Saturday, February 25, 2012

గంగపుత్రులు -something fishy


దీనిగురించి ఈమధ్య రెండుసార్లు విన్నాను. చివరిగా నిన్న నవతరంగంలో రివ్యూ చదివి. ఇదేదో మనకు నచ్చేదేననిపించి చూశాను. సినిమా నచ్చింది. అదే సమయంలో కధను నడిపించడంలో జరిగిన కొన్ని లోపాలనుగూర్చి, మొత్తంగా సినిమా నాలో రేకెత్తించిన ప్రశ్నలగురించి ఇలా రాస్తున్నాను.

లోపాలు: 

1) చర్చిస్తున్న విషయాల్లో ప్రేమ కధకూడా ఉండటం అవసరమా? గంభీరంగా అనిపించే స్టోరీలైనులో ప్రేమకధను, టీవీ ఛానళ్ళ తీరును కొంచెం ఎక్కువగానే జొప్పించి story concentration తగ్గించారేమోననిపించింది.

2) ఈ సినిమాలో మాత్రం conclusion లేకపోవడం నాకు నచ్చలేదు. Conclusion సంగతలా ఉంచినా, అభివృధ్ధ్ది(గా మనం భావిస్తున్నదాని) వల్ల జరుగుతున్న నష్టాలను చర్చిస్తున్న సినిమాలో "అభివృధ్ధికి హద్దులేమిటి?", "అది ఎంతవరకూ అవసరం?", "అభివృధ్ధ్ది Vs అస్థిత్వ పోరాటాలు" లాంటి విషయాలను చర్చించకపోవడం లోపంగా చెప్పకతప్పదు.

3) "చేపలదానిగా పుట్టినందుకు నేనెప్పుడూ సిగ్గుపడలేదు" అని చెప్పగల పరిణతి ఉన్న వీరోయిను, వీరోగారు అలా అనగానే మొత్తం అభిమానాన్నీ గంగపాలుచేసేసి తెల్లతోలుకోసం తెగబారెడు కష్టపడిపోవడం, దాని సాకుగా B- grade కన్నా తక్కువస్థాయిలో ఒక సాంగు అనేవి పాత్ర ఔచిత్యాన్నీ, చర్చించదలుచుకున్న విషయమ్మీద దర్శకుడి నిబధ్ధతను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఐటంసాంగు లేకుండా సినిమాతీయడం అనేది సాంప్రదాయం కాదు(??) కాబట్టి దాన్నలా ఉంచాల్సొచ్చింది అనేది సమాధానమైతే మాత్రం ఈమొత్తం ఘట్టం భావదారిద్ర్యానికే పరాకాష్ట కాగలదు.

4) వీరో వీరోయినులు తమ యాస విషయంలో మరింత కష్టపడుండాల్సింది (నేనేమీ విజయనగరం యాస విషయలో ఎక్స్పర్టును కాను కానీ ఆపాత్రలు గుంటూరు యాస మాట్లాడితే మాత్రం పంటికిందరాయి తగిలినట్లు ఫీలయిపోతాను). వీరోయిను మాట్లాడే కొన్ని పదాలు కూడా పల్లెపదాలు కాదు.

నచ్చినవి :

1) "ఐలవ్యూ" అనో, "నేను నిన్ను లవ్(!!) చేస్తున్నాను" అనో కాకుండా అసలా గోలేలేకుండా వీరోగారు ప్రేమను వ్యక్తంచెయ్యడం, దాన్ని వీరోయిను అంగీకరించిన తీరు చాలా నచ్చాయి. ఇంత సిన్సియర్‌గా sorry చెప్పే సన్నివేశం ఈ మధ్యకాలంలో చూసినట్లు గుర్తులేదు అదికూడా sorry చెప్పకుండా.

2) వీరోయినుచే పలికించిన పలుకులు. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూ సన్నివేశం Well, that's the 'cœur' of the movie. దీని గురించి చర్చించాల్సింది చాలా ఉందని నా అభిప్రాయం. చివర్లో ఒకసారి "పనికిపోతున్నావా, పారిపోతున్నావా?" అని అండమానుకు పోయే వీరోతో అంటుంది. "కూటికోసం కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని" వలసపోకతప్పని పరిస్థితిని కేవలం రెండంటే రెండు పదాల్లో ప్రశ్నించడం చాలాగొప్పవిషయం. Dialogue writer did a great job. Hats off to you sir.

3)చాన్నాళ్ళ తరువాత ఎల్బీ శ్రీరాం, రాళ్ళపల్లి కనిపించారు. చివర్లో ఎల్బీ ఇంట్లో ఫ్యానుండటం వల్ల కలిగిన అనర్ధాన్ని చెప్పినతీరు చాలాబాగుంది. Speculation మాత్రం జూదంకాదా అంటూ ఆయన చేసే వాదం నచ్చింది. మరోసారి RPL వేలంవెర్రి కళ్ళముందు కదలాడింది. ఆనాడు (చిన్నస్థాయిలోనేలెండి)బకరాలయిపోయినోళ్లలో నేనూ ఉన్నాను :) . 

4) అనిల్ ధీరూబాయ్ క్షమించాలి అజయ్ ధీరజ్‌గా సుబ్బరాజు బాగా నటించాడు. రావు రమేష్ ఆవేశాన్ని ప్రదర్శించి ఆచరణలో చతికిలబడే పాత్ర పోషించాడు -ఎప్పటిలాగే. కానీ ఈ సినిమాలో ఆపాత్ర నాకు నచ్చింది.

నాగోల :

1) భారతీయ సంస్కృతిని పాశ్చాత్య సంస్కృతి కబళించేస్తోందని మనం బాధపడతున్నాంకదా మరి మనమ్మాత్రం ఆదివాసీల సంస్కృతుల్ని కబళించవచ్చా? మొదటి caseలో అభివృధ్ధి-చెందిన-వారు positionలో అమెరికన్లున్నారు (వారి సంస్కృతి ఉంది) రెండవ caseలో "మనం" ఉన్నాం అంతేకదా తేడా. ఇద్దరూ మీకు అభివృధ్హ్ది చెందడంతెలీదు మేము మిమ్మల్ని ఉధ్ధరిస్తున్నాం అనేకదా చెబుతున్నారు. మెజారిటీ ప్రజలు బాగుపడటానికైనా మైనారిటీ (ఆదివాసీలు) ప్రజల భూముల్ని లాగేసుకొని మీకు ఉద్యోగాలు కల్పిస్తాం మీరూ మాలాగే ఉండండి, సుఖంగా ఉండండి అంటూ మనం చేస్తుంది వాళ్ళ సంస్కృతి నాశనం కాదా? మన సుఖాలకోసం ఎప్పుడూ వాళ్ళే "త్యాగాలు" చేశారుకానీ మనమెప్పుడైనా వాళ్ళకోసం చిన్నత్యాగమైనా చేశామా? Native population ని బాధలుపెట్టినవాళ్లలో అలనాటి అమరికన్లేకాదు (రెడిండియన్లను అమెరికనులు ఎంచేశారన్నది మనకు నేడు తెలిసిన విషయమే) మనం కూడా ఉన్నామేమో అనిపించింది. కానీ మనమ్మాత్రం రెడిండియన్లను గురించి చర్చించేటప్పుడు ఒక stance, ఇక్కడి ఆదివాసీల గురించి చర్చించేటప్పుడు ఇంకొక stance తీసుకుంటాం కాదా?
Vs
అభివృధ్ధ్ది సర్వవ్యాపితంకాకుండా ఒక వర్గానికే పరిమితమైపోతే అప్పుడు సంభవించే ఆర్ధిక అసమానతల్ని ఎదుర్కోవడం ఎలా? "మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి" అన్న నూకాలమ్మ సంతానం "అభివృధ్ధిలో మమ్మల్ని భాగంచెయ్యలేదే" అని అంటే దానికి మనమేం సమాధానం చెప్పగలం? ఆమాటకొస్తే నూకాలమ్మ మాత్రం ఏం సమాధానం చెప్పగలదు?

2) ఇదే సినిమాలో చిన్న మత్సకారులు (దీన్ని వ్యాపారస్తులకు అని ఇకమీదట వ్యవహరిస్తాను), కొంచెం పెద్ద వ్యాపారస్తుల వల్ల నష్టపోయారని (కానీ పెద్ద stress చెయ్యలేదు ఆ pointని) వాళ్ళు మళ్ళీ కార్పొరేట్ వ్యాపారస్తులవల్ల నష్టపోయారు కాబట్టి మనం corporate వ్య్హాపరస్తులను, వ్యాపారాలను వ్యతిరేకించాలన్నారు. సరే అలాగే చేద్దాం Let's place every corporate businessman out of the business. But we still are left with having to deal with the medium sized businessmen. And if we further implement the same policies we will end up with standardising the "size" of the bisiness. Isn't it? What is the ideal solution to the problem if at all it exists? 

3) పెద్ద వ్యాపారాలు చిన్నవ్యాపారాలకు ఒక సమస్యగా కాకుండా ఉండాలంటే, ఈ సినిమాలో చూపించినట్లుగా వాటివల్ల చిన్న వ్యాపారస్తుల జీవితాలు చిన్నాభిన్నం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎలాంటి విధానాలు అవలంభించవచ్చు అనే విషయమ్మీద ఏవైనా మార్గదర్శకాలున్నాయా? 

0 comments: