Monday, January 14, 2019

The New Indian Science aka Hindu Science


అమెరికన్లకీ, రష్యన్లకీ సైన్సు విషయంలో ఎవరుగొప్ప అని పట్టింపులొచ్చాయట. ముందుగా అమెరికన్లు అమెరికాలోని ఒకానొక భాగంలో మూడొందల మీటర్లలోతువరకూ తవ్వకాలు జరుపితే, అక్కడ వారికి రాగి ముక్కలు కనిపించాయట. ఆ తరువాతిరోజున అమెరికన్ ప్రెసిడెంటు గర్వంగా "దాదాపు మూడువందల యేళ్లక్రితమే అమెరికన్లు కమ్యూనికేషన్‌కోసం రాగితీగలు వాడేవారు" అని ప్రకటించాడట. ఆతరువాత రష్యన్లు సైబీరియా ప్రాంతంలో ఒక ఆరువందల మీటర్లు తవ్వగా, అక్కడ వారికి పగిలిన గాజుముక్కలు కనిపించాయట. ఆతరువాతిరోజు రష్యన్ ప్రెసిడెంటు "అమెరికన్లు ఇంకా రాగివైర్లతో తంటాలుపడుతుండగానే మా రష్యన్లు ఆరొందల యేళ్లక్రితమే ఫైబర్ ఆప్టిక్స్ టెక్నాలజీవాడేవారు" అని ప్రకటించాడట. ఎంతమాత్రమూ తగ్గకూడదని నిర్ణయించుకున్న ఇండియన్లు, చాటుగా గంగానదిఒడ్డున వార్ణాసి ప్రాంతంలో ఒక 800 వందలమీటర్లు తవ్వారట, ఏమీకనబడ్లేదట. విక్రమార్కుణ్ణి ఆదర్శంగా తీసుకొని విసుగూ, విరామం ఎరుగక ఏనిమిది కిరోమీటర్లదాకా తవ్వినా ఏమీ చేతికి తగల్లేదట. అదేవిషయన్ని వారి వారి ప్రధానికి విచారవదనాలతో నివేదించారట. తరువాతి రోజు భారత ప్రధానికి ప్రపంచానికి గర్వంగా ఇలా అనౌన్సుచేశారట : ఎనిమిదివేల సంవత్సరాలక్రితమే వేదకాలపు ఆర్యులు కమ్యూనికేషన్ నిమిత్తం వైర్‌లెస్ టెక్నాలజీని వాడేవారు!!

చదవేస్తే ఉన్నమతిపోయిందనేది నానుడి. డాక్టరేట్లు పొందినవాళ్ళు ప్రభువులవారి ప్రాపంకంకోసం నేషనల్ కాంగ్రెస్‌ని లాజింగ్ క్లబ్ స్థాయికి దిగజార్చడం చూస్తుంటే, ఈ దిగజారుడు ఇంతటితో ఆగదని అనిపిస్తుంది. ఐన్స్టైన్‌కి ఎనర్జీ అంటే తెలీదా? Homo Sapeans పుస్తకంలో Yuval Noah Harari ఒక మాటంటారు. ఒకవేళ ఇరానియన్లు E = mc3 అని నమ్మేటట్లైతే, ఇరానియన్లు అణుబాంబు తయారుచేస్తారు అని అమెరికన్లు భయాడవలసిన అవసరం ఎంతమాత్రమూ ఉండదు అని. ఆ స్వయంప్రకటితమేధావి ఐన్శ్తైన్ తప్పనుకొంటే, ఒక పేపర్‌రాసి, రివ్యూకు పంపించాలి. ఈ యనచెప్పిందే నిజమైతే, నోబెల్ వస్తుంది. అంటేగానీ పేరుకోసం తనగుడ్డలు తనే విప్పుకోవడం ఎందుకు? శూన్యం అనేది, ఎనర్జీ అట. స్పేస్ అనేది ఒకవాల్యూంని సూచిస్తుంది. దాన్ని క్యూబిక్ యూనిట్లలో కొలుస్తారు. స్పేస్‌లో ఎనర్జీ ఉండొచ్చు. అంతేకానీ, స్పేస్, ఎనర్జీ రెండూ ఒకటేననడమేమిటి?  తలకాయే బురదన్నట్లుంది వారి వాదన. వారి తలకాయలో బుఱదుంది అంతేగానీ, వారి తలకాయే బుఱదకాదు కదా!

ఇంకొక ప్రబుధ్ధుడు టెస్ట్యూబ్  బేబీలగురించి, విమానాలగురించి వాగాడు. టెస్ట్యూబ్ బేబీల గురించి మీకు ముందే తెలిసుంటే, ఝాన్సీ రాణి గారు ఎందుకు దత్తత తీసుకోవలసి వచ్చింది సార్? కుంభాలక్కుంభాలు పిల్లలను కనెయ్యవచ్చునే! విమానాలు.... పురుషోత్తముడు, శివాజీ, మహారాణాప్రతాప్ వీళ్ళందరూ వేదిక్ విమానాలను ఉంపయోగించి మొఘలులను, యవనులనూ తరుమికొట్టలేకపోయారా? ఇంకొకరి కష్టాన్ని తమదని చెప్పుకోవడానికి సిగ్గులేకపోతేసరి! ఇప్పుడు నేనొక కాల్పనిక కధ రాస్తానే అనుకొందాం, తరువాత నేనురాసిన నవల్లొ, నేను వర్ణించిన కొన్ని టెక్నాలజీలను ఎవరో కష్టపడి సృష్టించి నిజం చేశారనుకుందాం. నేను వెంటనే వాటిమీద కర్చీఫ్ వేసేసి, పేటెంట్లు పొందుతానా? రామాయణ, భారతాల్లో కొన్ని అందమైన ఊహలున్నాయ్. వాటిని ఊహించ గలిగిన ఆ సృజనాత్మకత గొప్పదే కానీ దాన్ని materialize చెయ్యగలగడం అంతకన్నా గొప్పవిషయం. నిన్న నేను తీరి కూర్చొని పగటి కలలు కన్నానుకదాని, రెపొచ్చే టెక్నాలజీలకన్నింటికీ నేను యజమానిననికాదు. అసలిలాంటి మైండుదొబ్బినోళ్లని ఉంచాల్సింది వేదికలమీదకాదు. పిచ్చాసుపతుల్లో!

ఈ పిచ్చ వెధవలు పొల్లుపోకుండా చెప్పేదేమిటంటే... సైన్సంతా వేదాల్లోనే ఉందని. అవునా? మీకు  ఎప్పుడూ అలా అనిపిస్తుందా? లేక తాగినప్పుడేనా? వేదాల్లో యజ్ఞాన్ని రతికార్యంతో (యజ్ఞగుండాన్ని యోనితోనూ, ఘృతాన్ని వీర్యంతోనూ, ఋషులను మిండగాళ్లతోనూ) పోల్చుతూ చేసిన sexual-వర్ణనలేగాక, మాంచి geekish-జోకులుకూడా ఉన్నాయన్నమాట! సంతోషం! అనువదించి, ముద్రించి, రైళ్లలో అమ్మండి. ఈ సారెప్పుడైనా గురంటూరు నుంచి, విజయవాడెళ్ళాల్సొస్తే, ఓ రూపాయిపావలాకి కొని చదువుకొని, నవ్వుకుంటాం. అంతేగానీ, ఆ చెత్తంతా వేదకలమీద పారబొయ్యొద్దు. అరుంధతి రాయ్ తన End of the Imaginations వ్యాసంలో మనం దేనికోసం వెదుకుతున్నామో మనకు క్లారిటీ ఉంటే అది ఖచ్చితంగా మనకు మత గ్రంధాల్లో దొరుకుతుందని, కొంచెం జాగ్రత్తగా వెదికితే కోకోకోలా ఫార్ములాకూడా వేదాల్లో దొరకొచ్చనీ అంటారు. అంతెందుకు రాజుగారి ఏడుచేపలకధను క్వాంటం మెకానిక్స్ రహస్యాలను దాచడానికి మనపూర్వులు వాడేవారు అని ఋజువుచెయ్యొచ్చు. వేదాలనేవి స్తోత్రాలేకానీ, శాస్త్రాలు కావు. అందులో మనం మనకు తెలిసినవాటినే తప్ప తెలియనివాటిని కనుక్కోలేం. ఇప్పుడూ మనకు Theory of Relativity తెలుసుకబట్టి, దాన్ని మనం వేదాల్లో వెదుక్కోవచ్చు. అదే GUTని వెదకడం సాధ్యమవదు. ఇక రామాయణ భారతాలు నిజంగా జరిగిన సంఘటనలే, అదంతా చరిత్రే అని నమ్మే పిచ్చిమొహాలు Spider Man కూడా చరిత్రేమో అర్జంటుగా చెప్పాలి. ప్రపంచమంతా మతాన్ని వదిలించుకొని progressive గా వెళుతూ కొత్త ఆవిష్కరణలు చేస్తుంటే, ఈ సొల్లు వెధవాయిలుమాత్రం regressiveగా వెళి ఉన్నది ఊడగొట్టుకుందామని అభిలషిస్తున్నారు. ఇలాంటి చవటలనుంచి, మొత్తంగా హిందూమతమ్నుంచి ఇండియాని రక్షించుకోవాల్సిన తక్షణావసరం ఇండియన్లకు ఎంతైనా ఉంది.



Canute (లేదా Cnut) అని ఒక రాజుగారు ఉండేవారట. అయనొకరోజు సముద్రం ఒడ్డున సేదతీరుతుంటే, ఆయన మంత్రులు అయనను తెగ ఉబ్బేస్తున్నారట. "రాజుగారు మీరు ఇంద్రుడు, చంద్రుడు, మీ ఆనలేనిదే సూర్యుడు అస్తమించడు, గాలి వీచదు, పువ్వులు పరిమళించవు. అంతెందుకు మీరు ఇక్కడనుంచి అరచేత్తో సైగ చేస్తే ఆ వచ్చే అల వెనక్కుపోతుంది" ఇలా సాగుతోంది వారి వరస. రాజుగారికి ఈ పొగడ్తలతో తలనొప్పివచ్చేసిందట. ఈ మంత్రులకి, తను మామూలు మనిషినేనని ఎలా చెప్పటమా అని ఆలోచించి,  "కొంచెం కుర్చీని నీళ్ళదగ్గరకు జరపండి నాయనా" అన్నారట. పేద్ద అల వచ్చింది, రాజుగారు చెయ్యడ్డుపెట్టారు. అల రాజుగారిని, పక్కనున్న మంత్రులను ఝాడించిపోయిది. రాజుగారు ఒకసారి మంత్రులను చూసి "ఇందాకేదో అంటున్నారు, ఏంటి నాయనా?" అన్నారు. మంత్రులు సిగ్గుతో తలదించుకున్నారు. (ఈ కధను కొన్ని సమయాల్లో సముద్రాన్నే అరచేత్తో ఆపబోయేంత మూర్ఖత్వాన్ని వర్ణించడానికి వాడుతారుగానీ నిజానికి Canute స్థితప్రజ్ఞుడు).

పొగిడేవాడు సిగ్గువిడిచి, రాజుగారి చంకనాతున్నా, ఆ నాకుడుని వద్దనగల బుధ్ధి నాకించుకొనేవాడికుండాలి. వాడెవడో చమ్మాయ్‌గాడు "గ్రావిటేషనల్ వేవ్స్"ని "మోదీ వేవ్స్"గా నామకరణం చేస్తానని అనడమేమిటి? ఈ ఇంటర్మీడియట్ గాడు ఒప్పుకోవడమేమిటి? వాడికి సిగ్గులేదు సరే! వీడికైనా ఉండొద్దూ! X-rays ని Röntgen - raysగా వ్యవహరించడాన్ని Wilhelm Conrad Röntgen ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. అయన తన accidental discoveryకి మసాలా వేసి దాన్నో inventionగా చూపించుకొనుండొచ్చు కానీ ఆయన అలాంటి పని పెట్టుకొలేదు. ఆఖరికి పేటెంట్‌కూడా అప్లై చెయ్యలేదు. ఇక్కడేమో ఈ దరిద్రుడు అణాకాణీ contribution లేకుండా పసుపురాసుకొని తయారయ్యాడు.  మోదీ వేవ్స్ అట మోదీ వేవ్స్.

ఇదిలా ఉండగా... ఆచారాల్లో సైన్స్ అనీ, గోవుల మలమూత్రాలు సేవించమనీ చెప్పే పిచ్చోళ్ళ గుంపు ఇంకొకటి తయారయ్యింది. ఒక ప్రబుధ్ధుడంటాడు... ఆవు ఆక్సిజన్‌ను శ్వాశించి, ఆక్సిజన్‌ను విసర్జిస్తుందట. ఇదే అద్భుతమైన విషయాన్ని అప్పట్లో ఒక హిందూబ్లాగులో కూడా చదివినట్లు గుర్తు. ఈ తింగరి వెధవలకు అర్ధంకాని విషయమేమిటంటే హీమోగ్లోబిన్ ఆధారిత శ్వాసవ్యవస్థలున్న జంతువులు ఆక్సిజన్‌ని వినియోగించుకొంటాయేతప్ప, ఉత్పత్తి చెయ్యలేవు. వినియోగించబడని కొద్దిమొత్తపు ఆక్సిజన్ ఆయా జంతువులు (మనుషులు) వదిలే గాలిలో ఉండొచ్చు (ఆలెక్క ప్రకారం కారు exhaust fumesలోకూడా మొద్దిమొత్తంలో ఆక్సిజన్ ఉంటుంది). ఆవుచ్చతాగడం ఒక పవిత్ర కార్యమైపోయింది ఇంకొందరు తింగరి వెధవలకు. అందునా ఆ ఆవుచ్చ పాలకంటే కూడా ఖరీదు మరి! ఆవుకి ఏ సిఫిలిస్సో,ఇంకేదైనా రోగమో ఉంటే, తాగినోడు అనవసరమైన రోగాలు తెచ్చిపెట్టుకుంటాడన్న కనీస జాగ్రత్త లేకుండా కొందరు "తాగండోయ్" అంటూ ప్రచారం ఒకటి. అవును మాస్టారూ.. పసుపు అంత శక్తివంతమైనదే ఐతే.. ఆసుత్పత్రుల్ని పసుపుతో అలుక్కుంటే సరిపోతుందిగా... ఫినాయిల్తో కడగటమెందుకు? సూదుల్ని స్టెరిలైజ్ చెయ్యకుండా.. పసుపులో ముంచితే సరిపోతుందిగా? రోజూ చిటికెడు పసుపు మింగితే AIDS రాదేమో... కొంచెం మీమీద ప్రయోగాలు చేసుకొని మానవాళిని ఉధ్ధరించొచ్చుగా! అహ అలాక్కాదు. జస్ట్ నోటికొచ్చినదంతా సైన్సని వాగుతాం అంటే!
https://www.bbc.com/news/world-asia-india-46778879