హిట్లరుడి మొదటి fascination ఒక యూదు అమ్మాయి. అసలు హిట్లరుకి యూదుమూలాలున్నై. అసలు హిట్లరుని జర్మనని జర్మన్లెవరూ ప్రస్తుతం అంగీకరించరు. ఎందుకంటే అతను ఆస్ట్రియన్.
ఈ మహానుభావుడూ Uromaniac అట. అనగా అమ్మాయిలని (వేశ్యలని) తెచ్చి, తనమీద ఉచ్చబొయ్యమనేవాడు. ఆతరువాత అక్కడా ఇక్కడా తన్నమనేవాడు మధ్యలో చర్నకోలలూ అవీకూడా ఉన్నాయి. సకలకళావల్లభుడు హిట్లరుడు. ఒకవేళ ఆపిల్ల ఒప్పుకోకపోతే, అపిల్లని పియానొ వైర్లకి వేలాడదీసేవాడట. ఈయనగారు చెప్పినట్లు కొన్ని నెలలపాటు చేసి, విరక్తి కలిగి ఒక నటీమణీతో సహా ఒక ముగ్గురు బిల్డింగుమీదనుంచి దూకో ఇంకోఇంకో విధంగానో చచ్చిపోయారు. (TODO: మరోసారి ఆ సిరీసు చూస్తే ఇక్కడ విషయాలు రాయొచ్చు). ఈయనకి The Rapist of Wannsee బిరుదాంకితుడైన Josef Göbbels భార్యతో సంబంధంకూడా ఉందని వదంతులున్నై. మరి ఈయన్ని శీలవంతుడని ఎలా అంటాం? ఈయన మద్యమాంసాలను ముట్టనంత మాత్రాన గొప్పవాడంటే, రాముడు రెండింటినీ సేవించాడుగా మరి రాముణ్ణి ఈయనతో పోల్చి ఏమనాలి? మరెందుకు.... రాముణ్ణొదిలేసి వీణ్ణే పూజిస్తే పోలా?
తనచివరిరోజుల్లో Drugsకి బానిసై ఏడ్చినాడు. Port of Calaisమీద దాడి జరిగినప్పుడు మధ్యాహ్నం రెండింటివరకు గురకలు పెడుతున్నాడట. సైన్యాన్ని Port of Calais కి పంపించే అధికారం ఈయనకు మాత్రమే ఉంది మరి. గురువుగారు గురకలుపెడుతున్నారు. ఉన్న జనరళ్ళలో ఒక్కడికీ హిట్లర్‌ని తట్టిలేపి "ఒరేయ్ గాడిదా! పరిస్థితి ఇదిరా! నిద్రలేవరా!" అని చెప్పే ధైర్యంలేదు. అలా చెప్పగలిగిన Erwin Rommelని మనవాడెప్పుడో బలితీసుకున్నాడు.
Nürembergలో "ఇదంతా నేను చెబితే వీళ్ళు చేశారు, వీళ్ళ తప్పేమీలేదు" అని చెప్పకుండా ఈయనపాటికి చచ్చిపోయినాడు. అది ఈయన బాధ్యతారాహిత్యం. చచ్చేముందుకూడా రష్యన్ సైన్యాలు బెర్లిన్ మీడ దాడిచేస్తే, ఈయన తన బంకర్చుట్టూ సైన్యాల్నిపెట్టుకున్నాడే తప్ప, బెర్లిన్ జనాలగురించి ఆలోచించలేదు. ప్రస్తుతానికి ఈయన సమాధి లేదా బంకరూ ఎక్కడున్నాయోకూడా చాలామందికి తెలీదు. ఒకవేళ గైడ్లనడిగినా "ఇదే" అంటారు. "ఇదే" అంటే ఏది? అక్కడ కారుపార్కింగు తప్ప ఇంకేముండదు. అంటే జర్మనుల "అభివృద్ధి"ని కాంక్షించిన ఈ వెధవని జర్మనులే వదిలించుకొంటే. హిండియన్లు ముఖ్యంగా RSSవాదులైన హిండియన్లూ, అరబ్బులూ నెత్తినెట్టుకుంటున్నారు. నిజంగా వాడు రెండవ ప్రపంచయుద్ధంలో గెలిచుంటే తాటతీసుండేవాడు వీళ్ళందరికీను.
ఈలాంటి వెధవకి ఇండియాలో నమోవాకాలు! 1995 అనుకుంటాను మన ప్రియతమ RSSవాళ్ళు హిట్లరువిగ్రహం కడతాము అనంటే ఆవిడెవరో యూదుల representative అట... "మీరదికట్టండి, మేము జనరల్ డయ్యర్ విగ్రహం కడతాము" అని అన్నది. జనరల్ డయ్యర్ అంటే జలియన్ వాలాభాగ్ గుర్తురావాలి భారతీయులకి. నోర్మూసుక్కూర్చున్నారు RSSవాళ్ళు.
ప్రస్తుతానికి హిట్లరువిగ్రహాలు యూరోపులో ఎక్కడాలేవు. నియోనాత్జీలు ఏదో ఏప్రిల్ 20న హడావుడిచెయ్యడమేతప్ప, హిట్లరుమీసాలు, హిట్లరు అభివాదాలు యూరోపులో శిక్షార్హం. అలాంటి హిట్లరుని హిండియాలో బాగా గౌరవిస్తాం!!