Saturday, February 25, 2023

డ్రాగన్! డ్రాగన్!


 

ఈమధ్య తెలుగు పత్రికల్లోనూ, తెలుగు బ్లాగుల్లోనూ 'చైనా' అనుండాల్సిన చోటల్లా 'డ్రాగన్' అని వాడుతున్నారు. ఏదో ఒకటి రెండుసార్లు వాడితే విలే'ఖరము' రొమాంటిక్ మూడ్‌లో ఉండి అలా వాడుంటుంది అని అనుకుంటాం. అదే 'చైనా' అనున్నచోటల్లా 'డ్రాగన్' అని వాడితే ఆ రొమాంటిక్ మూడ్ 'భయ'మేమోనని అనుమానం కలుగుతుంది. ఒకదేశం పేరుచెప్పడానికి ఈ విలేఖరములు ఎందుకు భయపడాలి? ఐనా పేరు నేరుగా చెబితే చైనా ప్రభుత్వం తలకొట్టి మొలేస్తుందా? అదీ చూద్దాం! పేరు చెప్పడానికే వీళ్ళు ప్యాంట్లెందుకు తడుపుకుంటున్నారు?


ఇదర్జంటుగా మారాలి లేకుంటే ఇది ముదిరి, 'చైనా' అనున్నచోటల్ల్లా 'డ్రాగన్'ని ప్రతిష్టించే ప్రమాదముంది. 

ఉదా:- 

  1. యూనాన్ దక్షణ డ్రాగన్‌లోని ఒక ప్రావిన్సు. 
  2.  దక్షణ డ్రాగన్ సముద్రము మరియు ఉత్తర డ్రాగన్ సముద్రము.
  3. భారత-డ్రాగన్ యుద్ధము.

ఇదింకా ముదిరితే 'ఇకనుంచైనా మనం మారాలి'ని 'ఇకనుండ్రాగన్ మనం మారాలి' అని రాసుకొనే రోజులొస్తాయి 😆