Tuesday, September 15, 2020

Open Letter to Indian Media

 https://medium.com/@feministvoicesnow/dear-news-media-of-india-bdc7f74a571a


ఇలాంటి లేఖలవల్ల ప్రయోజనముంటుందని నేననుకోను. ఇలాంటి టీవీలు కార్యక్రమాలు చూసే లేకిబుధ్ధిని భారతీయులే వదిలించుకోవాలి. ఇతరుల జీవితాల్లోకి తడికల కన్నాల నుండి చూడాలనే perverted బుధ్ధి భారతీయులే వదిలించుకోవాలి. అది సాధ్యంకానంతవరకూ ప్రేక్షకులకోసం ఏహద్దులు దాటడానికైనా భారతీయ మీడియా సిధ్ధమే! అయినా ప్రభుత్వపు ప్రాపుకోసం ఆత్మలనమ్ముకుంటున్న న్యూస్ రీడర్లనీ, మీదియా అధిపతులనీ చూస్తున్నాం. అసలు సమస్యలమీద చర్చను వారించడానికి అసలు అవసరమేలేని విషయమ్మీద చర్చించడం, దాన్ని ప్రేక్షకులు గుడ్లప్పగించి చూసి తమ "కుతి" తీర్చుకోవడం భారతదేశానికే చెల్లింది. 


ఆ అమ్మాయి తప్పు చేసుండవచ్చు. ఆ అమ్మాయే సుశాంత్ మరణానికి కారణమయ్యుండొచ్చు. కానీ ఆ విషయం విచారించడానికి రెండు దర్యాప్తుసంస్థలు కృషిచేస్తున్నాయ్. ఈలోగా మీడియా ఆ అమ్మాయిని harass చెయ్యడమెందుకు? ఆ అమ్మాయికి బలగం లేదనేగా? సల్మాన్‌ఖాన్‌తోటీ, సంజయ్‌దత్‌తోటీ ఇలా దూకుడుగా వ్యవరించగలదా ఈ మీడియా? మరి రాజకీయనాయకులతోటీ? ఆ అమ్మాయి కారులో వెళుతుంటే వెంటాడారు. ఆ అమ్మాయిని పోలీసు కారులో ఉంటే ఎవడో ఒక విలేకరి రాక్షసుడు "రియా! నువ్వు MDMA తీసుకున్నావా? డ్రగ్స్ తీసుకున్నావా? చెప్పు రియా... మేమడుగుతున్నాంగా!" అంటూ రౌడియిజం. కొంచెం కూడా sense of morality ఉండదాండీ? ఆఖరుకు ఆ అమ్మాయి కుటుంబం ఏదో food order ఇస్తే... ఇంటికొచ్చిన delivery boyని కాల్చుకుతిన్నారు. Delivery boyని ఇంటర్వ్యూ చేయడానికి ఏముంటుంది? హాద్దులుమీరిన శాడిజం కాకుంటే?


మన మీడియా భాజపా చంకలు నాకుతోంది. భాజపాకు ఇబ్బంది కలిగించే అంశాలమీద చర్చలు జరపడం దానికి ఇష్టంలేదు. అందుకే... చైనా గురించో, GDP గురించో, unemployment గురించో, కరోనా విలయతాండవాన్ని ఆపడానికి ప్రభుత్వం చేపడుతున్న పనులగురించో భారతీయ మీడియా చర్చించదు. అలా చర్చిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకురావు. అందుకే వాళ్ళు రామమందిరం, హిందూ-ముస్లిం విభేదాల గురించి రోజుల తరబడి చర్చిస్తారు. మధ్యలో ఎవరైనా అశక్తులు, బలహీనులు దొరికితే కర్కశంగా వాళ్ళను రోడ్డుకీడ్చి, వాళ్ళ బ్రతుకులు బజారుపాలు చేస్తారు. అందునా కొన్ని మీడియా సంస్థలు ఎలా తయారయ్యాయంటే... స్టూడియోలో కెమేరాలముందు అశుధ్ధం తింటే TRPలు వచ్చేటట్లైతే, వాళ్ళు ఆపనీ చేసేస్తారు.