Friday, April 28, 2023

On The Basis Of Sex

 


Charles Moritz అనే ఒకాయన 'నేను మా అమ్మకి care giver కాబట్టి, ఆ care giverలకి income taxలో ఇచ్చే వెసులుబాటు నాకూ ఇవ్వాలి' అంటాడు. 'చట్టము care giver అంటే అది మహిళ అనిచెబుతుంది, నీకివ్వంపో' అనంటారు income taxవాళ్ళు. సినిమా ఇక్కడ మొదలవుతుంది. విషయం తెలిసిన Ruth Bader Ginsburg అనే ఒక లా ప్రొఫెసరు Charles Moritz దగ్గరికి వెళ్ళి 'నీకేసు నేనువాదిస్తాను'అంటుంది. ఆవిడ అప్పటికే ఈ వివక్షను చవిచూచిఉంటుంది. ఈ వాదించే క్రమంలో ఆవిడకు వందలకొద్దీ చట్టాలు వివక్షాభరితాలే అని తెలుసుకుంటుంది. ఈవిడదగ్గర నల్లకోటొకటుంది కాబట్టి, దాంతో ఈ చట్టాలన్నింటికీ ఉరిబిగించాలని నిర్ణయించుకొని, అందులో సఫలీకృతురాలౌతుంది. క్లుప్తంగా ఇదీ కధ. 


చివరి కోర్టు సీనులో డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. ఒకచోట జడ్జిగారు 'మహిళలకోసం చట్టాలు మార్చమంటున్నావు. అసలు రాజ్యాంగంలో ఒక్కచోటకూడా మహిళ అన్నపదం రాదు' అనంటే. Ruth Bader Ginsburg 'స్వాతంత్ర్యం అనికూడా ఒక్కసారికూడా రాదండి' అనంటుంది. చివరికి ఒకానొక మహిళాజడ్జి ఇలా అంటుంది I don't ask men to do a favour to the people of my sex but I ask them to take their foot off their necks. Ruth దయవల్ల ఆచట్టాలన్నీ తిరగదోడారంట.


ఈవిడే Ruth Bader Ginsburg. Ruth Bader Ginsburgలా Felicity Jones అదరగొట్టింది.