ఇప్పుడే చూశానీ సినిమాని. త్రిష బాగా కష్టపడినట్లి కనబడింది. నాకు నచ్చింది.
మాదేశంలో చమురుబావులు లేకపోతే నా లీడర్లనీ, నన్ను చంపేవారు కాదు. మీదేశంలో కూడా అపారమైన ఖనిజ నిల్వలున్నాయి జాగ్రత్త - పిల్ల తీవ్రవాది.
అసలు తీవ్రవాది అంటే ఎవరు అనేది మరోప్రశ్న. ఒకదేశపు తీవ్రవాది ఇంకోదేశపు పోరాటయోధుడు. అల్లూరి, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వీళ్ళందరూ ఇంగ్లీషువాళ్ళ దృష్టిలో తీవ్రవాదులు. భారతీయుల దృష్టిలో వాళందరూ స్వాతంత్ర పోరాటయోధులు. అసలు తీవ్రవాదులు ఎలా పుడతారు అనేది పెద్దప్రశ్న.
ప్రజాస్వామయుతంగా పోరాడటానికి దారులన్నీ మూసుకుపోయినప్పుడు జనాలు తీవ్రవాదంవైపుమళ్ళుతారు:
- కశ్మీరులో 1986లో జరిగిన ఎన్నికలని ప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలని చెప్పుతారు. అప్పటి పారనాయిడ్ కాంగ్రెస్ ప్రభుత్వాధికారులు అభ్యర్ధులను గెలిచినటుగా ప్రటించి ఎన్నికల tentలోకి తీసుకెళ్ళి 'మీరు ఓడియారు' అని చెప్పారట. దీంతో జనాలు భారత ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయి, JKLF వైపు మళ్ళడం మొదలెట్టారు.
- శ్రీలంక పరిస్థితికూడా ఇదే! అక్కడి తమిళుల డిమాండల్ల 'మమ్మలి ద్వితీయ పురులుగా చూడొద్దు, మాకూ సింహళులతో సమానంగా హక్కులు అవకాశాలూ కల్పించండి' అనేదే. అది తుపాకీ పట్టకుండా కుదరదు అని అర్ధమయాక వాళ్ళు సైన్యం ఏర్పాటుచేసుకొని మరీ పోరాడారు.
ఏదైనా ఒకదేశం తమమీద దాడి చేసినప్పుడు మరో దిక్కులేక గెరిల్లా పోరాటాలు చేస్తారు:
- ఆఫ్ఘనిస్తాను: ఇది రష్యా అమెరికాల పుణ్యం. రష్యాకెప్పుడూ భూదాహం. రష్యా ఇరానునుకూడా ఆక్రమించుకుందామని ప్రయత్నించింది - ఆయిల్ బావులున్నాయని. ఫిన్లాండ్నూ ఆక్రమించుకోవాలని ప్రయత్నించుకుంది. రెండో ప్రపంచయుద్ధంలో పోలండునూ ఆక్రమిచుకుంది. అఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించింది ఇండియాతో land route కోసం (ఎవరికి తెలుసు రష్యాకి కాష్మీరుమీదకూడ మోహముందేమో!) . అమెరికన్లకి కమ్యూనిజం విస్తరించడం నచ్చదు కాబట్టి CIA ఆధ్వర్యంలో ఇస్టమొచ్చినట్లుగా ఆయుధాలు పంచిపెట్టారు -ముఖ్యంగా స్టింగరు. అక్కడ సైన్యంలేదు కాబట్టి ఎవరికిబడితే వారికి పంచారు. వెళ్ళిపోయేటప్పుడు తిరిగితీసుకోవడం మరిచారు. ఆదరిద్రప్పని ఇండియాను చానాళ్ళు వేధించింది.
CIA: వీళ్ళగురించి పేరాలుపేరాలు రాయాల్సుంటుంది. ఎన్నిదేశాల్ని నాశనం చేసిందీ CIA!
- Iran: ఒకప్పుడు ఇరానియన్లు అమెరికాను మిత్రదేశంగా భావించేవారు. వాళ్ళ అసలు శత్రువు బ్రిటీషువాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆయిల దోచేసుకొని ఇరాను షాకి ముష్టి పడేసేవారు. అలాంటప్పుడు ఆయన్ని గెంటేసి ఎన్నికలు జరిపిస్తే అందులో Mohammad Mosaddegh ఎన్నికయ్యాడు. ఈయన ప్రజాస్వామ్యవాది, లౌకిక, జాతీయ, పశ్చిమ దేశాల భావాలున్నవాడు. ఈయన ప్రధాని అయ్యీఅవ్వడంతోనే ఆయిల్ బావులన్నీ జాతీయం చేసి, ఇంగ్లీషువాళ్ళను గెంటేశాడు. అమెరికాకు 'జాతీయం' అన్నపదమే నచ్చదు. దాంతో Mosaddegh పైన కుట్రచేయించి, ఆయన్ని house arrest చేయించి. షాని మళ్ళీ తెచ్చి ఇరానియన్లమీద రుద్దారు.
ఈముచ్చట్లన్నీ All The Shaw's Menలో చాలా బాగ వివరించారు
షాకాలంలో ఇరానియన్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీకావు. రహస్య పోలీసులు, షాగారి విలాసాలకు తగలేసిన డబ్బు. ఆయనొకసారి ఎడారిలో ఒక పేద్ధ పార్టీని ప్రపంచదేశాధిపతులకు ఇచ్చారట. దానికైన ఖర్చు $635 Million. ఆపార్టీ మొత్తంలో ఒక్క ఇరానియనూ లేకుండా జాగ్రత్తపడ్డారు ఆఖరుకు ఆయన కేబినెట్ మంత్రులతో సహా - of course షాగారు ఆయన భార్య అట్దెండ్ అవుతారు.
- Libya: కల్నల్ గడ్డాఫీ కొంచెం వింత ఫోకడలుపోయినా దేశాన్ని సస్యశ్యామలం చేశాడు. ఉచిత విద్యను ప్రసాదించాడు. కాకుంటే ఒక తప్పుచేశాడు. అదేంటంటే ఆయిల్ బావులను 'జాతీయం' చేశాడు. ఇక్కడే అమెరికాకు కాలింది. కల్నలుడికి వ్యతిరేకంగ ఒక rebel force దువ్వింది. వాళ్ళు కల్నలుడిని రొడ్డుమీద కొట్టి చంపేశారు. ఇప్పుడు లిబియా దరిద్రంగా తయారయ్యింది.
- మొత్తం దక్షణ అమెరికా: ప్రతి ఒక్కదేశంలోనూ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి, నియంతలను గద్దెనిక్కించారు. ఇప్పుడా దేశాల ప్రజలు అమెరికాను ద్వేషిస్తున్నారంటే ద్వేషించరూ! CIA అక్కడి ప్రజలమీద torture techniques ప్రాక్టీసు చేశారు. వాటినిప్పటికీ గ్వాంటానమో బే జైల్లో వాడుతుంటారు తీవ్రవాదులమీద. CIA మరియు తోలుబొమ్మ నియంతలూ చేసిన ఘోరాలు తెలుసుకోవాలంటే The Shock Doctrine చదవాల్సిందే.
అమెరికా బాంబులూ డ్రోన్ల దాడులవల్ల కలిగిన Collateral Damage వల్ల కుటుంబాలను పోగొట్టుకున్నవారు:
- అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని అప్పట్లో 'డ్రోనాచార్య' అని పిలుచుకొనేవారు. ఈయన కాలంలో జరిగిన విచ్చలవిడి డ్రోనుల దాడులు అంతకుముందుగానీ ఆ తరువాతగానీ జరగలేదు. ఎన్ని కుటుంబాలు నాశనమయ్యుంటాయో మనమే ఆలోచించుకోవచ్చు. అలాగని బుష్పరిపాలనలో అంతా చఖ్ఖగా ఉందని కాదు. అలనాడు Afghanistanలో Carpet Bombing జరిగింది. అంటే ఒక ప్రాంతంలో తీవ్రవాదులున్నట్లు సమాచారం ఉందికాబట్టి, ఒక 500 బాంబులేసి ఆప్రాంతం మొత్తాన్నీ నేలమట్టం చెయ్యడం. ఇప్పుడక్కడ ఒకరో ఇద్దరో బ్రతికారనుకుందాం. వాళ్ళను తీవ్రవాదులే దగ్గరకు తీశారనుకుందాం. ఇప్పుడీ ఒక్కరో ఇద్దరో తీవ్రవాదులుగా మారితే అది వాళ్ళతప్పెలా అవుతుంది.