Wednesday, August 12, 2020

The Pocket Hercules Naim




బుల్గారియన్ తుర్క్ weight lifter Naim Süleymanoğlu జీవిత గాధ ఇది. Netflix Germanyలో ఉంది.


అనుకోకుండా చిన్న వయసులోనే బుల్గారియన్ weight lifting teamలో చేరిన Naim బుల్గారియాకి పతకాలు తీసుకు రావడం మొదలుపెడతాడు. అతని ఖ్యాతి దేశమంతా వ్యాపిస్తుంది. అదే సమయంలో బుల్గారియా ప్రభుత్వం తమ దేశంలోని తుర్కుల మానవహక్కులన్నీ కాలరాసి, వాళ్ళపేరుకూడా మార్చేస్తుంది. 'అసలు మాదేశంలో తుర్కులు లేరు' అన్నది ఆనాటి బుల్గారియన్ ప్రభుత్వ వైఖరి. 

ఈ ప్రభావం సహజంగానే Naimపై పడుతుంది. Naim పేరునుకూడా Naum Shalamanovగా మర్చేస్తుంది ఆనాటి బుల్గారియన్ కమ్యూనిస్టు ప్రభుత్వం. ఇదిలా ఉండగా weight lifting పోటీలకని ఆస్ట్రేలియా వెళ్ళిన Naimకు అక్కడి కొందరు తుర్కులతో పరిచయం కలుగుతుంది. ఆ పరిచయం తరువాత ఎలగైనా తనవాళ్ళనుభవిస్తున్న బాధల గురించి ప్రపంచానికి చాటిచెప్పాలన్న అభిప్రాయం Naimలో కలుగుతుంది. ఇటుప్రక్కేమో Naimఎక్కడకు వెళ్ళినా బుల్గారియన్ గూఢచారులు ఒక కన్నేసి ఉంచుతుంటారు. మొత్తానికి అక్కడి తుర్కుల సహాయంతో అక్కడినుంచి పారిపోతాడు. బుల్గారియన్ ప్రభుత్వం రష్యన్ KGB సహాయంతో Naimని మట్టుపెట్టాలని చూస్తుంది. అవన్నీ తప్పించుకొని, గ్రీస్ గగనతమమ్మీదుగా రహస్యంగా ప్రయాణించి టర్కీ చేరుకుంటాడు. కొన్ని అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించాక, బుల్గారియాలోని తుర్కుల పరిస్థితిని వార్తాపత్రికలకు వివరించినా అంతర్జతీయ వార్తాపత్రికలు పట్టించుకోవడంతో, ఇహ ఒలెంపిక్సే గతి అని నిర్ణయించుకుంటాడు. 

1988 సియోల్ ఒలెంపిక్స్‌లో బంగారు పతకం గెలుస్తాడు Naim అదికూడా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతూనే. ఆ తరువాత అతను ఐ.రా.స. లో బుల్గారియాలోని తుర్కుల పరిస్థితి వివరించడంతో, బుల్గారియా ప్రభుత్వమ్మీద పెరిగిన అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా, చివరకు బుల్గారియా ప్రభుత్వం దాదాపు మూడులక్షలమంది తుర్కులను టర్కీలోకి అనుమతిస్తుంది. 

Naim 2017లో liver transplant తరువాత యాభయ్యేళ్ళ వయసులో చనిపోయాడట. అతని ఎత్తు కేవలం 151 cm (నాలుగు అడుగుల పదకొండు అంగుళాలు) కావడంతో అతణ్ణి అందరూ little Hercules అని పిలిచేవారు.