Saturday, September 26, 2020

newslaundry.com


నిజమైన రిపోర్టింగ్ వీళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు B & D మీడియాను బజారులోకి లాగుతుందీ వీళ్ళే. ఈ మధ్య వీళ్ళ సైటులో కాస్త బుర్రవున్న వ్యాసాలు, వీళ్ళ podcastల్లో పనికొచ్చే చర్చలు చూస్తున్నాను. ఆ మధ్య వీళ్ళే వాడెవడో దూబే అరెస్టైతే వీళ్ళు "వీడుకూడా ఎంకౌంటర్‌లో ఛస్తాడు చూడండి" అని చెప్పేశారు. దానికిగాను అర్ణభుడు "death predictions కూడా ఇచ్చేస్తున్నారా ఈ launderers of news?" అంటూ నిప్పులుతొక్కిన కోతిలా గంతులేశాడు స్టూడియోలో. తీరా తెల్లారాక దూబేయుడు నిజంగానే ఎంకౌంటర్లో చచ్చాడు. మూసుక్కూచోవడం అర్ణభుడి పనైంది. ఈ మోదియా (మోదీ మీడియాకు మరోపేరు. ఇంకో హిందీపదం గుర్తొస్తే అది ఎవరి తప్పూకాదు.) ఈ మధ్య మోదీని వెనకేసుకు రావడానికి ఎవర్ని పడితే వాళ్ళను బదనాం చేస్తోంది. మొదట JNU విద్యార్ధులు,  తరువాత మేధావులు, రైతులు, సినిమావాళ్ళు ఇలా... మొన్నామధ్య ఒళ్ళు బలిసిన ఒక ఛానెల్ చైనావాడు ఇండియా సరిహద్దుల్లోకి చొచ్చుకు వస్తే అదంతా సైన్యం వెధవాయితనం... దానికి ప్రభుత్వాన్ని తప్పుబట్టాల్సిందీ, ప్రభుత్వం జవాబు చెప్పాల్సింది ఏమీలేదనేదాకా వెళ్ళింది వ్యవహారం. 

నేను టీవీలు, అందులోవచ్చే వార్తలు చూడను. ఏముంది గనుక చూడ్డానికి. భడవా మీడియాలో అంతా మతంపేరిట జనాలను విభజించే కుట్రలు, బీజేపీ చంకలు నాకడం. తెలుగు మీడీయాలో కులాల కుంపట్లు మరియు కులాలవారిగ చంద్రబాబుదో, జగనుదో నాకడం. స్వాభిమానం ఉన్నవాళ్ళెవ్వరూ తెలుగుపేపర్లు చదవరు అని నా ఒకానొక మిత్రురాలి అభిప్రాయం. కానీ పవిత్ర భారద్దేశానికి పట్టిన గతే భారద్దేశ మీడియాకూ పట్టిందని చెప్పే ఈ TV Newsance మాత్రం తప్పకుండా చూస్తాను. వీళ్ళుచేసే వెటకారాలు, మీదియా బట్టలిప్పి నుంచోబెట్టడం నాకు నచ్చుతాయి. పనిలోపనిగా అసలు విషయాలు, విస్మరించబడుతున్న విషయాలు "ఇవీ" అని under currentగా చెబుతూనే ఉంటారు. అందుకే ప్రస్తుతానికి ఒక ఆరునెలల చందా కట్టేశాను. 


అన్నట్లు... ఈ డిజిటల్ మీడియాను చూసే... మోదీ సర్కారు కింద మేకుదిగినట్లు ఉలిక్కి పడుతోంది. రేప్పొద్దున డిజిటల్ మీడియాకూ కళ్ళెమేసి ఇండియాను పాకిస్తాను కాకపోయినా ఒక చైనానో, ఉత్తరకొరియానో చేస్తారని నాకు డౌటనుమానం.