ఇది నాచేతికొచేసరికి ఇదేంటో, దేనిగురించో నాకు తెలీదు. తీరా కొంచెం చదివాక అర్ధమయ్యిందేమిటంటే ఇది మహాభారతం గురించి. So what?? మరికొంచెం చదివేసరికి పుస్తకంలో రచయిత లేవనెత్తిన ప్రశ్నలు ఇది ఇలా చదవదగ్గ పుస్తకంకాదు అనిపించి ఈ పుస్తకాన్ని కొనిపించాయి. అప్పటికే క్యూలో కొన్ని పుస్తకాలుండడం వల్ల కొన్నతరువాత దాదాపు నెల్నాళ్ళకి దీన్ని పూర్తిచెయ్యడం సాధ్యమయ్యింది.
మహాభారత చరిత్రతో మొదలయ్యి, అది సూతుల చేతినుండి భృగువంశ బ్రాహ్మణుల చేతిలోపడ్డాక దీని రూపురేఖలు మారిపోయిన విధానాన్ని చర్చిస్తూ, మహాభారత పాత్రల విశ్లేషణ చేస్తూ, అందులో ప్రక్షిప్తాలుగా(later interpolations అంటే వాడుకలోని పదం ప్రక్షిప్తమేనా ఇంతకీ??) భావించిన సంఘటనలను పక్కనబెడుతూ, మధ్యమధ్యలో రామాయణంతో పోల్చుతూ, ప్రస్తుత సమాజాన్ని మహాభారతకాలంనాటి సమాజంతో పోల్చడానికి చేసే ప్రయత్నంతో పుస్తకం ముగుస్తుంది. ఇది "కుంచెం" అర్ధమయ్యీ అర్ధంగాకుండా వుండటంతో ఇంకొన్ని నెలల తరువాత "ఒన్స్‌మోర్" అందామనుకుంటున్నాను.
పాత్రల గురించిన చర్చ ఇలాసాగింది:
భీష్మ: భీష్ముడు తన జీవితంలో గెలిచింది ఒకేఒఖ్ఖ యుధ్ధమైనా (పరశురాముడితో. తీరా అదికూడా ప్రక్షిప్తమయ్యే అవకాశాలే ఎక్కువట) ఎందుకు అంత ప్రాధాన్యతనిచ్చారో తెలిదంటారీమె. భీష్ముడు చేసిన త్యాగాలను, చివరకు యుధ్ధాన్ని తద్వారా వంశనాశనాన్నీ నివారించడానికీ చేసిన ప్రయత్నాలను ఎన్నదగినవంటూనే, ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో ఏఅధికారమూలేని విదురుడికున్న బుధ్ధినైనాప్రదర్శించలేదని విమర్శిస్తారు. అసలీ త్యాగాల విషయానికే వస్తే "Palace of the Illusions"లో ఎవరో ఒకపాత్ర అంటుంది "Never trust a man who could forgo the very human emotions" అని. అప్పుడుమాత్రం భీష్ముడిపై కొంచెం జాలేసింది. ఇక్కడికొస్తే భీష్ముడు మాటకు కట్టుబడి "ఇకచాలు నాయనా. నీ ప్రతిజ్ఞ పక్కనబెట్టి తమ్మునిభార్యలను పెండ్లాడు" అని ప్రాధేయపడినా, వాగ్దానభంగాన్ని(ఒకవేళచేస్తే) ప్రశ్నించేవారెవ్వరూలేకపోయినా కొనసాగడం లాంటివి నాకెప్పుడూ నచ్చేస్తాయ్. ఈయన్ని చంపడం విషయానికొస్తే మొత్తం కృష్ణుని బోధకూడా విఫలమైనట్లే పరిగణించొచ్చట. పదవరోజున "అర్జునిని శరములు దహించివేస్తున్న తీరు"ని దుశ్శాశనుడితో చెప్పుకోవడాన్నిగురించి మాట్లాడుతూ... భీష్ముణ్ణి రక్షించాల్సిన బాధ్యతను పంచుకున్నవాళ్లలో దుశ్శాశనుడుకూడా ఒకరట మరి తనకు బాణాలు తగులుతున్నాయన్న విషయాన్ని ఆ దుశ్శాశనుడికే చెప్పుకొంటున్నాడంటే బహుశా భీష్ముడున్నంతవరకూ యుధ్ధం సజావుగా సాగదని భావింది అడ్డుతొలగించడానికే ఎవరూ కావాలనే రక్షించేవుండరనే సందేహాన్ని వెలిబుచ్చుతారు రచయిత. మరిలాంటి భిష్ముడుకూడా తనకోసం తాను చేయడానికి పూనుకోని పనులను ఇంకొకరికోసం చేయడమేమిటి? అయినా కర్మఫలాన్ని మనమనుభవించంతమాత్రాన, దానిపై అనురాగం లేనంతమాత్రాన మనంచేసే ప్రతిపనీ ధర్మబధ్ధమైపోదుకదా అనే ప్రశ్నతో ముగిస్తుంది (Is a person justified in doing things for others which would be condemned if he did it for himself?)
విదురుడు: విదురుడు ధర్మానికి ప్రతిరూపం. ధర్మరాజా యమధర్మరాజువల్ల కల్గినవాడు. ఈ రెండు విషయాలనీ పరిగణలోకి తీసుకొని నిజానికి ధర్మరాజు విదురుడికే నియోగం వల్ల జనించివుండొచ్చు అన్న deduction మాత్రం నిర్ఘాంతపరిచింది. నిజానికి విదురుడు తను చనిపోయేటప్పుడు తన శక్తిని ధర్మరాజుకు ధారపోసేందుకు చేసే కర్మకూడా తండ్రీకొడుకుల మధ్య జరగాల్సిందట. కేవలం సూతవర్గానికి చెందినంతమాత్రాననే సమర్ధుడైనా, able bodied ఐనా ప్రక్కన పెట్టేసి మిగిలిన ఇద్దరినే రాజుగా ప్రకటించాల్సిరావడం వాళ్ళిద్దరి చుట్టూ కధ తిరగాల్సిరావడం బాధాకరమంటుంది.
ద్రౌపది: ద్రౌపదిని, సీతతో పోల్చిచూడ్డం, సీతకన్నా, ద్రౌపదే అందరిచేతా ప్రేమించబడిందని చెప్పినతీరు బాగున్నాయ్. పోలికల విషయానికొస్తే సీత ద్రౌపది, ఇద్దరూ ముఖ్యనాయికలు. ఇద్దరూ భూమిలోనుండి ఉద్భవించినవారు, ఇద్దరూ స్వయంవరంలో తమకాలపు The best archerని వరించారు అదికూడా స్వయంవరంలో, ఇద్దరూ అడవులపాలైనారు. ఇక contrats విషయానికొస్తే అవన్నీ కావ్య లక్షణాలవల్ల కలిగినవేనట (రామాయణం ప్రధానంగా రాముడుకధ అందులో సీతది కేవలం రాముని గుణాలను ప్రస్పుటంగావించేది మాత్రమేకాగా ద్రౌపది అందరికీ భార్యకావడంద్వారా she had become a linchpin that held them together). ఇదే అధ్యాయంలో ధర్మరాజే ద్రౌపదిని ఎందుకు ముందుగా పెళ్ళిచేసుకోవలసివచ్చింది అన్నవిషయాన్ని చర్చిస్తూ ఆనాటి నియమాలప్రకారం ఎవరి భార్యను ఎవరు పొందవచ్చు అని చేసిన చర్చ మాత్రం too crass. Thank God we don't derive our morals from these books అనిపించింది. That's it... జూదంలో ఓడాక "తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా?" అంటూ ద్రౌపదిచేసిన చర్చ అసందర్భమన్నప్పుడు మాత్రం నేను ఏకీభవించలేకపోయాను. While the respect was at stake, the husbands were watching in silence and the elders like Bhishma were engaged in USELESS discussions of "What is Dharma?" I didn't understand how she(the author) would expect Droupadi to keep quite -even the struggle were to be futile." తీరా ఈ వస్త్రాపహరణం విషయానికేవస్తే దొక "divine miracle" అట. మొత్తం attribution of divinity ని later interpolation అని కొట్టిపడేసిన ఈవిడ ఇదొక్కదాన్నీ యధాతధంగా అంగీకరించడం ఒక వింత. అదే "పర్వ"లో ద్రౌపది తన స్నేహితుడైన కృష్ణుడితోటీ, బలమైన యాదవ సామ్రాజ్యముతోటీ, సోదరుడు దృష్టద్యుమ్నునితోటీ, ద్రుపదరాజ్యముతోటీ యుధ్ధముచేయగల ఖలేజావుంటే చీరలాగి చూడమంటుంది.
కర్ణుడు: ఈయన జీతంలోని అసంతృప్తిని అలావుంచితే. ఈయనకూడా గొప్ప యోధుడేమీకాదట. ఆమాటకొస్తే ఈయన గెలిచిన యుధ్ధాలేమున్నాయికాబట్టి? అవన్నీ(కవచకుండలాలు) వుండగా ఏ యుధ్ధమూ గెలవలేదుగానీ, అవి దానమివ్వడాన్ని ఎంతగా ఎందుకు gratify చేశారో అర్ధంకాలేదంటారు రచయిత. అలాగే సభలోకి ద్రౌపదీడ్చుకురమ్మంది కూడా మొదట కర్ణుడేనట. బంధువుల గొడవల్లో తలదూర్చడం అందునా అధర్మంగా ప్రవర్తించమని ప్రోత్సహించడం కర్ణుడికి తగదంటుంది. దుర్యోధనుడికీ, కర్ణుడికీ మధ్య సాగిన స్నేహం కులపరిమితులకు లోబడే సాగిందట. అదేమీ దా.వీ.సూ కర్ణ లో చూపించిన ఉండేదికాదట. అంగ రాజ్యాన్నివ్వడమూ ప్రక్షిప్తమేనట (నిజానికా తరువాతి అధ్యాయంలో రాజ్యాన్ని ధర్మరాజుకివ్వడం గురించిన చర్చసాగుతుందట. అయినా ఇవ్వడానికి అప్పటికి దుర్యోధనుడేమీ రాజుకాదట). కర్ణుడు జీవితమంతా క్షత్రియుణ్ణనిపించుకోవటానికి కష్టపడి చివరకి అదికాస్తా దక్కే అవకాశంవచ్చినప్పుడు స్నేహధర్మాన్ని పాటించి అందరిమనసులూ గెలుచుకున్నాడనిపిస్తుంది. కర్ణుడి శాపాలూ, దానగుణమూ లాంటివన్నీ ప్రక్షేపాలేనంటు... "చివరికి నీకు ఐదుగురు కొడుకులు తధ్యము" అనేది దుర్యోధనుడికి చేసిన మాట తప్పడమే కదా అంటారు రచయిత.
కృష్ణుడు: మహాభారతం మొత్తంలో ఏ లోపమూ లేని పాత్ర కృష్ణుడిదని రచయిత అభిప్రాయ పడ్డారు. ఆమాటకొస్తే మహాభారతంలోని అన్ని పాత్రలూ మానవసహజమైన బలహీనతలతో కూడుకున్నవేనట (unlike Ramayana which portrays an ideal man, and ideal woman, ideal brothers, idela servants even an ideal villain :D) ఈ ఒక్కటి దక్క. కృష్ణుడు లక్ష్యం "వాసుదేవుడు" స్థాయిని అందుకోవడమూ, అలా కీర్తించబడటమూ అంటూ చివరకు స్త్రీలనూ, వృధ్ధులనూ, పిల్లలనూ తరలించే బాధ్యత సమర్ధులైనవారికి అప్పగించి తానుమాత్రం unprotectedగా (అడవి safe place కాదుకదా) ఏదో చావుకోసం ఎదురుచూస్తున్నట్లు నిర్వికారంగా అలా చెట్టుకింద కూర్చోవడాన్నిబట్టి ఆ స్థాయిని చేరుకొన్నట్లేనంటారు. భారతంలో కనిపించే కృష్ణుడు విష్ణువు అవతారం కాదట. కృష్ణుణ్ణి deify చేసింది అభిరసుడి తరఫువాళ్ళట.
ప్రస్తుతానికి తెలిసుకున్న విషయాలు ఇవి.
- మహాభారత కాలం క్రీ.పూ. 1000 నాటిదట. దీనిని కొందరైతే రాశుల స్థానాల ఆధారంగా కూడా బలపరచియున్నారు. ఈ మధ్యే దీని గురించి చదువుతుంటే ఇది కొంచెం అర్ధమయ్యీ అర్ధమవ్వనట్లుగా తగిలింది. ఈ విషయంలో సహాయాన్నర్ధించడమైనది. ముందస్తుగా ధన్యవాదములు.
- మొదట్లో సూతులు "జయ" అనే ఒక కావ్యాన్ని రాజసభల్లోనూ, ప్రజా సమూహాలవద్ద గానంచేస్తుండేవారట. అదికాస్తా చేతులుమారాక "మహా"భారతమయ్యిందట.
- ద్రౌపది కర్ణుడిని కోరుకున్నదన్నది జైనపురాణంలీనిదట. అలా కోరుకున్నట్లు మహాభారతంలో చెప్పబడలేదట.
- సీత తనశీలంపై నిందనుమోస్తూ అడవులపాలవడం గురించి మహాభారతంలో ఒక్క రిఫరెన్సూ లేదట (కానీ సీత అనుభవించిన ఇతర కష్టాలగురించి మాత్రం మాట్లాడుకుంటారట). కాబట్టి ఆ అడవులకివెళ్ళే ఘట్టం ప్రక్షిప్తమట. మొత్తం ఉత్తరకాండమే ప్రక్షిప్తమనే వాదనఒకటి ప్రాచుర్యంలోకూడా వున్నట్లుంది. సరే... సీత విషయానికే వస్తే కాళిదాదు, భవభూతి లాంటి మహాకవులు రాముడుకూడా సీతవెంట అడవులకెళ్ళుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారట.
- వ్యాసుడి నలుగురు శిష్యులూ నాలుగు రకాలుగా మహాభారతాన్ని చెప్పారట. ప్రస్తుతం పాండవులకు favourగా వున్నది వైశంపాయనుడి మహాభారతమట. జైమినీ మహర్షిది కౌరవులకు favourగా వుంటుందట. :)
- Conciousకి ప్రతీక వెలుతురుకాబట్టి. వెలుతురు ఎక్కువగా ఉండేరోజుల్లో చనిపోవడం (భారతదేశం ఉత్తరార్ధగోళంలోవుంటుంది కాబట్టి) అనేది ఉత్తరాయణంలో(సూర్యుడు తనరశ్మిని ఉత్తరార్ధగోళంలో ప్రసరించే రోజుల్లో) చనిపోతే పుణ్యలోకాలు ప్రాప్తించే సాంప్రదాయానికి మూలమట.
- మహాభారతం తరువాతకాలంలో adoption అనేది లేదట. అది వచ్చాక పాతివ్రత్య ధర్మాలు కఠినతరమైనాయట.
- భగవద్గీతలా కర్మను ప్రోత్సహించని భక్తిమార్గం కూడా ఆరోజుల్లో లేదట. నిజానికి దేవాలయాల ప్రష్తావనకూడా భారతంలో లేదట (మరి అర్జునుడు పాశిపతాన్ని ఎలా సంపాదించాడో మాత్రం నాకర్ధం కాలేదు. తపస్సుచేసేకదా?)
- ఈవిడ (too unrealistic కాబట్టి) రామాయణాన్ని కావ్యంగానూ, భారతాన్ని చరిత్రగానూ పరిగణించారు. ఆప్రకారంగా మన చరిత్రలో మనమే ఇన్నేసి ప్రక్షిప్తాలు చేర్చేసుకున్నామంటే... మనకు మన చరిత్రకన్నా మన స్వార్ధప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు ఇతరులక్కూడా అంతేకదా అనిపించింది. మనదాంట్లో మనమే ఇన్నేసి అభూత కల్పనలు కూర్చేసుకొని, ఇప్పుడు ఇంకెవరో చరిత్రను భ్రష్టుపట్టించారు, పట్టిస్తున్నారనటం నాకు fairగా అనిపించలేదు.
ప్రశ్నలు:
1) ఈ యుయూత్సుడు నూటొకటోవాడా లేక ఆ వందమందిలోనే ఒకడా? ఈయన ధృతరాష్టృడికి ఎవరివల్ల కలిగాడు?

5 comments:
వీలైతే సంస్కృత భారతానికి తెలుగు అనువాదం [ ఎందుకంటే మనకు సంస్కృతం ఎక్కదు గనక ;-) ], పర్వ కూడా చదవండి. చదివినతరువాత మూడింటిలోని కథనూ, పాత్రలనూ, ఆనాటి కుటుంబవ్యవస్థను, నియోగమనేది మహాభారతకాలంలో నే దుర్యోధనుడు ప్రశ్నించడాన్ని ఇలాంటి వన్నీ మీకు మీరే తర్కించుకోని మీ ఇష్టమొచ్చిన కథను స్వీకరించండి.వేరే ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే చెప్పిన పెద్దగా ప్రయోజనం ఉండదు :))
పర్వ ఇంతకు ముందు చదివానండీ. Thank you.
బావుందండి మీ పరిచయం !
మనదాంట్లో మనమే ఇన్నేసి అభూత కల్పనలు కూర్చేసుకొని, ఇప్పుడు ఇంకెవరో చరిత్రను భ్రష్టుపట్టించారు, పట్టిస్తున్నారనటం నాకు fairగా అనిపించలేదు.
------------------------
Can't agree more !
Sravya Vattikuti గారు : Thank you.
of finally u read it...good :)
I was pretty impressed by the analysis on Krishna and Droupati more.
Post a Comment