Sunday, August 9, 2020

మ్యూనిక్కు విడిచాము రామాహరి. మేము బెర్లిన్‌కు చేరాము రామాహరి. నిన్న బెర్లిన్‌కు చేరాము రామాహరి



మొత్తానికి మ్యూనిక్ వదిలి బెర్లిన్ చేరాను. కారణం బెర్లిన్‌లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. 

మ్యూనిక్ చక్కటి నగరం. చాలా శుభ్రంగా, సెక్యూర్డ్‌గా ఉంటుంది. జనాలు బుర్రని వాడుతారు, ఇంగితమనేది ఒకటి ఉంటుంది అక్కడి జనాలకి. మ్యూనిక్ చాలా ఖరీదైన నగరం. అక్కడ ఇల్లు వెదుక్కోవడం చచ్చేచావు. . 

బెర్లిన్‌లో అంతా ఎవడిష్టం వాడిది. ట్రైనెక్కేటప్పుడు మాస్కేసుకోండిరా అన్నందుకు పోయినవారం ఒక ఇరవైవేలమంది రోడ్లెక్కారు. ఇప్పుడు బెర్లిన్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్. సిటీలో కొన్ని రైల్వేస్టేషన్లలో జనాలు బెడ్లేసుకొనిమరీ పడుకుంటున్నారు. డ్రగ్స్ సమస్య ఉన్నదే! నగరమ్మాత్రం చాలా రంగులురంగులుగా ఉంది.  బెర్లిన్ చాలా చవకైన నగరం. కాబట్టి జీతాలూ తక్కువే ఇస్తారు. కానీ మంచి ఇళ్లు చవగ్గా అద్దెకు దొరుకుతాయి. యూరప్‌లో night lifeని enjoy చెయ్యాలంటే బెర్లిన్‌లోనే చెయ్యాలి. రాత్రి పన్నెండింటికి మొదలయ్యే పార్టీలూ, పదుల సంఖలో Bier Gartenలూ, అంతే సంఖ్యలో ఇండియన్ రెస్టారెంటులూ.

బెర్లిన్‌గోడ అవశేషాలని ఇంకాచూడాలి. ఒకప్పుడు నరమానవుడు కనిపించని (no man's land) కనిపించని potsdamer platzలో నేడు ఇరవై అంతస్తుల భవనాలు.  WW-II హిస్టరీ మొత్తం మ్యూనిక్‌చుట్టూ, బెర్లిన్‌చుట్టూ తిరుగుతుంటుంది. ఇక concentration camps చుట్టెయ్యాలి, ఒక మంచి మ్యూజియంకి మెంబరైపోవాలి.


  బెర్లిన్‌గోడ అవశేషాలు


ప్రస్తుత పరిస్థితి