ఒకప్పుడు భారత రాజకీయ నాయకూ మాత్రమే ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారు. ఇప్పుడు వారికి ట్రుంపుడూ జతకలిశాడు.
మొన్నేమో ఆర్ధికమంత్రి గారు "ఆడలేక మద్దెల ఓడన్నట్లు" ఏవేవో మాట్లాడారు. ఈవిడ రాఫెల్ విషయంలోనూ ఇలాగే మాట్లాడినట్లు గుర్తు. ఇవిడేదేదో చెప్పేది. ఆ డసో వాడు రెండో రోజు ఈవిడ చెప్పేదానికి విరుధ్ధంగా ఇంకోటేదో చెప్పేవాడు. నానా రభస. కంఫ్యూజను. చివరాఖరికి ఈ మొత్తాన్నీ రేశరహస్యాల పరిరక్షణ పేరుతో గంపకింద పెట్టేశారు. ఆశ్చర్యకరంగా సుపృఈం కోర్టూ "ఒకే" అనేసింది.
రక్షణమంత్రిగారు మొన్న ఇంకేదో అనేసారు. "హిందీ" మీదుగా దేశంలో ఏకత్వాన్ని సాధించాలని. హిందీ భాష ఎలా పుట్టిందో ఆయనకు తెలిస్తే ఇలా మాట్లాడేవారు కాదు. అయినా ఏ హిందీ బాబు? ఎవరి హిందీ? ఏ మాండలికం. అపని ఇంగ్లీషు భాషతో చెయ్యొచ్చుగా. "యాంటీ నేషనల్ శక్తులు" ఎలాగూ పాకిస్థాన్ వెళ్ళరు. వాళ్లనప్పుడు ఏకంగా అమెరికా పంపిచెయ్యొచ్చు. వాళ్ళు ఖుష్. మనకెలాగూ సెన్సిబుల్ గా ఆలోచించేవాళ్ళు అఖ్ఖర్లేదు. వాళ్ళనఖ్ఖడకి పంపించేస్తే, వాళ్ల తంటాలు వాళ్ళు పడతారు. ఈ ప్రబుధ్ధుడే మొన్నోసారి ఆధార్‌తో పనిలేకుండా ఇంకో కార్డును ప్రవేశపెడతాం అన్నాడు. ఎంత అద్భుతమైన ఆలోచన!! ముందుగా పాన్ కార్డు తెచ్చుకోమని దుంపదెంచారు. అదే సర్వస్వం అన్నారు. ఇప్పుడు తీరాదాన్ని బ్యాంకులు, ఆదాయపన్నువాళ్ళు తప్ప పట్టించుకొనే నాధులు లేరు. తరువాత ఆధార్ కార్డు. దాన్ని తెచ్చుకోమని రాచి రంపాన పెట్టారు. ఆధార్ లేనివాడికి అన్నీ కట్‌చేస్తాం అన్నారు. దాని తీసుకొనొచ్చి, ప్రతిదానికీ లింకు చేశారు. అదొక్క కార్డుతో కార్డుహోల్డరుడి వయసు, ఫోన్ నెంబరు, బ్యాంకకౌంటు, కారు నంబరు, వాడి సెక్సు, ప్రవర, కులం, గోత్రం అన్నీ తెలుసుకోవచ్చని ప్రపంచ సెక్యూరిటీ మేధావులు గోలపెట్టినా వినలేదు. ఇహ మాకు వేరే పనేమీ ఉండదనుకున్నావా నాయనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు కొత్త కార్డులు తీసుకొస్తే, మేము నానా తిప్పలూ పడి వాటిని సాధించడానికి గవర్నమెంటు ఆఫీసులచుట్టూ తిరగాలా?
మోదీకూడా స్పీచుల్లో ఏందేందో మాట్లాతాడు. ఈయన గణిత, చరిత్ర పరిజ్ఞానాలు అధ్బుతం మరియు అనితర సాధ్యం. ఆమధ్యో ఇంటర్వ్యూలో ఇలాగే రోడ్డుమీద పకోడీలేసుకొనేవారికి ఉద్యోగం ఉన్నట్లుగానే భావించాలి అని చెప్పి ఉద్యోగాల కల్పనకూడా హుళక్కే అని చెప్పకనే చెప్పాడు. అదేంటో అవసరమైన వాటినిగురించి తప్ప మిగతా అన్ని విషయాలమీద వెంటనే స్పందిస్తాడు. టెక్నాలజీమీద ఈయనకున్న పట్టు రాడార్ల విషయంలో చూశాం. డిమానిటైజేషన్ గురించి ఈయన చేసిన హడావిడీ అంతాయింతాకాదు.
ఇప్పుడు ట్రంపు. ఆ మధ్య పాలస్తీనా విషయంలో ఏదో వెర్రి వ్యాఖ్యలు చేశాడు. ఆయనది చెయ్యవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. ఉత్తర కొరియా విషయంలోనూ, ఇరాను అప్పుడప్పుడూ పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యన ఈ బాబుగారికి తానుచేసిన ఘనకార్యాలకి నొబెల్ ప్రైజైతే బాగా సరిపోతుందని అనిపించిందిట. ఆమధ్య క్లింటనుకూ అలాగే అనిపించింది, ఆయనేదో యాసర్ అరాఫత్‌తో రాసుకుపూసుకు తిరిగాడు కాబట్టి , తాను సెర్బియా మీద బాంబులేసినా అదేమంత పట్టించుకోనఖ్ఖర్లేని విషయం అని అయనకు అనిపించింది. ఇప్పుడు ఈయన. ఇప్పటికీ భారత్ పాకిస్థాన్‌ల మధ్య మంచిసంబంధాలకోసం పనిచేస్తానంటూ అనసరపు పేరంటాలు పాత్ర బాగా పోషిస్తున్నాడు. నిన్న ఏకంగా మోదీని జాతిపిత అని సంబోధించి, వ్యవహారాన్ని పరాకాష్టకు చేర్చాడు. అసలు భారతమాత అన్న కాన్సెప్టే అనవసరపు కాన్సెప్టు, ఇకమళ్ళీ జాతిపిత అనేది ఇంకో అనవసరపు కాన్సెప్టు. ఇప్పుడు ఏకంగా జాతిపితలు (బహువచనం) అట. పనిలో పనిగా జాతికి బాబాయినీ, పిన్నినీ, తాతల్నీ అవ్వల్నీ, మరదళ్ళనీ, వదినల్నీ కూడా మనకు తెలియజేస్తే బాగుంటుందనుకుంటున్నాను. జాతిబామర్ధి ఎవరో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది.
వీళ్లందరికంటే గందరగోళంగా మాట్లాడే ఒకే ఒక్కడు పవన్ కల్యాణ్. అయన గెద్దలాగే అసలువిషయం అనే కోడిపిల్లచుట్టూ గిరికీలు బాగా కొడతాడుగానీ, అసలువిషయాన్నిమాత్రం మాత్రం పొరపాట్నకూడా ముట్టుకోడు. అయనకు భయం అసలువిషయం చర్చిస్తే, ఒకట్రెండు నిమిషాలకంటే మాట్లాడ్డనికి తనదగ్గర సబ్జెక్టులేదని. అందుకే అయనగురించి ఆయన చెప్పుకుంటాడు. వాళ్ళు పార్టీ సమావేశాలు అని చెప్పుకున్నా నేను వాటిని ఇంటర్వ్యూలు అనో ఏకపాత్రాభినయాలు అనో అంటాను.
వీళ్లందరికంటే గందరగోళంగా మాట్లాడే ఒకే ఒక్కడు పవన్ కల్యాణ్. అయన గెద్దలాగే అసలువిషయం అనే కోడిపిల్లచుట్టూ గిరికీలు బాగా కొడతాడుగానీ, అసలువిషయాన్నిమాత్రం మాత్రం పొరపాట్నకూడా ముట్టుకోడు. అయనకు భయం అసలువిషయం చర్చిస్తే, ఒకట్రెండు నిమిషాలకంటే మాట్లాడ్డనికి తనదగ్గర సబ్జెక్టులేదని. అందుకే అయనగురించి ఆయన చెప్పుకుంటాడు. వాళ్ళు పార్టీ సమావేశాలు అని చెప్పుకున్నా నేను వాటిని ఇంటర్వ్యూలు అనో ఏకపాత్రాభినయాలు అనో అంటాను.