Wednesday, November 9, 2022

అందరికంటే వెధవాయిలు భారతీయులే!

నిన్న 'గ్రహణ సమయంలో భోజనం' కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఒక హేతువాద సంస్థ చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసిందట! ఏకాలంలో ఉన్నాం మనం? వాళ్ళెవరో తింటే ఈగాడిదలకొచ్చిన 'గ్నొప్పేమిటసలు'?

  1. మిగతా అన్నిదేశాల్లోనూ గ్రహణ సమయాల్లో ఎవరికితోచింది వారు చేసుకుంటారు. ఒక్క భారతీయులకు మాత్రమే అదికూడా హిందువులకు మాత్రమే ఆసమయంలో కొన్ని పనులు చేస్తే అశుభం కలుగుతుంది! పాపం! 
  2. ఒక్క భారతీయులకు మాత్రమే ప్రతి పనినీ, వ్యాపారాన్నీ ఒక ముహుర్తానికి మొదలు పెట్టాల్సుంటుంది. అలాక్కాకపోతే అవి విజయవంత మవవు. యాపిలూ, అమెజానూ వంటి వాటికి ఇలాంటి ముహుర్తాలు అవసరంలేదు. హిండియన్లకు ఇల్లుమారడానిక్కూడా ఒక ముహూర్తం కావాలి.
  3. మిగతా దేశాలవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది availability మీద ఆధారపడుతుంది. అందే హిండియాలో (లేకుంటే అదే హిండియన్లు ఇతరదేశాల్లో) ముహుర్తాలకోసం ఎదురుచూడాల్సుంటుమంది. 
  4. హిండియన్లకు తూర్పువైపుకుండే ఇళ్ళే కావాలి అదీ ఇంటికి మంచి వాస్తు ఉండాలి. అలా లేకపోతే హిండియన్లు ఆ ఇంట్లో బ్రతకలేరు. ఒకవేళ బ్రతికినా అందరికీ రోగాలొచ్చేస్తాయ్! మిగతా దేశాలవాళ్ళు అదే ఇంట్లో తరాల తరబడీ సుఖంగా ఉండగలరు. హేమిటో ఈ అప్రాచ్యులు!
  5. గ్రహణ సమయంలో ఘొప్ప హిండియన్ దేవుళ్ళు రాహువు అనేవాడిని చూసి వణికి పంచెల్లో, చీరల్లో ఉచ్చలు పోసుకుంటారు. మిగతా దేవుళ్ళకి ఈ గ్రహణమంతా జుజూబీ!