Thursday, February 2, 2023

అదానీగారి యవ్వారము - చచప్రాసీలు



మనం ఎంతగా దిగజారినాం అంటే ఒక బడుద్ధాయిని, వాడి questionable వ్యాపార రీతిని సమర్ధించడంకోసం ఆరోపణలు చేసినవాళ్ళ వ్యక్తిత్వ హననానికే పూనుకొనేంతవరకు అనగా ad hominem attack చేసేంత వరకూ దిగజారాలా?!.  దీన్నే బానిస మనస్తత్వం అంటారు. అదానీ గారి చప్రాసి మన Prime Moron అయితే, వారి చప్రాసీలు వీరన్నమాట. అంటే చప్రాసీల చప్రాసీలు -చచప్రాసీలు- వీరు. ఆహా!! 

అదానీగారి వ్యాపారరీతులపై హిండెనుబర్గువారు కొన్ని కొచినుంగులు చేసినారు. దానికి సమాధానంచెప్పలేక అదానీగారు దేశభక్తి అనబడు మనోభావముచాటున దాక్కొన ప్రయత్నించినారు (The first resort of a scoundrel is often piety or patriotism). అదానీ ఇచ్చిన సమాధానము సంతృప్తికరమైనదైనయెడల ఈ షేర్లు ఇలా ఏందుకు కూలును? హిండెనుబర్గువారు అంతటి కుత్సితులైలనయెడల వారు టాటాలనో, విప్రోవారినో, మహీంద్రావారలనో ఎందుకు వేలెత్తిచూపలేకపోయిరి? హిండెనుబర్గువారు అంతటి జాతీయవాదులైనటుల వారు ఇప్పటివరకు కేవలము తమదేశ సంస్థలనే ఏల లక్ష్యించియుండిరి? షార్టుసెల్లింగు అనునది నిన్నామొన్నా పుట్టినట్టిదికాదు. ఒక సంస్థ మోసముచేయుచున్నదని తెలుసుకొని, దేశమంతటనీ వెధవాయిలను చేయుచున్నదని తెలుచుకొని, దాని నిలకడకు అడ్డుకట్ట వేయుట తప్పుకాదు (అందులో వారి స్వార్ధమూ కొంత ఉండి ఉండవచ్చు). ఇది అదానీ ప్రభువు విషయమునందు జరుగబట్టి ఈ చచప్రాసీలు ఇంత ఉడుక్కొనుటయేగానీ మరొక్కటి కాజాలదు. బహుశా అదానీ ప్రభువు ఘోషయాత్ర సఫలీకృతమైనాక మనకు ప్రభువు బూడిద పంచువరకూ మనము వేచియుండలేకపోయినామని ఈ చచప్రాసీల మనోవ్యధకావచ్చును ఈవ్యక్తీకరణ. అయినప్పటికినీ టైమింగు చూడమంటూనే, ఇది యేడాది క్రితమే మొదలైనదంటూ ఈ 'స్వయంస్ఖలిత' విఘాతమేలనయ్యా?  కిట్టయ్యా! చప్రాసీ గారి చంక అంత కమ్మగా ఉందా చచప్రాసయ్యా!!

Cayman Islands, British Virgin Islands వీటి పేర్లు ఎక్కడ వింటిమి? ఎప్పుడు వీటి పేర్లు విన్నా అక్కడికి నిధులు సరఫరా అయినా లేక అక్కడి నుండి నిధులు సరఫరా అయినా అవి Money Laundering విషయములోనేకదా?! అంతెందుకు NDTV పూర్వయజమానుల పేర్లూ అందులో లేవా? అప్పుడు వారుమాత్రమే ముద్దాయిలు ప్రస్తుత యజమానులు మాత్రమే మహాత్ములు అని యేల భావింపవలె?! పైగా ఉన్న ఏడెనిమిది సంస్థల అధిపతులూ అసమదీయులేనటకదా! అనన్యసామాన్యము కాదుగానీ ఇంతజేసియూ మీకు ఒక దేశాధిపతి చప్రాసీగా ఉండుట అద్భుతము ప్రభూ! అద్భుతము!!

అప్పులవల్ల షేర్ల విలువపెంచుకొని, విలువ పెరిగిన షేర్లపై మళ్ళీ అప్పులనిన ఆహా! మిమ్ములనర్చించు కరములు కరములు స్వామీ!

యజమాని వర్గములో స్వామీ! యజమాని వర్గములో... ఇరువురు అవుల్రెడీ నేరస్తులట. ఆహా! ఇదొక్కటే మిగిలియున్నది ప్రభూ! మీలీలలు ఎన్నదగినవి! వారిలో ఒకరిని ఏల చప్రాసిగా నియమించరు ప్రభూ?!

LIC వారలారా, SBI వీరులారా మీరు దస్యులు క్షమించాలి ధన్యులు. ప్రభుపదసేవలో చప్రాసీగారు కోరినంతనే మా యొక్కధనమును పణముగాపెట్టి మమ్ములనూ ఇందులో భాగస్వాములను చేసిన మీసేవను మేము మరిచిపోము నాయనలారా. మేము దుంపనాశనమైననూ మిమ్ములను సమర్ధించెదముగాక. ఇదియే మాశపధము!