Saturday, February 12, 2022

ఉక్రెయిను యవారము - నాకు తెలిసిన విషయములు



 ముందుగా...

  1. NATO అనేది ఒక రష్యాపట్ల ఆత్మరక్షణ కూటమి. సార్వభౌమ దేశాలు తమ మెజారిటీ ప్రజల అభీష్టం మేరకు అందులో భాగమవడమో, అవ్వకపోవడమో తేల్చుకుంటాయి. ఇప్పుడు ఉక్రెయినుకూడా తనకు కావాలనుకుమే NATOలో చేరుతుంది. మధ్యలో రష్యా బోడిపెత్తనం అనవసరం.
  2. ఈమధ్యే పుతినులవారు సెలవిచ్చినట్లు రష్యావద్ద గుట్టలు గుట్టలుగా అణ్వాయుధాలు పోగుపడున్నై. అందుకనే NATO రష్యాపై మొదటిగా దాడి చెయ్యదు. అలా చేస్తే అప్పుడు జరిగే మహా సంగ్రామంలో ప్రపంచమే అంతమౌతుంది. ప్రస్తుతానికి దీనినెవరూ కోరుకోవట్లేదు.
  3. పైన చెప్పిన ముక్క రష్యాలో పదవుల్లో ఉన్నవాళ్ళక్కూడా తెలుసు "NATO విస్తరణ వల్ల రష్యాకు ప్రమాదం" అనంది కేవలం సాకు మాత్రమే. ఈ "NATO విస్తరణ" వాదం అర్ధమల్లా రష్యా ఒకప్పటి సోవియట్లా ప్రపంచంపై ప్రభావాన్ని చూపించే అవకాశం తగ్గిపోతుందని మాత్రమే.
  4. NATO విస్తరణ రష్యాకు భయాన్ని కలిగిస్తుంటే అది రష్యాసమస్య. మాజీ ప్రియురాలు మార్షలార్ట్స్ నేర్చుకుంటుంటే ప్రియుడెందుకు భయపడాలి?
  5. NATO విస్తరించకూడదు అనుకుంటే రష్యా వారు 1992లో Moldaiaలో తోలుబొమ్మరాజ్యాన్ని ఏర్పరచకుండాల్సింది. 2008లో Georgia మీద దాడి చెయ్యకుండా ఉండుడాల్సింది. 2014లో Crimeaని ఆక్రమించకుండా ఉండుండాల్సింది. Donbassలో 2014నుండి ఒక చిన్నస్థాయి సంక్షోభాన్ని రగులుస్తూ ఉండకుండా ఉండాల్సింది.
  6. అమెరికా, రష్యాలు గుంటనక్కలే ఐనా, వారిద్దరి సామ్రాజ్యవాదమూ దుర్మార్గమే ఐనా, రష్యా సామ్రాజ్యవాదం మరింత దుర్మార్గం. రెండుదేశాలూ పొరుగుదేశాల విషయాల్లోకి తలదూర్చినా, పొరుగుదేశాల్ని ఆక్రమించుకొనే దుర్మార్గపు తీరు అమెరికాది కాదు.
  7. ఉక్రెయిన్ తనవద్దనున్న వద్దనున్న అణ్వాయుధాలను తిరిగిచ్చినందుక్కాను, తన సార్వభౌమత్వాన్ని గౌరవిస్తానని Budapest Memorandum మీద సంతకంపెట్టి, ఇప్పుడిలా మాట్లాడటం రష్యాకు తగనిపని.

ఇక అసలు యుద్ధం విషయానికే వస్తే, స్థూలంగా రష్యా వద్ద ఆయుధాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా, అవన్నీ సోవియట్ కాలంనాటివి (ముఖ్యంగా ట్యాంకులు). ఉక్రెయిన్ పసికూనే అయినా, వారి ఆయుధాలు అధునాతనమైనవి. ఇదిగాక NATO ఇంకా ఆయుధాలను సరఫరా చేస్తోంది. 

ఉక్రెయున్ విజయవంతంగా రష్యాదాడిని తిప్పికొట్టగలదు అని ఎవరూ నమ్మఖ్ఖర్లేదుగానీ, మొన్న అమెరికాకు ఇరాకులో ఎదురైన పరిస్తితే రష్యాకు ఉక్రెయునులో ఖచ్చితంగా ఎదురౌతుంది. ఉక్రెయినులో ప్రజలు ఆయుధాలు పట్టుకొని గెరిల్లాయుద్ధాలు చేస్తారు. అప్పుడు రష్యాకు జననష్టమూ, పుతినుకు పరువునష్టమూ తప్పవు. అసలే రష్యాలో పుతినుగారి పాపులారిటీ యేమీ ప్రచండభానుడిలా వెలిగిపోవట్లేదు. దానికి ఆర్ధిక ఆంక్షలుకూడా తోడై, నిత్యావసరాలు అడుగంటి, రూబులు విలువ ఘోరంగా పతనమై, సోవియట్ ఆఖరురోజులు తిరిగివస్తే బాబుగారి కుర్చీకింద నీళ్ళురావడం ఖాయం. అసలే ఘనరష్యా కాబట్టి పుతినుగారిని తన్నితగలేసినా తగలెయ్యొచ్చు.