ఈ మధ్య నేను చూసిన తెలుగు సినిమాల్లో నాకు బాగా నచ్చిందిది. అదితీరావ్ హైదరీని తెలుగులో చూడ్డం నచ్చింది. అమె నటనగురించి కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఇంతకుముందు చూసిందే. భావాలు పలుకుతాయి మొహంలో, కళ్ళలో. అది చాతగాకనే గుడ్డలిప్పుకొని గెంతాల్సొస్తుంది హీరోయిన్లకు. ఈ సో కాల్డు సుధీర్‌బాబు మహేశ్‌బాబుకి బంధువట. కానీ మహేశ్‌బాబుకంటే చాలారెట్లు మెరుగు. మన ఖర్మేంటంటే ఇలా సెన్సిబుల్‌గా నటించేవాళ్ళు, సెన్సిబుల్ సినిమాలు ఎంచుకొనేవాళ్ళు మనకు నచ్చరు. పిడిగుద్దుతో పాతికమందిని పడగొడితే అదీ మనకు హీరోయిజం. "తమ్ముడూ... నువ్వు సినిమా ఎన్నిసార్లు చూశావమ్మ...?" అనడిగినప్పుడు సుధీర్ బాబు కూల్‌గా చెబ్తాడు "ఒక్కసారేనమ్మా" అని. డైలాగు రాసినాయనకి దండం స్వామీ. భళ్ళుననవ్వి, తరువాత ముక్కులోకి పోయిన నీళ్ళతో అవస్థపడ్డాను. ఇక సీనియర్ నటుడు నరేశ్ నటన ఆద్యంతమూ చఖ్ఖగా ఉంది. నరేశ్‌ని అద్బుతంగా వాడుకున్నారు. ప్రస్తుత కాలపు సినిమాలమీద, డైలాగ్ రైటర్స్‌మీద వేసిన సెటైర్లు బాగున్నాయి.
ఇది చూశాక ఇంద్రగంటిగారు చేసిన మిగిలిన సినిమాలు చూడాలనిపించింది. మొన్నొకరోజు మాయాబజార్ (2006) చూశాను. సినిమా ఫర్లేదు. అంతకంటే నాకు నోట్ఐన విషయం ఏంటంటే రాజా ఏబెల్ తెలుగు ఉఛ్ఛారణ. చక్కగా ఉంది. ఆయనకి "భ"ని పలకడమేగాక, ఎప్పుడు "బ"ని వత్తాలో, వత్తకూడదో కూడా తెలుసు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే తెలుగు హీరోల్లో చాలా మందికి ఈ బేసిక్ లాంగ్వేజ్‌సెన్స్ లేదు. ఆమధ్య తాజ్‌మహల్ అనబడే చిత్రరాజాన్ని చూస్తుంటే అందులో హీరోగారు "నా బావిజీవితం..." అంటూ ఏదో డైలాగు చెబుతుంటే నవ్వలేక చచ్చాను. ఆ కప్ప వెధవకి "భావి జీవితా"నికీ, "బావి జీవితా"నికీ తేడా తెలియదు. అదన్నమట సంగతి. వాణ్ణికాదు డబ్బింగ్‌లో ఆ డైలాగును ఓకేచేసినోణ్ణి లాగిపెట్టి తన్నాలి.