నిజమేగా! ప్రపంచదేశాధినేతలందరూ "పరిస్థితి ఇదీ" అని చెప్పడానికి ప్రజలముందుకు వస్తున్నారు. 56 అంగుళాల బ్రాసైజున్న నాయకుడుమాత్రం ముంగిలా ఇంట్లో కూచుంటున్నాడు. లాకుడౌనులో వీళ్ళు ఆరోగ్య వసతులు పెంచిందేమీ లేదు. ఇప్పటికీ గొంగళి అక్కడే ఉంది. ఏవన్నా అంటే హిందూ-ముస్లిం గొడవల మధ్య తలదాచుకుంటుంది ఈ వెధవ ప్రభుత్వం. ఎలాగూ భారత్‌లో 90% మంది వెర్రి వెంగళాయిలు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయ్. సాగుతాయ్. ఎవరైన విమర్శిస్తే వాళ్ళమీద బనాయించడానికి సెడిషనొకటేడ్చింది. 2016 డిసెంబరులోనే "ఆ యాభైరోజుల" తర్వాత ఆయనే చెప్పినట్లుగా చౌకీదార్‌ని చౌకులో నుంచోబెట్టి చితక్కొట్టుంటే ఒళ్ళుదగ్గరెట్టుకొని పనిచేసుండేవాడీ పెద్ద బ్రాసైజు ప్రధానమంత్రి. ఇంత అసమర్ధుడైన ప్రధానిని దేశం ఎప్పుడూ చూసి ఉండదు.
వీళ్ల భక్తులేమో (నాకు 2016లోనే తగిలారు) పాజిటివ్‌గా ఆలోచించమని చెబుతారు. పాజిటివ్ అంటే ఏమిటో నాకర్ధంకాదు. ఏదో అనుమానమొచ్చి డాక్టర్ దగ్గరికెళాతాం. అప్పుడా డాక్టరు ఉన్నరోగాన్ని దాచిపెట్టి "ఏం ఫర్లేదు. నీ ఆరోగ్యం భేషుగ్గా ఉంది" అని చెబితే అది పాజిటివిటీ నా?
నేషనల్ మీడియా ఏమో గవిర్నమెంటుది ఏదిబడితే అది నాకుతూ కరోనా వైరస్ ముస్లిమా, క్రిస్టియనా లేక కమ్యూనిష్టా కనుక్కొనే పనిలో ఉంది. వీళ్ళని ఎవరితో పోల్చినా, వేటితో పోల్చినా ఆయా వ్యక్తుల, సమూహాల మనోభావాలు గాయపడుతాయి కాబట్టి వీళ్ళను అత్యంత నీచులుగా గుర్తించడమొక్కటే మనం చెయ్యగలిగింది.