Friday, June 12, 2020

కరోనా, జ్యోతిష్యము, దైవము, ప్రభుత్వము, ప్రజలు

2020 నాటికి భారత్ అందరికంటే అన్నిరంగాల్లోనూ ముందుండాలని పెద్దాయన కలాం కోరుకొనేవారు. అన్నిరంగాలసంగతేమోగానీ కరోనా విషయంలో మాత్రం భారత్ అందరికంటే ముందుండడానికి అహరహం శ్రమిస్తోంది. 

ఆమధ్య కొందరు బడుధ్ధాయిలు అబ్బే ఇదంతా కాలసర్ప దోషంవల్ల కలిగే దుష్ప్రభావాలే మే నెల మూడో తారీఖుకల్లా అంతా సమసిపోతుంది, కేసులన్నీ తగ్గుముఖం పడతాయ్ అని కూశారు. ఇప్పుడువాళ్ళందరినీ పటుకొని కుమ్మసుద్దంగా కొట్టాలి. ఆతరువాత ఇంకా జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళందరూ తమనుతాము కొట్టుకోవాలి. ఇప్పటికీ జ్యోతిష్యం చెత్త అన్నవిషయం అర్ధం కాకపోతే ఇహ వాళ్ళనేమీ చెయ్యలేం! అన్నట్లు అమెరికాలో వాడెవడో గూట్లేగాడు యాగం చేసి, కరోనాను పారద్రోలాను అన్నాడు. ఎక్కడవాడు? ముందు వాణ్ణి పట్టుకొని కరోనా ఎక్కించి, ఇపుడు చెయ్యరా యాగం అనాలి. ఇలాంటి లఫంగి వెధవల్ని నమ్ముకున్నంతకాలం బ్రతుకులు బాగుపడవు.

ఆమధ్య చిలుకూరి బాలాజీ ప్రధాన పురోహితుడు "రాముడి దయవల్లే మన దేశం కరోనానుంచి సురక్షితంగా ఉంది" అని అన్నట్లు మీములు కనిపించాయ్ FBలో. ఇప్పుడేమైందో మరి రాముడి కృప. ఆమధ్య పోపుకూడా "కరోనా తొలగిపోవాలని నేను ప్రభువుతో మాట్లాడాను" అని అన్నాడట. ఆ తరువాత కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా ఇటలోలోనూ, ప్రపంచమ్మొత్తమూ పెరిగిపోవడం మనం చూశాం. కరోనా దెబ్బకి ఈసారి హజ్‌కి దారులు మూసేశారు. అంటే దేవుళ్ళే అన్నీ మూసుక్కూచున్నారు. ఇహ వీళ్ళు మనల్ని రక్షిస్తారు! రక్షించే పుడింగులు ఎందుకు రక్షించడంలేదో! నోట్లో ఎవెట్టుకొని కూచున్నారోమరి? ఈళ్ళకోసం మనం మందిరాలు నిర్మించాలి (అలా నిర్మించేది కొందరి బొజ్జలు నిండడానికే లెండి). మనం దేవుణ్ణి నమ్ముతూనే ఉందాం.

ఘనత వహించిన భారత ప్రభుత్వం అన్ని విధాలా విఫలమయ్యింది. కరోనా కేసులు రావడం మూణ్ణెల్లైనా PPEలూ, పరీక్షలూ లేకపోవడం బహుశా మనం బ్రెజిల్లోనే చూసుంటాం. ఇహపోతే ఇప్పటికీ సామాజిక వ్యాప్తిలేదు అని ప్రభుత్వం ఇప్పటికీ బుకాయిస్తోంది. మరణాలు తక్కువసంఖ్యలో ఉండడం సంతోషకరమే ఐనా ఈ ప్రభుత్వం data fudgingలో ఇప్పటికే ఆరితేరిపోయింది. అదిచూపించే లెక్కలు చైనా క్వాలిటీవి. అవి నిఖార్సైనవని నమ్మేవాళ్ళు ఎర్రగడ్డలో చూయించుకోవలిసిందిగా ప్రార్ధన. అంటే దానర్ధం కాంగ్రెస్ ఉంటే తెగ ఊడబొడిచుండేవాళ్ళని కాదు. ప్రభుత్వాలకి నిర్లక్షం కొంతమంది ఛస్తే ఛావనీలే అని. అవసరమైన వాటిని కొనడానికి డబ్బుల్లేవుగానీ,  సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు మాత్రం డబ్బులుంటాయి. పోనీ ఇదంతా సమసిపోయాకైనా వైద్యరంగం బాగుపడుతుంది, దానికి బజెట్ కేటాయింపులు పెరుగుతాయి అని ఎవరైనా వెయ్యిరూపాయల స్టాంపేపరుమీద రాసి సంతకం పెట్టగలరా?


జనాలు... వీళ్ళకి తలకాయల్లో మెదడుందో, మట్టుందో అర్ధంకాదు. దూరంగా ఉండండిరా అంటే మాసంకోసం, మందుకోసం ఎగబడతారు. లాక్‌డౌన్లో రోడ్లుఖాళీగా ఉన్నాయని జాయ్‌రైడులు. ఇప్పటికీ ఎక్కడపడితే అక్కడ ఎగబడడాలు. ఈటైంలో ఈ పనికిమాలిన వెధవల మధ్య ఆ వెధవదేశంలో లేనందుకు సంతోషం. కొద్దిరోజుల్లో భారత్ రష్యాను దాటేయడం ఖాయం. మహా ఉంటే ఒక మూడువారాలు పట్టొచ్చు. ఆతరువాత బ్రెజిల్‌ను చావచితక్కొట్టి, అమెరికాతో పోటీపడుతుందేమో! ఎవరికి తెలుసు? ఏమైనా అవ్వొచ్చు.