Wednesday, December 14, 2022

ఇహ మిగిలింది క్రిమియా!



 నేను ఊహించినట్లుగానే రష్యా చాతాళం సాగింది. వీళ్ళ ట్యాంకులు ఇక్ష్వాకుల కాలం నాటివి అవన్నీ NATO సరఫరాచేసిన ఆయుధాలదెబ్బకి కుదేలైనాయ్!. అణ్యాయుధాలు వాడితే రష్యాను అందరూ ప్రక్కనపెట్టేస్తారు. అప్పుడిక రష్యా ప్రభువులు, ఇరాను ప్రభువులు, ఊత్తరకొరియా ప్రభువులు కలిసి త్రిగళగీతం పాడుకోవాల్సుంటుంది. ఇండియా కూడా దూరం జరిగితీరుతుంది. మహా ఉంటే పాకిస్తానుతో పొందుకుదరొచ్చు. ఎందుకంటే యెదవలకీ యెదవలకీ బాగా కుదురుతుంది. 


అసలు యుక్రైను చేస్తున్న తప్పేమిటంటే వాళ్ళు డిఫెన్సు ఆడుతున్నారు. ఈజ్రాయెలీ doctrine అవలంభించాలి వీళ్ళుకూడాను - The best defence is offence. ఎవడీనా నా ఇంటిమీదకి ఒక రాయి విసిరితే, నేను వాడింటిమీదకి నాలుగురాళ్ళేస్తాను. కీయెవ్ మీదకి రష్యా మిస్సైళ్ళు కురిపిస్తే, వాళ్ళూ మాస్కోమీదకి ఒక నాలుగు ఎక్కువమిస్సైళ్ళు పంపించుచూడాలి, మాస్కో అందుబాటులో లేకుంటే పీటర్గ్రాడ్ ఉందికదా!


ప్రస్తుతానికి యుద్ధం క్రిమియాని విడుదలచేయడం దిశగా సాగుతోంది. శుభం! అది ఒకప్పుడు ఉక్రైనుదే దాన్ని రష్యా ఆక్రమించేసుకొని, ఒక దిక్కుమాలిన రెఫరెండం పెట్టి, దంట్లోకి రష్యన్లను పంపడం మొదలెట్టింది. అసలు ఇదంతా స్టాలిను కాలమ్నాటి వ్యూహం. యుక్రైనులో రష్యనులు ఇంతటి ఇబ్బడిముబ్బడిగా ఉండేవారుకాదు. స్టాలిను అనబడే ఒక దరిద్రుడు యుక్రైనులో కరువుపరిస్థితులు కొనితెచ్చి, చనిపోయిన యుక్రేనియన్లను రష్న్యన్లతో నింపాడు. దానికి ఆయనచెప్పిన కారణం Denazification. ఇప్పుడు యుక్రైనుమీద దాడికి పుతిను చెబుతున్నదీ అదే -Denazification!


ఇప్పుడు చెకియా ఉరఫ్ చెక్ రిపుబ్లిక్ కలినింగ్రాడ్ ని ఆక్రమించుకోవాడానికి ఎత్తులు వేస్తుందట. ఒకప్పుడు ఈ ప్రాంతం జర్మనీకి చెందినది. తరువాత రష్యా కొన్నాళ్ళు ఆక్రమించుకొని దాన్ని రష్యన్లతో నింపేయడంతో USSR విఛ్ఛిన్నం తరువాతకూడా దాన్ని స్వీకరించడానికి ఏదేశమూ ముందుకురాలేదు. ఇదంత తేలిక్కాదు కానీ రష్యా చెకియాకికూడా లోకువయ్యిందన్న విషయం గుర్తించదగ్గది. ఒకవేళా చెకియా దాన్ని సాధించిందో అది NATOకి గొప్ప విషయం. రేప్పొద్దున రష్యా ఏ లిధువేనియానో ఆక్రమించుకుంటే, NATO తన సైన్యాలను కలినింగ్రాడ్మీ దుగా నడపాల్సుంటుంది. బాల్టీక్ సముద్రంలో NATOకి ఇహ ఎదురే ఉండదు. అదీగాక రషన్ల Nuclear missiles ఆ కలినింగ్రాడ్‌లో చచ్చాయి. అవన్నీ NATO సొంతమవుతాయి.