోట్లా పంచెలూడగొట్టుకోవడం ఖాయమనిపిస్తుంది. అంతకంటే అవమానమేమిటంటే, అధ్యక్షుడిగా తనుఓడినా తన పార్టీలో ఇంకొకరు గెలవడం. ఐదేళ్లలో పార్టీని బలోపేతం చెయ్యొచ్చు, మరీ లక్షకాకపోయినా కొన్ని వందలపుస్తకాలు చదివొచ్చు, చదివి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు (కనీసం వార్తాపత్రికలు చదవొచ్చు) అలా చేస్తే ఈయన్ని పవన్ అని ఎందుకంటారు? సినిమాలు తీసుకున్నాడు, బాబుతో కలిసి డ్రామాలాడాడు, ప్రశ్నించడానికొచ్చానని చెప్పుకున్న ఘనుడు ప్రతిపక్షాన్ని ప్రశ్నించినాడు. ఒక్క సమస్యని చివరిదాకా pursue చేసింది లేదు అసలు సమస్యల్ని పట్టించుకున్నదే లేదు. అభిమానుల్ని అదుపులో పెట్టుకోలేనివాడు, నోటిని అదుపులో పెట్టుకోలేనివాడు, కనీసం ఒక విషయాన్ని వివరించి చెప్పలేనివాడు నాయకుడిగా ఎలా పనికొస్తాడు. This guy totally deserves this shameful defeat. పాతికేళ్ళు రాజకీయాలు చేస్తావా సుందరాంగా? అంతటి దీక్ష, అంకితభావమూ ఉన్నాయానీకు?
జగన్: జగన్ మీద నాకు ఎలాంటి ఆశలూ లేవు. కేవలం ఈయన చేసిన వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నం చేసినా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతుంది. పదేళ్ళు అధికారం కోసం ఎదురుచూసి, పార్టీని పధ్ధతిగా బలోపేతం చేసుకొని పవన్ లాంటి మాటల మనిషిని కాదని ఋజువుచేశాడు. దక్కిన అధికారం తనలో అహంకారాన్ని పెంచకూడదని, పచ్చ మీడియా అంతుచూడాలనీ, బాబుగారి అవినీతిపై విచారణ జరపాలనీ కోరుకుంటున్నాను. జగన్ హయంలో అవినీతి ఉండదనీ, కమ్మకులం ఆధిపత్యం పోయినతరువాత రెడ్డికులం ఆధిపత్యం రాదనీ, కులరహిత, ఆదర్శ సమాజం పరిఢవిల్లుతుందనీ అనుకోవడానికి నేనేమీ భంగో, బ్రాందీయో సేవించి లేను.