అసలు జనవరి ఒకటిన న్యూఇయరు సెలెబ్రేటు చేసుకొనడము పాశ్చాతుల ఆచారము. (వారి దేశముల ఉద్యోగాలకోసం మనం ఎంతగా ప్రాకులాడినప్పటికీ) వారు అధములు. 'మనము' విశ్వములోనే (ప్రపంచంలోకాదు మొత్తం విశ్వంలోనే) ఉత్తముండలము. మనము న్యూయియరును మన మన మతములు మరియు వాటి శాఖల ఆధారముగా సెలెబ్రేటు చేసుకొని 'ఉలిపికట్టెలా' మన ప్రత్యేకతను గర్వముతోడ ప్రదర్శించుకొనవలెనేగానీ, అన్యులు (అనగా ప్రపంచమంతా) నడిచిన దారిన మనము నడువరాదు.
మనకు ఎంచక్కా... తెలుగు వారికొక న్యూఇయరు, కేరళవారికింకో న్యూఇయరు, పంజాబీయులకింకో న్యూయియరు ఎట్సెట్రా ఉండినవి. అవ్విధముగ మనము కులానికో న్యూఇయరు ఉండేలాగున జనులను పురోభివృద్ధిపధమున నడిపించవలె. ఉదాహరణకు నేను కాకతాళీయముగ (just by mere accident) ఒక లింగాయతునైన యెడల, నేను కేవలము బసవణ్ణగారి జన్మదినమునే న్యూఇయరుగా భావించి, తక్కిన అన్నింటినీ నిరసించవలయును. ఒకవేళ నేను ముస్లిమునైన యెడల అల్-హిజ్రాను మాత్రమే న్యూఇయరుకు కొలమానముగా భావించి, మహమ్మదు గారి కాముకతను, రక్తపిపాసను గౌరవించెదను.
ఒక global standard ఉండుట నా అభిజాత్యమునకు గొడ్డలిపెట్టు. నేను రేపెప్పుడైనా నా కారు టైరు పాడైన యెడల, నేను నా కులము, గోత్రము (and ప్రవర) చెప్పి నాకు సరిపోయిన టైరును కొనితెచ్చుకొనుటకు సిధ్ధముగా ఉన్నాను.