మొన్నేమో ఖాసిం సులేమానీ అనే జనరల్ను చంపేశాడు. ఇంతా చేస్తే ఇదే సులేమానీ ISISను ఎదుర్కోవడంలో సహాయపడ్డాడట. ఇప్పుడు ఏకంగా ఐదు దేశాలు అమెరికా మీద మండిపడుతున్నాయ్. ISIS ఈసారి బలమైన నాయకత్వంతో బలంపుంజుకొంటోందని BBCవాడు అప్పుడెప్పుడో ఒకసారి రాశాడు. ఇప్పుడేమో ఇది. అసలు అమెరికన్ ప్రభుత్వాలకు బుర్రలు మోకాళ్ళలో ఉంటాయేమో! అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఈదెబ్బతో డుబుంగున మునిగాయి. అక్కడ ఇరానులోనేమో "ప్రతీకారం తీర్చుకుంటాం" అంటూ ప్రతీకాత్మకంగా మసీదులపై ఎర్రజెండాలు ఎగరవేస్తున్నారు (పచ్చ జెండాలకు బదులుగా). హుస్సేన్ ని 682లో చంపేసినప్పుడు ఎగరేసిన ఎర్రజెండా ఇంకా అలానే ఉందట. ప్రతీకారం తీర్చుకున్నాకనే దాన్ని తీసేసి పచ్చ జెండా ఎగరేస్తారట. ఇప్పుడు దానికి ఇంకోటి జత కలిసింది.
అయినా ట్రంపుకు బుధ్దుండాలి. ఇలాంటి పనికిమాలిన పనులు ఇప్పుడా చేసేది? ఆనక సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలుకూడా వదలం అంటూ బెదిరింపొకటి. ఈ విషయంలో అమెరికన్లు చాలా సేఫ్. వాళ్ళకి చరిత్ర, సంస్కృతి ఏమీ లేవు. కాబట్టి ఇంకెవడో వచ్చి వాళ్ళ చారిత్రక ప్రదేశాలను ఏదో చేస్తాడనే భయం అస్సలు లేదు. బమియాన్ బుధ్ధ విగ్రహాలను కూల్చిన తాలిబన్ గాడిదల్లాగా ఇరానునూ, ఇరాకునూ నాశనం చెయ్యండ్రా.
ట్రంపుడంటాడూ... మేము విమనాశ్రయం కట్టడానికైన ఖర్చులు మీరిచ్చేదాకా మేమిక్కడినుంచి కదిలే ప్రసక్తే లేదు అని. ఇదేం లాజిక్కు మాష్టారూ. వీళ్ళు పోయి దేశాన్ని సర్వనాశనం చేస్తే అదేమీ లెఖ్ఖలోకి రాదా? వీళ్ళు కట్టిన తొక్కలో విమానశ్రయమ్మాత్రం లెక్కా? నేను గనుక ఇరాకు ప్రధాన్నయ్యుంటేనా... "ముందు మాదేశమ్నుంచి దొబ్బేసి, మా దేశాన్ని నాశనం చేసినందుకు నువ్వు కట్టాల్సిన జరిమానాలోంచి నీ బోడి విమానాశ్రయం ఖర్చులు మినహాయించుకొని, మిగిలిన డబ్బులు వడ్డీతోసహా కట్టరా గాడిదకొడకా" అనుండేవాణ్ణి.
ఉదయాన్నే తెలిసిన విషయం ఏమిటంటే ఇరాను అమెరికా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించిందట. ఇప్పుడు అమెరికా వాటికి జవాబివ్వక తప్పనిసరి పరిస్థితి. బుష్షులాగా, ఒబామాలాగా, మోదీలాగా ట్రంపుడుకూడా రెండోసారి ఎన్నికవ్వాలంటే ఇప్పుడు యుధ్ధమే శరణ్యమనేది బుష్షునేర్పిన పాఠం. ఇప్పుడు ఇరానుకు మద్దత్తుగా ఏ ఉత్తరకొరియానో, రష్యానో, చైనానో రంగంలోకి దిగితే ఈ యుధ్ధం ప్రపంచవ్యాప్తమవుతుంది. అలాగేమీ కాకున్నా ఇండియా, జపానులు చమురుకోసం చకోరపక్షుల్లా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిపడుతుంది. అసలే Mr. Intermediate పుణ్యమాని ఆర్ధికవ్యవస్థ ఇలా తగలడింది ఇప్పుడు దానికి ఈ యుధ్ధమూ జతకలిస్తే అప్పుడుంటుంది. ఇప్పటికే రూపాయి పతనమవుతోంది. యుధ్ధమొస్తే ఏ గాడిదకొడుకు దేవుడూ, ఏ గోమాత రక్షించలేరు నాయనా!