వాక్సీనుల్లో మూడు రకాలుంటయ్.
1G Vaccines: వీటిల్లో బలహీనపడ్డ వైరస్ (పునరుత్పత్తి చేసుకోలేని, మనకు హానికలింగించలేని తరహా) వైరస్‌ను ప్రవేశ పెడతారు. ఇది చాలా సమయం తీసుకొనే ప్రక్రియ. గుప్పెడు వైరస్‌ను కోడిగుడ్లలో గంపలకొద్దీ పెంచాలి. ఇవి బాగానే పనిచేస్తాయ్ కాకుంటే ఒక్కోసారి వైరస్ తిరిగి శక్తివంతం కావచ్చు. అప్పుడు అసలు రోగమేలేనివాడికి వాక్సిన్‌వల్ల రోగమొస్తుందన్నమాట. ఇదేమీ కాకపోయినా... రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉండేవాళ్ళకి(దీర్ఘకాల జబ్బులతో బధపడుతున్నవారి, కీమోథెరపీ్‌లో ఉన్నవాళ్ళు వగైరా) ఈ వాక్సీనులు ఇవ్వకూడదు. పోలియో, మశూచి, రుబెల్లా, అమ్మవారు వాక్సీనులు ఈ తరహా.
2G Vaccines: వీటిల్లో వైరస్కుండే antigens మాత్రమే వేరుసేసి, దాన్ని ఇంకో ఒక తలకుమాసిన వైరస్‌కో లేక ఈస్టు కణాలకో తగిలించి పంపుతారు. ఆ antigen చూడగానే మన రోగనిరోధక వ్యవస్థ శివాలెత్తిపోయి, antibodies తయారుజేసేసుకుంటుంది. తరువాతెప్పుడైనా నిజ్జం వైరస్ కనబడితే అదుగో ఆ antibodiesనే గంపలు గంపలు తయారుచేసుకొని వైరస్‌పై విరుచుకు పడుతుంది మనదేహం. హెపటైటిస్-బి, కోరింతదగ్గు, మెనింజైటిస్-బి వాక్సీనులు ఈ తరహా.
3G Vaccines: ఈ పధ్ధతిలో వైరస్‌కుండే RNAని మనదేహంలో దేహంలో ప్రవేశపెడితే, ఆ RNAఏ దిక్కుమాలిన కణాన్నో ఆశ్రయించి, antigens తయారుచేస్తుంది. యధాలాపంగా మన దేహం antibodies చేసుకుంటుంది. ఈపధ్ధతిలో వాక్సీన్‌ని చాలా త్యరిగగతిన అభివృధ్ధి చెయ్యవచ్చు. అయితే గతంలో ఇలా చేసిన వాక్సీన్‌లకి ఏ ప్రభుత్వమూ అనుమతులివ్వలేదు. అయితే ఇప్పుడు USలోని MODENRA చేస్తున్న వాక్సిన్‌మాత్రం ఈకోవకు చెందినది.
వాక్సీను ఎవరైన చెయ్యొచ్చు. అది కాదు విషయం. వాక్సీను పరీక్షలు ముఖ్య విషయం. అదికూడా మూడు దశల్లో సాగుతుంది.
Phase-1: వాక్సీనును కొద్ది మందికిచ్చి, ఓకొద్ది నెలలు పరిశీలిస్తారు. వాక్సీన్‌గ్రహీతలెవ్వరిలోనూ తీవ్రమైన side effects లేకపోతే అప్పుడు Phase-2 మొదలవుతుంది.
Phase-2: ఇందులో అదే వాక్సీన్ను కొన్ని వందలమందికిచ్చి చూస్తారు. వాళ్ళక్కూడా side effects లేకపోతే , వాక్సీన్ గ్రహీతలందరికీ రోగనిరోధకశక్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతే అప్పుడు Phase-3. ఇందులో Phase-2లో కన్న ఎక్కువ కాలం పడుతుంది.
Phase-3: ఇందులో అదే మందును కొన్ని వేలమందికి ఇస్తారు. వాల్లందిరినీ దీర్ఘకాలంలో వచ్చే side-effects కోసం పరిశీలిస్తారు. అంటే ఇప్పుడు కరోనాని నిరోధించగలిగినా, ఒక యేడాది తరువాత లివరు రాలిపోవడమో లేక మూత్రపిండాలు ముక్కలైపోవడమో తరిగితే అది మంచి వాక్సీన్ కాదన్నమాట. ఇదంతా జరగడానికి యేళ్ళు పడుతుంది.
ఈ పరీక్షలన్నీ నిక్కచిగా జరిపేసి ఒక మంచి వాక్సీను రావడానికి కనీసం నాలుగేళ్ళు పడుతుంది. ఈ జంఝాటమమతా తప్పించుకోడానికి కొందరు మేధావులు ఈ మూడు టెస్టుల్నీ ఏకకాలంలో సాగిస్తున్నారు. ఇది ఏవిధంగా నైతికమో వారికే తెలవాలి? ఒకరికి వైరస్ లేదనుకుందాం, ఒకానొక వాక్సీనేసుకున్నాక ఆవ్యక్తిలో వైరస్ పొడచూపిందనుకుందాం. ఇదే విధంగా ఒక వెయ్యిమందికి జరిగిందనుకుందా? ఇప్పుడు దానికి బాధ్యులెవరు? ప్రపంచమ్మొత్తమ్మీద కనీసం 100 వాక్సీనులు తయారవుతున్నాయ్. ఇందాకటి వెయ్యిని, ఈ వందతో గుణించండి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి సమాధానం. ముందు ఈకంపెనీల CEOలు, CFOలకు కరోనా ఎక్కించి మరీ వాక్సీన్ ప్రయోగించాలి. ఇంతకుమించి వేరే treatment ఇవ్వకూడదు. రొప్పీరొప్పీ చచ్చినా సరే. డబ్బుకోసం మానవహితం పేరుతో వీళ్ళు ఏమైనా చేయగలరు.
కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే ఈ యేడాదిలో ఒకవేళ వ్యాక్సీను విడుదలైనా, దాన్ని తీసుకోవడమంటే మనల్ని మనం lab ratsగా మార్చుకోవడం తప్ప మరేమీకాదు. ఇలాగే ఒకసారి మనం డెంగ్యూ అని ముద్దుగా పిలుచుకొనే వ్యాధికి ఒక వాక్సిన్ (Dengvaxia) తయారుచేసి, సరిగా పరీక్షించకుండానే ఫిలిప్పైన్స్‌లోని పిల్లలకిస్తే జరిగింది ఇదీ. ఇండియాలో పంద్రాగస్టుకల్లా ఎలాగైనా వ్యాక్సీను విడుదలచేసెయ్యాలని ఆమధ్య ఇంటర్మీడియట్గాడు తెగ బలవంతపెట్టాడు. ఎందుకో వాడికి అంత తుత్తర ఈ విషయంలో!
ఇప్పుడు కొరొనిల్ చేసిన దగుల్బాజీల గురించి. వీళ్ళు ఏకంగా వాళ్ళ మందులు కరోనాకు విరుగుడు అని చెప్పారు. కానీ వీళ్ళు లైసెన్స్ పొందింది "ఈ రెండు మందులూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి" అనట. రోగనిరోధక శక్తి పెరగడానికి ఛ్యవన్‌ప్రాశ్ ఉందిగా!! పోనీ దాల్చిన చెక్క పొడి, పసుపు, ఒక అల్లమ్ముక్క, మిరియాల పొడి పాల్లో కలుకుని తాగితే ఈ సోలాల్డు ఇమ్మ్యునిటీ విచ్చలవిడిగా పెరిగిపోదూ? మళ్ళా ఈ నాయాళ్ళు జేసిన మందులెందుకు కొనాలి?
చాలాచోట్ల ప్రయోగించాము. నూరుశాతం రిజల్టొచ్చీసినాది మీరు మీరట్‌నే గనుక పరిగణలోకి తీసుకుంటే అక్కడ రెండు హాస్పిటల్స్‌లో ప్రగించేశాము అని కూశారు. ఏవరో జర్నలిస్టు పరిశోధనలో తేలిందేమిటంటే. మీరట్లో ఈయన మందు ప్రయోగించబడిన 'ఆనంద్ హాస్పిటల్ ' లో కరోనా రోగికి కాంటక్ట్‌లోకి వచిన కొందరు వ్యక్తులమీద ఈయన మందు ప్రయోగించారట. శుభం! అయ్యా ముందుగా వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చిందా? మీమందు తీసుకున్నాక నెగెటివ్ రావడానికి? అది ఎవడికీ తెలీదు. ఎందుకంటే వాళ్ళకు కరోనా టెస్టులే జరగలేదు. ఇహ నువ్వు నెగెటివ్ తెచ్చేదేందివాయ్??!! ఇక 'యుగ్ హాస్పిటల్' యవారం ఇంకోలా ఉంది. అక్కడొక ఆరుమంది పాజిటివ్ పేషెంట్లకు ఇచ్చారట, కానీ వాళ్ళు asymptomatic అట. అంటే ఈబోడి వెధవలు చేసిందల్లా రోగలక్షణాలు లేనివారికి వీళ్ళ మందునిచ్చారు. వాళ్ళకు మందే అఖ్ఖర్లేదు స్వామీ, వాళ్ళంతట వాళ్ళే నయమైపోతారు. డబ్బుకోసం ఏమైనా చేయగల ఇలాంటి విధవలను నడివీధిలో నుంచోబెట్టి కొట్టాలి.
News laundry video about this bogus medicine : https://www.youtube.com/watch?v=8m3xL2nHwTw