Tuesday, January 10, 2023

Why am I an atheist?

 




ఇది భగత్‌సింగు గారి పుస్తకానికి నా పరిచయమో, సమీక్షో కాదు. అసలలా ఎందుకయ్యిందో తెలీదుకానీ అవతలివాళ్ళ "పండగకి ఇంటికి వెళ్ళడం లేదా?" నుండి నా "I'm an atheist" వరకూ super fast సంభాషణ నడిచింది (super fast because that entire conversation lasted for a mere 45 seconds). ఇంతవరకూ నాకేమీ అసహజంగా అనిపించలేదుకానీ, తరువాతి ప్రశ్నే కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. "Why? Some thing happened is it?". అప్పటివరకూ అసలలా ఆలోచించలేదు. అసలా అడిగినవాళ్ళు ఏమనుకుంటున్నారో అర్ధమయ్యేసరికి నవ్వొచ్చింది. సినిమాల్లో ప్రేమ విఫలమయినావాళ్ళు స్త్రీద్వేషులుగా మారినట్లు, నాస్తికులంతా ఏదో అయ్యాకే అలా అవుతారన్న అవగాహన చాలా amusingగా అనిపించింది. "Yes. Realisation happened" అని చెప్పూరుకున్నాను. కారణాలు చెప్పలేదు.ఒకవేళ చెప్పినా వాటిని విశ్లేషించగల logical capabilities అవతలివాళ్ళకున్నాయని నేనకుకోకపోవడమే దానిక్కారణం(అవే ఉంటే వాళ్ళు అలా ఉండరని నాదే ఇంకో అభిప్రాయం :) ). నాకు కారణాలేకాదు ప్రశ్నలుకూడా ఉన్నాయి. పోనీ అవే అడుగుదామనుకున్నా ఇప్పటికే చాలామమది అడిగిన సంతృప్తికరమైన-సమాధానాలు-పొందని-ప్రశ్నలే అడగాల్సుంటుంది. దాన్ని illogical వేదాంతంతోనూ, "మా పుస్తకంలో అలాగే ఉంది" లాంటి సమాధానాలతోనూ (ఆపాటికి ఆపుస్తకంలో ఉన్నంతమాత్రాన అదంతా ఋజువులే అవసరంలేని నిజాలన్నట్లు), అడిగే ప్రశ్నలకు సమాధానాలు అలాఉంచి తమ అయోమయ స్థితినే జ్ఞానంగా genuineగా పొరబడటం వల్లనూ subvert చెయ్యడం పెద్దకష్టంకాదు (అదేకదా ఇప్పటిదాకా జరుగుతూవచ్చింది). ఏమతమైనా ఇంతకనా ఏంపెద్దగా వివరించి ఏడ్చింది? వివరించేకొద్దీ మరింతగా logical paradoxesలోకి కూరుకుపోతూ తనని అవహేళన చేసే అవకాశాన్ని ఇతరులకిచ్చాయి అన్నీనూ.


క్రైస్తవం, ఇస్లాం సంగతిచూద్దామంటే దైవేఛ్ఛకు బాహ్యంగా సాతాను ఉనికి జగత్తులో ఎలా సాధ్యమయ్యిందంటే గుడ్లు తేలేస్తారు. హిందువులేమో దైవేఛ్ఛ, కర్మఫలం అనే రెండూ బలమైన సిధ్ధాంతాలు నిర్మించేసుకొని, వాళ్ళకి అనుకూలంగా జరిగినప్పుడేమో వాళ్ళ ప్రార్ధనలూ/చేయించిన శాంతులూ/చేసిన పూజలూ/నోచిన నోములూ/పాటించిన వాస్తులూ/చెప్పించుకున్న జ్యోతిష్యాలూ నిజమయ్యాయనీ, లేకుంటేనేమో కర్మఫలం బలీయంగా ఉన్నదనీ సర్దుకుపోతున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక దొంగచేస్తున్నది అతని 'దుష్ట/మానవ ప్రయత్నమో' లేక దైవాజ్ఞపాలనో (చీమలుకూడా దేవుడి పర్మిషన్ పొందిననేగానీ కుట్టజాలవు) తేల్చిచెప్పలేరు.   కానీ ఇప్పటి విజ్ఞానశాస్త్రం కనుగొన్న విషయాలన్నీ మాపుస్తకాల్లో ఎప్పుడో ఉన్నాయీ అంటూ 'divine comedy' ఒకటి. 'పుస్తకాల్లో ఉన్నది విజ్ఞానంకదా, మరి దాన్ని విజ్ఞానంలాకాకుండా స్తుతులుగా ఎందుకు భావిస్తున్నారు...?' అంటే సమాధానం ఉండదు.

మనుషుల్లో అసలు దేవుడిమీడ నమ్మకం ఎలా మొదలతుందన్నదానికి నా theory ఇది : చిన్నప్పుడు మనమెంత మాత్రమూ logicalగా ఆలోచించలేని వయసులో ఉన్నప్పుడు పెద్దలు మనమీదకి ఈ నమ్మకానికి రుద్దడం వల్ల (దీన్నే ఇంటలెక్చువల్ అత్యాచార్ అంటాన్నేను). ఇంత చిన్నవయసులో ఏర్పడిన ముద్రలు వదిలించుకోనే అవకాశం చాలామందికి రాదు. ఒకవేళ వచ్చినా అదే comfortingగా ఉండడంతోనూ, నిజాన్ని face చెయ్యాలన్న తప్పనిసరి అవసరమేమీ లేకపోవడంచేతనూ అలా వెళ్ళదీస్తుంటారు. కావాలంటే ఒక చిన్న పనిచెయ్యండి. మీపిల్లవాణ్ణి ఒక ఇరవైఏళ్ళొచ్చేవరకూ దేవుడిపేరైనా సోకకుండా పెంచండి ఆతరువాత వాణ్ణి దేవుడి అస్తిత్వం గురించి convince చెయ్యడానికి ప్రయత్నించండి. ఎంతకష్టమో అప్పుడర్ధమవుతుంది. దేవుడి భావన అసలకంటూ ఎలా మొదలయ్యుండొచ్చంటూ Carl Sagan తన పుస్తకం Cosmosలో ఒక చక్కని వాదనచేస్తాడు. దాదాపు ఇలాంటిదే చిన్నప్పుడేదో నవల్లో చదివినట్లు గుర్తు. Natural phenominaకి మొట్టమొదటి వివరణ మతం పరంగా ఇవ్వడం జరిగింది. "మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే" దానిక్కారణం దేవతలనుకున్నారు. కాబట్టే ప్రతిమతంలోనూ మొట్టమొదటిదేవతలు పంచభూతాలు. తరువాత gods of fertility. ఇక superior god  అనేవాడు వీళ్ళందర్నీ విడివిడిగా కాకాబట్టుకోవడంకంటే వీళ్ళందరూ ఒకడి ఆధీనంలో ఉంటే వాణ్ణే ఒకేసారిగా కాకాబట్టుకొనే సౌలభ్యతనెరిగినవాళ్ళ invention. దేనికైనా కారణం తెలీదంటే అది మనిషిని నిలువనీయదు. అలా ప్రతిదానికీ ఒక కారణాన్ని మతం ఇచ్చింది. అలా కల్పించబడిన కారణం కొందరి తేరగా ఉపాధికీ, అప్పనంగ అధికారాన్నప్పగించడానికీ తప్ప ఇంకేవిధంగానూ పనికొచ్చేదిగా లేదనుకున్నవాళ్ళు అసలు కారణాన్ని వెదకడంలో పడడంతో విజ్ఞానశాస్త్రం పుట్టుక మొదలయ్యింది. అప్పటినుంచీ ఒకప్పుడు దేవతల ఆధీనంలో మత్రమే ఉండే చాలా విషయాలు కొందరు మనుషల masteryలో మరింత మెరుగ్గా రూపుదిద్దుకున్నాయి (ముఖ్యంగా వైద్యం). అనాటినుంచీ మతం పరిధి కుచించుకుపోతూవచ్చి ప్రస్తుతానికి నీతులు చెప్పడమ్మాత్రమే మతం విధైపోయింది. ఆనీతులుకూడా పక్షపాతంతోకూడుకున్నవీ, అనాగరికపు వాసనలున్నవీ, సార్వజనీనమైనవి కావనీ గుర్తెరిగిన కొందరు నైతికతపై మతం గుత్తాధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న రోజుల్లో ప్రస్తుతం మనమున్నాం. ఇంతాజేసి నూరుశాతం నిక్కమైన నాస్తికులున్నారేమోగానీ, నూరుశాతం నిక్కమైన ఆస్తికుల్నిమాత్రం (fatalism, providential-ismలని నమ్మి నారూ, నీరూ పోసేవాడికోసం ఎదురుచూసేవాళ్ళు. ఒకవేళ ఉన్నా వాళ్ళని సోమరిపోతులంటున్నామేగానీ ఆస్తికోత్తములనడంలేదు సంతోషం!)  నేనింతవరకూ చూడలేదు. అసలలా ఒక్కరోజుండటంకూడా సాధ్యం కాదు. ఉన్న ఆస్తికుల్లోకూడా ఉన్నవాళ్ళ చదువులస్థాయి పెరిగేకొద్దీ మతాన్నీ సీరియస్‌గా పరిగణించడమూ, ప్రతిదానికీ దేవుణ్ణి కాకాపట్టడానికి తయారైపోవడమూ తగ్గుతూ వస్తోంది.

దేవుడి అస్తిత్వమూ, నాస్తిత్వమూ అసలు సమస్యేకాదు. వాడికుందని చెప్పే ఆఒక్కపనీ -సృష్టి- సరిగ్గా చెయ్యలేని బడుధ్ధాయ్ ఉంటే ఎంత? ఉండకపోతె ఎంత? సమస్యల్లా వాడు చెప్పాడని చెబుతున్న జీవన విధానాల గురించే. కొందరంటారూ అన్నిమతాలూ ఒకే దేవుడిదగ్గరకి చేరే మార్గాన్ని బోధిస్తున్నాయని. ఇన్ని మతాల ప్రజలమధ్య, ఒకరికీ ఇంకొకరికీ పొసగని జీవనవిధానాల మధ్య, నరికిచంపైనా సరే మతాలగొప్పలు చాటాలనుకొనే మూర్ఖత్వాల మధ్య వారు అలాంటి watered down version of religion మాత్రమే మతాలసారం అని అనగలుగుతున్నారంటే, అదెలాగో నాకు అర్ధమవ్వదు. మతం అనేది జాతీతయ, కులం, కుటుంబం లాగా ఒక లేబుల్. సంకెళ్ళు ఎన్ని తక్కువైతే ఆమేరకు బరువుతగ్గినట్లు, లేబుళ్ళు ఎన్ని తక్కువైతే ఆమేరకు వాటి ప్రతిష్టల బరువుల క్రింద మనం నలిగిపోవడం తప్పుతుంది. 'మనవాళ్ళకు' ఏదో అన్యాయం జరిగిపోయిందని అయినదానికీ కానిదానికీ ఆవేశపోవడం తగ్గుతుంది.


ఇదంతా ఎందుకు ఒక్కముఖ్ఖలో చెప్పాలంటే ఎవణ్ణో అడుక్కుని, కాకాపట్టి, ఎవడికో భజనచేసి, సోపేసి సాధించే విజయంకంటే నేను కష్టపడి సాధించే విజయమే నాకు ప్రియమైనది. విజయం వరించకపోతే పోయె అడుక్కోవడమ్మాత్రం నావల్లకాదు. అదికూడా anonymous గాణ్ణి :)