
ధనుంజయ్ ఛటర్జీ సునంద అపార్ట్మెంట్స్‌లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుండేవాడు. అతను అదే అపార్త్మెంట్‌లోని మూడో అంతస్తులో ఉంటున్న పరెఖ్ ఫామిలీకి చెందిన హేతల్ పరేఖ్ అనే పేరున్న పధ్నాలుగేళ్ళ అమ్మాయిని వేధిస్తున్నాడనే కారణంచేత అతణ్ణి సునంద అపార్ట్మెంట్స్ నుంచి బదిలీ చెయ్యవలసిందిగా అపార్ట్మెంట్ అస్సొసియేషన్ చైర్మన్ ఐన అమ్మాయి తండ్రి కోరడంతో ధనుంజయ్‌ని వెరే అపార్ట్మెంట్‌కి 1990 మార్చి నాలుగున బదిలీ చేసేశారు. ఐనప్పటికీ ధనుంజయ్ మార్చి ఐదో తారీఖున హేతల్ ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరకే తన విధులు నిర్వర్తించడానికి వెళ్ళాడు. ఆరోజు హేతల్ తన పదవ తరగతి పరీక్షలు ముగించుకొని మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి చేరుకుంది. సాయంత్రం హేతల్ వాళ్ళమ్మ దగ్గర్లోని గుడికి హారతి అందుకోవడానికి సాయంత్రం 5:20 నిమిషాలకు ఇంటినుండు బయలుదేరింది దాదాపు 5:30 నిమిషాలకు ఏదో ఏజెన్సీక్ ఫోనుచెయ్యాలన్న వంకతో హేతల్ అపార్ట్మెంట్‌కి వెళ్ళిన ధనుంజయ్ అక్కడ ఇంట్లో హేతల్ ఒంటరిగా కనబడడంతో, హేతల్ తండ్రిమీద తనకున్న పగను హేతల్ మీద తీర్చుకున్నాడు. ఆమెను దారుణంగా కొట్టి, పీకనులిమి చంపేసి, ఆపైన అత్యాచారంచేసి అక్కడినుండి పారిపోయాడు. హారతి కార్యక్రమం ముగిశాక అదే సాయంత్రం 5:50 నిమిషాలకు ఇంటికి చేరుకున్న హేతల్ వాళ్ళమ్మ డోర్‌బెల్ కొట్టినా తనకుమార్తె తలుపుతీయకపోవడంతో ఆందోళనకు గురైన ఆ తల్లి ఇరుగుపొరుగు సహాయంతో తలుపు బ్రద్దలుకొట్టి లోపలకు వెళ్ళగా... అక్కడ అర్ధనగ్నంగా నేలమీద పడున్న కూతురి దేహన్ని చూసి నిలువెల్లా వణికిపోయింది. వెంటనే ఆవిడ ధనుంజయ్ కోసం వెదికింది. ధనుంజయ్ జాడలేడు. తనకూతురి దేహాన్ని బట్టల్లో చుట్టి తనచేతులతో ఎత్తిపట్టుకొని, లిఫ్ట్‌లో కిందకు తీసుకెళ్ళి, డాక్టరు హేతల్ చనిపోయిందని ప్రకటించాక అదే లిఫ్టులో ఏడుస్తూ కూర్చుంది. వెంటనే పోలీసులుకూడా ధనుంజయ్ కోసం వెదికి కొన్నాళ్ళతరువాత పట్టేసుకున్నారు. కూడా తను అత్యాచారం చేసినప్పుడు ధరించిన చొక్కాని, హేతల్‌తో పెనుగులాడినప్పుడు ఊడిపోయిన చొక్కా గుండీని, అత్యాచారం తరువాత తను హేతల్ పరేఖ్ ఫ్యామిలీ అపార్ట్మెంట్ నుండి దొంగిలించిన రిస్టువాచీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకొనేలోగా ధనుంజయ్ అనామకంగా రూర్కెల్లాలో కొన్నాళ్ళు పనిచేసినట్లు పోలీసులు కనుగొని, అన్ని ఆధారాలనూ కోర్టుకు సమర్పించడంతో మొత్తానికి ఈ దుర్మార్గుడికి 2004 పంద్రాగస్టున ఉరిశిక్ష విధించబడింది. న్యాయం జరిగేలా చూడడంలో పోలీసులు, మీడియా, అప్పటి ముఖ్యమంత్రి బుధ్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య బాగా కృషిచేశారు. న్యాయం రక్షించబడింది.
ఇదీ మొత్తం కధ. ఇప్పుడు అసలు విషయాలకొస్తే:
- హేతల్ వయసు చనిపోయినప్పుడు పద్నాలుగు కాదు. పద్దెనిమిది.
- హేతల్ అత్యాచారానికి గురవ్వలేదు. తను sexలో పాల్గొంది. అదీ పరస్పర అంగీకారంతోనే. ఆమె vaginal swab తీసుకున్న ఫోరెన్సిక్ నిపుణులు ఆమె యోనిలో వీర్యస్ఖలనం జరగలేదు. అది యోని బయట అమె pubic hair మీద జరిగింది అని చెప్పారు (సాధారణంగా అత్యాచారం కేసులో ఇలా జరగదు). హేతల్ sexలో పాల్గొన్నది ధనుంజయ్‌తోనే అనడానికీ ఆధారాలు లేవు. ఆమెకో boy friend ఉండుండొచ్చు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో DNA అనాలసిస్ ఊసేలేదు.
- ఫోరెన్సిక్ నిపుణులుకూడా ఆమె raptured hymenని పరిశీలించి ఆమె 'sexial act'కు గురైంది అని చెప్పారేగానీ, 'rape' అన్న పదం ఎక్కడా వాడలేదు. ధనుంజయ్ pubic hair, హేతల్ pubic regonలో లభించలేదు (ఇదికూడా జరిగింది అత్యాచారం కాదన్న విషయాన్ని ఋజువుచేస్తుంది).
- హేతల్ వంటిమీద 21 గాయాలను ఫోరెన్సిక్ నిపుణులు గురించారు. అవన్నీ ఎక్కువభాగం ముఖమ్మీద ఉండగా, రెండు మాత్రం ఆమె వీపుపై ఉన్నాయ్ (అత్యాచారం కేసులోలాగా జననాంగాలపైన, lower part of the body పైన గాయాల్లేవు). హేతల్ గోళ్ళలో ఎవరి చర్మమో, ఇంకెవరి రక్తమో లేదు. అంటే ఆమె తనమీద జరుగుతున్న 'అత్యాచారం'ని ప్రతిఘటించలేదు.
- ధనుంజయ్ ఛటర్జీ మీద ఈ వేధింపు ఆరోపణలేమీ లేవు. అసలతన్ని అపార్ట్మెంట్‌నుంచి బదిలీ చేసిన ఉత్తర్వు హత్య జరిగిన తరువాత, ధనుంజయ్ పారిపోయిన మూణ్ణెల్ల తరువాత తయారుచేయబడింది. వేధింపు ఫిర్యాదూ అప్పటిదే! పైగా అందులో "ధనుంజయ్ మా అమ్మాయిని వేధించేవాడు" అంటూ past tenseలో రాశారు.
- కేవలం ఇరవై నిమిషాల్లో హేతల్‌ని చంపేసి, అత్యాచారంకూడా చేసి, చొక్కాకి చెమట, రక్తము అంటకుండా తాపీగా నడుచుకువెళ్ళడం సాధ్యమేకాదు. అతను నేరం చేశాక చొక్కా మార్చుకున్నాడు అనుకున్నా, నేరం జరిగిన సమయంలో తను ధరించిన చొక్కాను పోలీసులచేతికి చిక్కేదాకా తనవద్దే భద్రంగా ఎందుకు దాచుకున్నాడో తెలీదు. బహుశా పోలీసులొస్తే మరో సాక్ష్యం అందించడానికయ్యుండొచ్చు!
- నేరం తరువాత రూర్కెల్లాతోబాటు ఇంకోచోట పనిచేసినా రిస్టువాచీని అమ్మేయలేదు. పోలీసులకోసం ఎదురుచూస్తూ కూచున్నాడు.
- తలుపు బ్రద్దలు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇచ్చిన స్టేట్‌మెంట్లు సరిపోలలేదు. తల్లేమో హేతల్ పైభాగంలో నగ్నంగా ఉంది అంటే, పొరుగువారు, ఫోరెన్సిక్ వారు, హేతల్ ఒక్క ప్యాంటీ తప్ప అన్నీ వేసుకొనే ఉంది అని చెప్పారు. పోలీసులేమో పూర్తి నగ్నంగా పడి ఉంది అని రాసుకున్నారు.
- ధనుంజయ్ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళాడు అని చెప్పబడుతున్న సమయంలో ధనుంజయ్ లోపలికి వెళుతుండగా చూసినవాళ్ళు లేరు. అతనా సమయంలో ground floorలో డ్యూటీ చేస్తున్నాడు.
- హేతల్ వాళ్లమ్మ ఇంటికి తిరిగొచ్చిన సమయం, బయటకెళ్ళిన సమయం విషయంలో స్టేట్‌మెంట్లు మార్చబడ్డాయ్. అసలు హెతల్ ఇంటికి తిరిగొచ్చిందికూడా మధ్యాహ్నం ఒంటిగంటకు కాదు, రెండు గంటలకు.
- హేతల్ కడుపులో ఇంకా జీర్ణంకాని ఆహారం ఆధారంగా ఆమె మరణం మూడునుండి నాలుగు గంటలమధ్య జరిగిందని అర్ధమవుతుంది. హేతల్‌ని అమ్మ నాలుగ్గంటలకు బయటకు వెళ్ళడం చూసిన వాళ్ళున్నారుగానీ, 5:20కి బయటకు వెళ్ళడం చూసినవాళ్ళులేదు.
- హేతల్‌ని ఆసుపత్రికి తీసుకెళతానని చేతులమీదేసుకొని లిఫ్ట్‌లో క్రిందకు వెళ్ళిన హేతల్ వాళ్ళమ్మ లిఫ్టులోంచి కదిలింది లేదు. ఆమె ప్రకారం జరిగింది హత్య జరిగింది 5:20 నుంచి 5:50 మధ్యలో ఐతే పోలీసులకు కబురందింది తొమ్మిది గంటలకు.
- పోలీసులెమో తమకు రక్తంతో తడిసిన పేపర్ దొరికింది అని చెప్పారు. రిపోర్టుల్లో ఇది స్పాంజ్అని రాయబడింది. తీరా sniffer dogsకి వాసన చూపించింది రక్తంతో తడిసిన గుడ్డముక్కను.
- ధనుంజయ్‌ని ఊళ్ళో ఎక్కడ పట్టుకున్నారు అనే విషయంలో ధనుంజయ్‌ని పట్టుకున్న పోలీసుల మధ్యే భిన్నాభిప్రాయాలున్నాయ్. హత్య సమయంలో అతను ధరించాడని చెబుతున్న చొక్కాను అతనింట్లోని షెల్ఫులో స్వాధీన పరుచుకున్నట్లు పోలీసులు చెప్పారు. ధనుంజయ్ ఇంట్లో అసలు షెల్ఫులే లేవు.
- హేతల్ వాళ్ళమ్మ ఇంట్లో ఉన్నప్పుడే హేతల్ హత్య జరిగుంటుంది అన్నవిషయాన్ని కొట్టేసేందుకు ఆధారాలు లేవు. బట్టలు మార్చుకుంటున్నప్పుడు తనకూతురి ప్యాంటీపై రకపు మరకలు చూసిన హేతల్ తల్లే పట్టరాని కోపంతో హెతల్‌ను కొట్టి, పీకనులిమి చంపుడొచ్చు. బహుశా అందుకే హేతల్ ప్రతిఘటించలేదేమో!
- హేతల్ వాళ్ళమ్మను కోర్టు హాజరు కావలిసిందిగా అభ్యర్ధించినా ఆవిడ నిర్లక్ష్యం చేస్తూవచ్చింది. విసిగిపోయిన కోర్టు "ఇహ తప్పదు... రావలసిందే" అని ఆదేశిస్తేనే ఆవిడ కోర్టు ముందుకు వచ్చింది.
- హేతల్ కుటుంబం మొత్తం ఇది జరిగిన కొద్ది నెలల్లోనే ముంబయ్‌కి వెళ్ళిపోయారు. సాక్ష్యాలను మార్చడానికి తప్ప వాళ్ళు ఈ వ్యవహరంలో జోక్యం చేసుకోలేదు. పోలీసులుకూడా కేవలం తల్లిదండ్రులు చెప్పిన విషయాల ఆధారంగా పరిశోధించారేగానీ, వేరే కోణాలు అణ్వేషించే పని పెట్టుకోలేదు.
- తల్లిదండ్రులిచ్చిన FIR రిపోర్టు నిజానికి పోలీసులే తయరు చేశారనడానికీ, కోర్టుకు సమర్పించేముందు దాన్ని మార్చారనడానికీ ఆధారాలున్నయ్.
- ధనుంజయ్ లాయరు సమర్ధవంతుడే ఐనప్పటికీ అతనికిచ్చిన లాయరు ఫీజులతో అతను సంతృప్తుడు కాలేదు. సరైన సాక్షులు వాంగ్మూలం ఇచ్చిన దాఖలాలు లేవు. సాక్షుల cross examinationకూడా సరిగ్గా జరుగలేదు. లాయరుకి క్రితంరోజు కోర్టులో జరిగిన విషయాలే గుర్తుండేవి కావుట.
- ఒక ప్రక్క మీడియా, మరోప్రక్క గుజరాతీ ఓటుబ్యాంకును (హేతల్ కుటుంబం గుజరాత్ నుండి వచ్చి కోల్‌కోతాలో స్థిరపడిన ఒక కుటుంబం) కోల్పోరాదన్న దుగ్ధ జడ్జిలపై ఒత్తిడిని పెంచాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి భార్యే ధనుంజయ్‌కి శిక్షపడి తీరాల్సిందేనని ఉద్యమం మొదలుపెట్టింది.
కాబట్టి తెలుసుకోవలసిన విషయమేమిటంటే... డబ్బుబాగా ఉంటే circumstantial evidences ఆధారంగా శిక్షపడదు (గమనించుడు: సల్మాన్ ఖాన్ కేసు మరియు అఫ్జల్‌గురు కేసు. ముఖ్యముగా గమనించుడు: ఈ రెండు కేసుల్లో circumstantial evidence విషయంలో అభిప్రాయములు). ఒకవేళ పడినా కొంతకాలం శిక్ష అనుభవించాక నేరస్తుడు రాముడికంటే మంచిబాలుళ్ళా మారిపోయి, సత్ప్రవర్తనమీద బయటకు వచ్చేస్తాడు (గమనించుడు: జెస్సీకా లాల్ హత్యకేసు) అదీ కాకుంటే జైల్లో నుంచి ఎప్పుడుబడితే అప్పుడు బయటకు వచ్చి తన వ్యవహారాలు చక్కబెట్టుకొని, అవి తీరగానే జైల్లోకి వెళ్ళిపోయే సదుపయోగంకూడా ఉంటుంది న్యాయవ్యవస్థలో (గమనించుడు: సంజయ్‌దత్ కేసు). ఖర్మకొద్దీ నిందితుడు పేదవాడో, అవసరంలేని కులానికో, మతానికో చెందినవాడైతే అప్పుడు న్యాయవ్యవస్థ తన ప్రతాపం చూపించి, నేరం ఋజువుకాకపోయినా నేరస్తులకు గుణపాఠంలా పనిచేసే శిక్షలు విధించి సమాజాన్ని శాంతింపజేస్తుంది.
N.B. : Movie could be fond in Amazon Prime.