Friday, May 29, 2020

అర్జునుడి రధం, కర్ణుడి దెబ్బలు

కురుక్షేత్రంలో కృష్ణుడు కర్ణుడు బాణం వేసిన ప్రతిసారి తెగమెచ్చుకుంటున్నాడట "ఎంత చఖ్హగా కొట్టావు బాణం" అంటూ. అర్జునుడేసే బాణాలకు కర్ణుడి రధం ఎగిరెగిరి పడుతున్నా అర్జుడికి ఎమీ ప్రశంసలు దక్కడం లేదట. అర్జునుడు నొచ్చుకుని అదే అడిగాడట. కౄష్ణుడు "ఒక్కసారి నన్ను రధం దిగనీ నాయనా తరువాత కర్ణుడి బాణాల ప్రతాపం చూద్దువుగానీ" అన్నాడట. ఆ తరువాతి క్షణంలో కర్ణుడు కొట్టిన బాణాలకి అర్జునుడి రధం గాల్లో ఎగిరిపోతానే ఉందట. కృష్ణుడు నవ్వుతూ "తగిలే ప్రతి దెబ్బనీ నేను ఆపుతున్నాను బాబూ అదంతా నీటాలెంటనుకోకు. దెబ్బ నాకు తెలుస్తోంది" అన్నాడట.


అలాగే యుధ్ధమంతా ముగిసాక "ఇక రధం దిగుదామా బావా" అని అర్జునుడంటే కృష్ణుడు "ముందు నువ్వు దిగునాయనా" అన్నాడట. కృష్ణుడు రధం దిగగానే అది పిండిపిండైపోయిందట. ఆస్చర్యపోతున్న అర్జునుడితో కృష్ణుడు "నీ రధాన్ని ఇన్న్నాళ్ళు రక్షించింది నేనే బాబు. నీమీదకి ఏ అస్త్రం వచ్చినా అది నన్ను దాటుకొని రావాలి. అప్పటికే అస్త్రం తనశక్తిని కోల్పొయి ఉంటుంది. ఇక నువ్వు చెయ్యల్సిందల్లా తిరిగి బాణాలు వేసుకోవడమే" అన్నాడట.